Samsung Fab Grab Fest: శామ్‌సంగ్ ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్ బ్యాంగ్‌తో తిరిగి వచ్చింది!-samsung fab grab fest is back check amazing offers and discounts on smartphones and more full details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Samsung Fab Grab Fest: శామ్‌సంగ్ ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్ బ్యాంగ్‌తో తిరిగి వచ్చింది!

Samsung Fab Grab Fest: శామ్‌సంగ్ ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్ బ్యాంగ్‌తో తిరిగి వచ్చింది!

Sharath Chitturi HT Telugu
May 13, 2023 09:46 AM IST

Samsung Fab Grab Fest : శామ్‌సంగ్ ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్ బ్యాంగ్‌తో తిరిగి వచ్చింది. శామ్‌సంగ్ ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్‌లో ఏసీలు, మొబైల్స్​, రిఫ్రిజిరేటర్‌లు, ఏసీలు అన్ని ఉపకరణాలపై మీకు ఇష్టమైన ఉత్పత్తుల కోసం నమ్మశక్యం కాని డిస్కౌంట్‌లతో షాపింగ్ చేయవచ్చు. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

అదిరిపోయే డిస్కౌంట్లకు అడ్డా- 'శామ్​సంగ్​ ఫ్యాబ్​ గ్రాబ్​ ఫెస్ట్​'!
అదిరిపోయే డిస్కౌంట్లకు అడ్డా- 'శామ్​సంగ్​ ఫ్యాబ్​ గ్రాబ్​ ఫెస్ట్​'!

Samsung Fab Grab Fest : ఈ వేసవిలో ఎన్నడూ లేనంత తక్కువ ధరలకు మీకు ఇష్టమైన శామ్‌సంగ్ ఉత్పత్తులను పొందొచ్చు! అవును, మీరు చదివింది నిజమే. ఈ ఏడాది అతిపెద్ద షాపింగ్ ఉత్సవం - "శామ్‌సంగ్ ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్‌" అద్భుతమైన డీల్స్​తో తిరిగి వచ్చేసింది. ఈ ఫెస్ట్​లో.. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మోడల్స్​పై 57శాతం కంటే ఎక్కువ తగ్గింపు లభిస్తోంది. అదే విధంగా.. గేమింగ్ మానిటర్‌లపై 58శాతం, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, టాబ్లెట్‌లపై 40శాతం తగ్గింపు లభిస్తుండటం విశేషం.

అదిరిపోయే ఆఫర్లకు అడ్డా..

ఇలా ప్రతి వస్తువుపై ఈ బంపర్ సేల్‌లో కళ్లుచెదిరే డిస్కౌంట్లు. ఇక ఆలస్యం ఎందుకు? నమ్మశక్యంకాని ధరలతో అందుబాటులో ఉన్న శామ్‌సంగ్ ఉత్పత్తులను త్వరగా చేజిక్కించుకోండి.

Galaxy S21 FE 5G : ఈ ఫెస్ట్​లో గెలాక్సీ Galaxy S21 FE 5G స్మార్ట్‌ఫోన్ కేవలం రూ.29,999కే లభిస్తోంది. పరిమిత సంఖ్యలో ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్.. ఫెస్ట్​లో అత్యంత వేగంగా అమ్ముడవుతోంది.

"గెలాక్సీ ఎస్​21 ఎఫ్​ఈ 5జీ ధరను చూసినప్పుడు నేను నా కళ్లను నమ్మలేకపోయాను. అత్యుత్తమ పనితీరు కలిగిన ఈ మినిమలిస్టిక్, సొగసైన స్మార్ట్‌ఫోన్ కేవలం రూ. 29,999కి అందుబాటులో ఉంది. మొబైల్ మాత్రమే కాదు.. ఏసీ, రిఫ్రిజిరేటర్ ఇలా ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్‌లో ధరలు నమ్మశక్యం కానివి" అని గుర్గావ్‌లోని ప్రముఖ ఎమ్​ఎన్​సీలో మేనేజ్‌మెంట్ ట్రైనీ సుశాంత్ రాబ్రా అభిప్రాయపడ్డారు.

శామ్‌సంగ్​లో అత్యధికంగా అమ్ముడవుతున్న గెలాక్సీ ఎస్​21 ఎఫ్​ఈ 5జీ, గెలాక్సీ S23 అల్ట్రా ప్రత్యేకంగా ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్‌లో అందుబాటులో ఉన్నాయి.

Samsung Fab Grab Fest 2023 : "నేను గెలాక్సీ S23ని కేవలం రూ.1,06,999కి ఆన్‌లైన్‌లో చూసి దాదాపుగా కొనుగోలు చేశాను. అదే సమయంలో ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్ గురించి ఒక ప్రకటనను చూసి బ్యానర్‌పై క్లిక్ చేసినప్పుడు, నేను శామ్‌సంగ్.కామ్ లో అడుగుపెట్టాను, అక్కడ నేను అప్‌గ్రేడ్ చేసిన మోడల్‌ను పొందాను. గెలాక్సీ ఎస్​23 అల్ట్రా ఒక సిలికాన్ కవర్‌తో కేవలం రూ.1,03,123కి కొనుగోలు చేయడం ద్వారా మరింత ఆదా చేసుకున్నాను. నన్ను నమ్మండి, ఇటువంటి ధరలు మరెక్కడా లభించవు," అని కార్పొరేట్ లాయర్ ఆకాష్ బంకా తెలిపారు.

మీరు కూడా పట్టణంలోని కొన్ని హాటెస్ట్ ఆఫర్‌ల ప్రయోజనాన్ని పొందవచ్చు. ఏసీలు, స్మార్ట్‌ఫోన్‌లు, వాషింగ్ మెషీన్‌, రిఫ్రిజిరేటర్లు ఇలా అత్యధికంగా అమ్ముడైన శామ్‌సంగ్ మోడల్స్​పై, ప్రతి విభాగంలో మీ అంచనాలను మించే డీల్స్​ ఉంటాయి.

అన్నింటిపై అదిరిపోయే ఆఫర్లు..

Samsung Fab Grab Fest 2023 date : వేసవి తాపాన్ని అధిగమించడానికి రూ.20,990 కంటే తక్కువ ధరకు 253L డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్‌ పొందవచ్చు. ఈ అద్భుతమైన ఫ్రిజ్ 50శాతం వరకు విద్యుత్ ఆదా చేస్తుంది. డిజిటల్ ఇన్వర్టర్ ప్రాసెసర్‌ వల్ల శీతలీకరణానికి తగిన విధంగా వేగాన్ని నియంత్రిస్తుంది. విద్యుత్ లేని సమయాల్లో ఆహారం పాడవకుండా ఫ్రీజర్‌లోని కూల్ ప్యాక్.. ఆహారాన్ని సున్నా డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలో 12 గంటల వరకు ఉంచుతుంది!

ఇక విండ్‌ఫ్రీ ఏసీతో వేడి గాలులను చల్లగా మార్చుకోండి.రూ.35వేల లోపు ధరలో అందుబాటులో ఉన్న ఈ విండ్‌ఫ్రీ ఏసీతో భగభగ మండే వేసవి నుంచి చల్లని ఉపశమనాన్ని పొందండి.

"కొద్దిరోజుల క్రితం మాకు పాప పుట్టింది. అందుకే మా పాత ఏసీని కొత్తదానితో భర్తీ చేయాలని చూస్తున్నాము. పాప ఆరోగ్యం దృష్ట్యా అధునాతనమైన, సురక్షితమైన ఏసీ కోసం చూస్తున్నాము. శామ్‌సంగ్ విండ్‌ఫ్రీ ఏసీ 23,000 మైక్రో ఎయిర్ హోల్స్ ద్వారా గాలిని బయటకు పంపడానికి ఒక ప్రత్యేకమైన సాంకేతికతను ఉపయోగిస్తాయని తెలిసింది. అంతేకాకుండా ఇది దాదాపు 99శాతం హానికరమైన బ్యాక్టీరియాను ఫిల్టర్ చేస్తుందట. మీకు గదిలో స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది. పాప ఆరోగ్యానికి హాని చేయని విధంగా ఉంది. అందుకే నేను రెండు ఏసీలు కొన్నాను - ఒకటి బెడ్‌రూమ్​లోకి, ఇంకోటి లివింగ్ రూమ్ కోసం. రెండు ఏసీలు కొనుగోలు చేయగా అదనంగా 10శాతం తగ్గింపు లభించింది,'' అని వ్యాపారవేత్త అజయ్ బన్సాల్ వెల్లడించారు.

మిడ్-వీక్ బ్లూస్ ఉందా?

Samsung Fab Grab Fest details : ఇంట్లో 4కే యూహెచ్​డీ స్మార్ట్ టీవీలో అద్భుతమైన ఐపీఎల్​ స్క్రీనింగ్ చూడవచ్చు. ఇక్కడ మీరు ప్రతి షాట్‌ను స్పష్టతతో చూడవచ్చు. అలాగే స్వచ్ఛమైన ప్యూర్ కలర్‌తో గేమ్​కు సంబంధించిన అన్ని వివరాలను కూడా గమనించవచ్చు. దీని శక్తివంతమైన 4కే క్రిస్టల్ ప్రాసెసర్ మీకు ఉత్తమ రిజల్యూషన్‌ను అందిస్తుంది.

"నేను 4కే యూహెచ్​డీ టీవీని తీసుకున్నాను దీంతోపాటు స్లిమ్ ఫిట్ కెమెరాను ఉచితంగా పొందాను. కేవలం రూ.29,490 కే లభించిన నా క్రిస్టల్ 4K UHD స్మార్ట్​టీవీ అందులోని ఐఓటీ ఫీచర్ నా ఇంటిని స్మార్ట్ హబ్‌గా మార్చింది. స్మార్ట్ థింగ్స్ ఫీచర్ ద్వారా అన్ని పరికరాలు ఒకదానికొకటి కనెక్ట్ చేవుతున్నాయి. స్మార్ట్ థింగ్స్ ఫీచర్​తో, నేను ప్రతి ఒక్కదాన్ని నియంత్రించగలుగుతున్నా," అని ఐటీ ప్రోగ్రామ్ మేనేజర్ రుద్రవీర్ తెలిపారు.

ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్‌ మించి ఎక్కడ ?

అన్ని శామ్‌సంగ్ ఉత్పత్తులపై ఈ ఫెస్ట్​లో మిగిలిన వాటికంటే తక్కువ ధరలోనే పొందుతారు. వేడిని తట్టుకోవడానికి ఇది కొత్త ఏసీ అయినా, వారం మొత్తం కిరాణా సామాగ్రిలో సరిపోయే పెద్ద ఫ్రిజ్ అయినా, లేదా అత్యంత అద్భుతమైన ఫోటోలను తీసే కొత్త స్మార్ట్‌ఫోన్ అయినా! మరి వేసవి సెలవులో మీరు కుటుంబంతో కలిసి ప్లాన్ చేశారా? అయితే మే 4న ప్రారంభమైన ఈ ఫెస్ట్ ను మిస్ కాకండి. ఇంతకు ముందెన్నడూ చూడని ఈ డీల్‌లను పొందాలనుకుంటే శామ్‌సంగ్ షాప్ యాప్‌కి లేదా మీకు సమీపంలో ఉన్న ప్రత్యేకమైన శామ్‌సంగ్ స్టోర్‌కి వెళ్లండి. మీకు ఇష్టమైన శామ్‌సంగ్ ఉత్పత్తులపై కళ్లుచెదిరే డీల్స్​ను పొందండి.

శామ్సంగ్ షాప్ యాప్ ఎలాంటి సందేహం లేకుండా.. ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి. ఉత్తమ ఆఫర్‌లను క్లెయిమ్ చేయడానికి సిద్ధంగా ఉండండి. ఇంకా అందుబాటులో ఉన్న ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్‌లో మరిన్ని ఆఫర్లు పొందండి. శామ్‌సంగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసినప్పుడు రూ. 4,500 విలువైన ప్రయోజనాలతో వెల్‌కమ్ వోచర్‌ను అందిస్తోంది కూడా!

ఎక్కువ కొనుగోలు..ఎక్కువ ఆదా..

Samsung Fab Grab Fest news : మీరు నిర్దిష్ట ఉత్పత్తులను కొనుగోలు చేసినప్పుడు తుది బిల్లుపై అదనంగా ఐదు శాతం తగ్గింపు పొందొచ్చు. భిన్న ఉత్పత్తులను కాంబోలో కొనుగోలు చేసినా అదనపు తగ్గింపులను అందుకోవచ్చు. వెలకమ్​ వోచర్​తో పాటు మూడు శాతం వరకు మొదటి సారి లాయల్టీ పాయింట్లు లభిస్తాయి. అంతేకాకుండా ప్రముఖ బ్యాంకుల డెబిట్, క్రెడిట్ కార్డ్‌లపై బ్యాంక్ క్యాష్‌బ్యాక్‌ కూడా కలదు. ప్రత్యేకంగా యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌లపై అదనంగా పదిశాతం తగ్గింపు లభిస్తుండటం విశేషం. మీరు మీ పాత ఉపకరణాలను ఎక్ఛేంజ్ చేయాలనుకుంటే అందుకు తగిన ధర కూడా పొందవచ్చు.

ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లు లేదా టాబ్లెట్‌లు వంటివి కొనుగోలు చేసే ముందు ఉత్పత్తులను చూడాలనుకుంటే.. మీరు శామ్‌సంగ్ ఎక్స్‌క్లూజివ్‌ స్టోర్‌ని కూడా సందర్శించి అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. కానీ అవి స్టోర్‌లో మాత్రమే లభిస్తాయని గుర్తుపెట్టుకోవాలి.

మరింత సమాచారం కోసం వాట్సాప్ సందేశాన్ని పంపండి

https://api.whatsapp.com/send?phone=919870494949&text=Fab%20Grab%20Fest-%20Hottest%20Deals.

గమనిక : ఈ కథనం HT బ్రాండ్ స్టూడియో ద్వారా బ్రాండ్ తరపున రూపొందించబడింది.

సంబంధిత కథనం