OnePlus Nord 3 : అదిరిపోయే ఫీచర్స్​తో వన్​ప్లస్​ నార్డ్​ 3.. త్వరలోనే లాంచ్​!-oneplus nord 3 to launch soon in india check features price specifications details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Oneplus Nord 3 : అదిరిపోయే ఫీచర్స్​తో వన్​ప్లస్​ నార్డ్​ 3.. త్వరలోనే లాంచ్​!

OnePlus Nord 3 : అదిరిపోయే ఫీచర్స్​తో వన్​ప్లస్​ నార్డ్​ 3.. త్వరలోనే లాంచ్​!

Sharath Chitturi HT Telugu
May 14, 2023 01:22 PM IST

OnePlus Nord 3 : ఇండియా మార్కెట్​లోకి వన్​ప్లస్​ నార్డ్​ 3 త్వరలోనే లాంచ్​ అవుతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ గ్యాడ్జెట్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

వన్​ప్లస్​ నార్డ్​ 3 లాంచ్​ త్వరలోనే..!
వన్​ప్లస్​ నార్డ్​ 3 లాంచ్​ త్వరలోనే..! (HT TECH/ Representative)

OnePlus Nord 3 : వన్​ప్లస్​ నార్డ్​ సిరీస్​కు ఇండియాలో మంచి డిమాండ్​ ఉంది. ఇక ఇప్పుడు వన్​ప్లస్​ నుంచి నార్డ్​ 3 రోబోతోందని సమాచారం. ఈ స్మార్ట్​ఫోన్​ అతి త్వరలోనే లాంచ్​ అవుతుందని తెలుస్తోంది. సంస్థకు చెందిన అధికారిక వెబ్​సైట్​లో ఇది దర్శనమివ్వడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో ఈ గ్యాడ్జెట్​ ఫీచర్స్​తో పాటు ఇతర విశేషాలపై ప్రస్తుతం ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

వన్​ప్లస్​ నార్డ్​ 3- స్పెసిఫికేషన్స్​..

OnePlus Nord 3 launch date : ఈ స్మార్ట్​ఫోన్​లో టాప్​ సెంటర్డ్​ పంచ్​ హోల్​ కటౌట్​, అలర్ట్​ స్లైడర్​తో పాటు డిస్​ప్లే కింది భాగంలో ఫింగర్​ప్రింట్​ రీడర్​లు ఉండనున్నాయి. ఇందులో 6.74 ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ+ (1240x2772 పిక్సెల్స్​, 120హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​)తో కూడిన అమోలెడ్​ స్క్రీన్​ ఉంటుంది. రెండు కలర్​ ఆప్షన్స్​లో ఇది అందుబాటులోకి రావొచ్చు.

వన్​ప్లస్​ నార్డ్​ 3- ఫీచర్స్​..

ఈ నార్డ్​ 3లో 64ఎంపీ మెయిన్​, 8ఎంపీ అల్ట్రా వైడ్​, 2ఎంపీ మాక్రో షూటర్​తో కూడిన ట్రిపుల్​ కెమెరా సెటప్​ ఉండనుంది. ఎల్​ఈడీ ఫ్లాష్​ లభిస్తుంది. ఇక సెల్ఫీ కోసం ఇందులో 16ఎంపీ కెమెరా వస్తోంది.

ఇదీ చూడండి:- Google Pixel 7a vs Samsung Galaxy A54 : ఈ రెండు స్మార్ట్​ఫోన్స్​లో ఏది వాల్యూ ఫర్​ మనీ?

OnePlus Nord 3 price in India : వన్​ప్లస్​ నార్డ్​ 3లో మీడియాటెక్​ డైమెన్సిటీ 9000 ఎస్​ఓసీ చిప్​సెట్​ ఉంటుందని తెలుస్తోంది. ఎల్​పీడీడీఆర్​5ఎక్స్​ ర్యామ్​, యూఎఫ్​ఎస్​ 3.1 స్టోరేజ్​ ఉండొచ్చు. 12జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్​, 16జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్​ వేరియంట్లలో ఇది మార్కెట్​లోకి అడుగుపెట్టనుంది!

500ఎంఏహెచ్​ బ్యాటరీ ప్యాక్​, 80వాట్​ టైప్​-సీ ఛార్జర్​, వైఫై 6, బ్లూటూత్​ 5.3, ఎన్​ఎఫ్​సీ, జీపీఎస్​తో పాటు ఇతర కనెక్టివిటీ ఆప్షన్స్​ దీని సొంతం.

వన్​ప్లస్​ నార్డ్​ 3- ధర, లాంచ్​..

OnePlus Nord 3 launch : ఈ గ్యాడ్జెట్​ లాంట్​ డేట్​పై ఇంకా సంస్థ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే రూ. 35వేల ధరతో ఇది మార్కెట్​లోకి వచ్చే అవకాశం ఉంది.

వన్​ప్లస్​ ఏస్​ 2వీని ఇటీవలే చైనా మార్కెట్​లో విడుదల చేసింది సంస్థ. దీనినే వన్​ప్లస్​ నార్డ్​ 3కి ఇండియాలోకి తీసుకొస్తోందని సమాచారం. లాంచ్​ తర్వాత పోకో ఎఫ్​5, పిక్సెల్​ 6ఏకు ఇది గట్టిపోటీనిస్తుందని అంచనాలు ఉన్నాయి.

OnePlus Nord 3 price : ఇక వన్​ప్లస్​ నార్డ్​ 3తో పాటు నార్డ్​ బడ్స్​ 2ఆర్​ను కూడా సంస్థ లాంచ్​ చేస్తుందని తెలుస్తోంది.

Whats_app_banner

సంబంధిత కథనం