OnePlus Nord CE 3 Lite 5G Price: వన్‍ప్లస్ నార్డ్ సీఈ3 లైట్ 5జీ ధర ఇదే!-oneplus nord ce 3 lite 5g price in india leaked ahead of april 4 launch ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Oneplus Nord Ce 3 Lite 5g Price: వన్‍ప్లస్ నార్డ్ సీఈ3 లైట్ 5జీ ధర ఇదే!

OnePlus Nord CE 3 Lite 5G Price: వన్‍ప్లస్ నార్డ్ సీఈ3 లైట్ 5జీ ధర ఇదే!

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 29, 2023 12:53 PM IST

OnePlus Nord CE 3 Lite 5G Price: వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ ధర లీకైంది. ఏప్రిల్ 4న ఈ ఫోన్ ఇండియాలో లాంచ్ కానుంది.

OnePlus Nord CE 3 Lite 5G Price: వన్‍ప్లస్ నార్డ్ సీఈ3 లైట్ 5జీ ధర ఇదే! (Photo: OnePlus)
OnePlus Nord CE 3 Lite 5G Price: వన్‍ప్లస్ నార్డ్ సీఈ3 లైట్ 5జీ ధర ఇదే! (Photo: OnePlus)

OnePlus Nord CE 3 Lite 5G: వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ మొబైల్‍ను లాంచ్ చేసేందుకు పాపులర్ బ్రాండ్ వన్‍ప్లస్ (OnePlus) సిద్ధమైంది. ఏప్రిల్ 4వ తేదీన ఈ ఫోన్ భారత మార్కెట్‍లో విడుదల కానుంది. నార్డ్ సీఈ 2 లైట్ 5జీ ఫోన్‍కు సక్సెసర్‌గా ఈ మొబైల్ వస్తోంది. ఈ తరుణంలో లాంచ్‍కు ముందే వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ ధరకు సంబంధించిన వివరాలు బయటికి వచ్చాయి. ఓ లీక్‍స్టర్ ఈ వివరాలను వెల్లడించారు. ఇప్పటికే ఈ ఫోన్‍కు సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్లను వన్‍ప్లస్ టీజ్ చేసింది. తాజాగా ధర వివరాలు లీకయ్యాయి. వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ డీటైల్స్ ఇవే.

OnePlus Nord CE 3 Lite 5G Price: వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ ప్రారంభ ధర రూ.21,999గా ఉంటుందని టిప్‍స్టర్ అభిషేక్ యాదవ్ వెల్లడించారు. ఇది బేస్ వేరియంట్ ధర అని పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. అయితే లాంచ్ రోజున అధికారిక ధరను వన్‍ప్లస్ ప్రకటిస్తుంది. ఏప్రిల్ 4వ తేదీ సాయంత్రం 7 గంటలకు ఈ మొబైల్ విడుదల కానుంది. కాగా, ఇప్పటికే ఈ ఫోన్‍కు సంబంధించిన కొన్ని కీలక స్పెసిఫికేషన్లు బయటికి వచ్చాయి.

67వాట్ల ఫాస్ట్ చార్జింగ్‍తో..

OnePlus Nord CE 3 Lite 5G: వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ ఫోన్‍లో 5,000mAh బ్యాటరీ ఉంటుందని వన్‍ప్లస్ వెల్లడించింది. 67 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుందని అఫీషియల్‍గా చెప్పింది. పాస్టల్ లైమ్, గ్రే కలర్ ఆప్షన్‍లలో ఈ మొబైల్ లభ్యం కానుంది.

OnePlus Nord CE 3 Lite 5G: వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీకి సంబంధించి మరికొన్ని స్పెసిఫికేషన్లు బయటికి వచ్చాయి. స్నాప్‍డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ వస్తుందని తెలుస్తోంది. ఫుల్ హెచ్‍డీ+ LCD డిస్‍ప్లేను కలిగి ఉండనుంది. ఈ ఫోన్ వెనుక 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుందని సమాచారం.

వన్‍ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ గతేడాది లాంచ్ అయింది. 6.59 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+ ఎల్‍సీడీ డిస్‍ప్లేను ఈ ఫోన్ కలిగి ఉంది. ఈ మొబైల్‍లోనూ స్నాప్‍డ్రాగన్ 695 ప్రాసెసర్ ఉంది. లాంచ్ అయిన సమయంలో ఈ మొబైల్ ప్రారంభ ధర రూ.19,999గా ఉంది. దీనికి సక్సెసర్‌గా ఇప్పుడు వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ వస్తోంది.

Whats_app_banner

సంబంధిత కథనం