OnePlus Nord CE 3 Lite launch : వన్‌ప్లస్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. లాంచ్ డేట్ ఇదే!
OnePlus Nord CE 3 Lite 5G launch : నార్డ్ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో లాంచ్ చేయనుంది వన్‌ప్లస్ సంస్థ. అంతేకాకుండా.. నార్డ్ బడ్స్ 2ను కూడా తీసుకొస్తోంది. పూర్తి వివరాలు..
OnePlus Nord CE 3 Lite 5G launch in India : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ నుంచి వచ్చే నార్డ్ సిరీస్‌కు ఇండియాలో మంచి డిమాండ్ ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే.. ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ఫోన్లను లాంచ్ చేస్తూ ఉంటుంది వన్‌ప్లస్. ఇక ఇప్పుడు.. మరో మొబైల్‌ను ఇండియా మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నద్ధమవుతోంది. అదే.. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ. ఈ మొబైల్‌తో పాటు వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 2 కూడా లాంచ్ అవుతుండటం విశేషం.
లాంచ్ డేట్ ఇదే..
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ, వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 2లు.. ఏప్రిల్ 4న ఇండియా మార్కెట్లో లాంచ్కానున్నాయి. ఈ విషయాన్ని వన్‌ప్లస్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. వీటికోసం వెబ్సైట్లో ప్రత్యేక పేజ్ని కూడా ఉంచింది. వీటి ద్వారా మనకి కొన్ని వివరాలు తెలుస్తున్నాయి.
OnePlus Nord CE 3 Lite price : వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ.. పాస్టల్ లైమ్ కలర్ ఆప్షన్లో వస్తోంది. స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ వంటివి ఉండనున్నాయి. ఇక వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 2.. బ్లాక్, వైట్ రంగుల్లో లభిస్తుంది.
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ- స్పెసిఫికేషన్లు..
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్లో స్నాప్‌డ్రాగన్ 695 ఎస్ఓసీ ప్రాసెస్ ఉడొచ్చు. 8జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జీబీ యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ ఉండే అవకాశం ఉంది. 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన ఫుల్హెచ్డీ+ ఎల్సీడీ ప్యానెల్ ఇందులో ఉండొచ్చు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 65వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటివి ఇంకొన్ని ఫీచర్స్!
OnePlus Nord CE 3 Lite features : ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆక్సిజెన్ఓఎస్ 13పై పనిచేసే అవకాశం ఉంది. 64ఎంపీ ట్రిపుర్ రేర్ కెమెరా, 16ఎంపీ సెల్ఫీ కెమెరా ఉండొచ్చు. ప్రస్తుతానికైతే.. ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్పై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. రానున్న రోజుల్లో ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ- ధర..
OnePlus Nord CE 3 Lite specifications : ఇండియాలో వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ ధర రూ. 19,999 వద్ద లాంచ్ అయ్యింది. నార్డ్ సీఈ 3 లైట్ 5జీ ధర కూడా రూ. 20వేలలోపే ఉండొచ్చని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి.
సంబంధిత కథనం