Redmi Note 12: రెడ్‍మీ నోట్ 12 లాంచ్ డేట్ ఇదే: అమోలెడ్ డిస్‍ప్లేతో.. బడ్జెట్ రేంజ్‍లో..-redmi note 12 launch date revealed by xiaomi officially ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Redmi Note 12: రెడ్‍మీ నోట్ 12 లాంచ్ డేట్ ఇదే: అమోలెడ్ డిస్‍ప్లేతో.. బడ్జెట్ రేంజ్‍లో..

Redmi Note 12: రెడ్‍మీ నోట్ 12 లాంచ్ డేట్ ఇదే: అమోలెడ్ డిస్‍ప్లేతో.. బడ్జెట్ రేంజ్‍లో..

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 23, 2023 02:49 PM IST

Redmi Note 12 4G launch date: రెడ్‍మీ నోట్ 12 4జీ లాంచ్ డేట్ ఫిక్స్ అయింది. బడ్జెట్ రేంజ్‍లో ఈ మొబైల్‍ను షావోమీ తీసుకురానుంది.

Redmi Note 12: రెడ్‍మీ నోట్ 12 లాంచ్ డేట్ ఇదే (Photo: Xiaomi)
Redmi Note 12: రెడ్‍మీ నోట్ 12 లాంచ్ డేట్ ఇదే (Photo: Xiaomi)

Redmi Note 12 4G: రెడ్‌మీ నోట్ 12 సిరీస్‍లో 4జీ ఫోన్ వచ్చేస్తోంది. ఇప్పటికే ఈ సిరీస్‍లో ఇండియాలో మూడు 5జీ మోడళ్లు ఉండగా.. మరో ఫోన్‍ను తెచ్చేందుకు షావోమీ (Xiaomi) సిద్ధమైంది. రెడ్‍మీ నోట్ 12 4జీ ఫోన్‍ను ఈనెల 30వ తేదీన లాంచ్ చేయనున్నట్టు షావోమీ అధికారికంగా ప్రకటించింది. షావోమీ ఫ్యాన్ ఫెస్టివల్ (Xiaomi Fan Festival) సందర్భంగా ఈ మొబైల్‍ను తీసుకొస్తున్నట్టు వెల్లడించింది. అమోలెడ్ డిస్‍ప్లే, స్టైలిష్ డిజైన్ ఈ మొబైల్‍కు హైలైట్‍గా ఉన్నాయి. రెడ్‍మీ నోట్ 12 4జీ వివరాలు ఇవే.

రెడ్‍మీ నోట్ 12 4జీ వివరాలు

Redmi Note 12 4G India launch details: రెడ్‍మీ నోట్ 12 4జీ ఫోన్‍ను మార్చి 30వ తేదీన భారత మార్కెట్‍లోకి తీసుకురానున్నట్టు షావోమీ ప్రకటించింది. ఇందుకు సంబంధించి అధికారిక వెబ్‍సైట్ mi.comలో ప్రత్యేక పేజీని కూడా క్రియేట్ చేసింది. దీని ద్వారా కొన్ని కీలక స్పెసిఫికేషన్లను టీజ్ చేస్తోంది. సూపర్ చిక్, సూపర్ స్లీక్ అంటూ ఫోన్ స్లిమ్‍గా ఉంటుందని తెలుపుతోంది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‍కార్ట్ (Flipkart)లో ఈ మొబైల్ అందుబాటులోకి రానుంది.

రెడ్‍మీ నోట్ 12 4జీ కీలక స్పెసిఫికేషన్లు

Redmi Note 12 4G: 120 హెర్ట్జ్ (Hz) స్క్రీన్ రిఫ్రెష్ రేష్ ఉండే సూపర్ అమోలెడ్ డిస్‍ప్లేతో రెడ్‍మీ నోట్ 12 4జీ మొబైల్‍ను తీసుకురానున్నట్టు షావోమీ వెల్లడించింది. అయితే డిస్‍ప్లే సైజ్‍ను పేర్కొనలేదు. ఇక స్నాప్‍డ్రాగన్ 685 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ అవుతుంది.

రెడ్‍మీ నోట్ 12 4జీ మొబైల్‍లో 5,000mAh బ్యాటరీ ఉంటుంది. 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. ఇంటర్నల్ స్టోరేజీని ఉపయోగించుకొని వర్చువల్‍గా ర్యామ్‍ను పొడిగించుకునే ఫీచర్‌ను కూడా షావోమీ ఇవ్వనుంది.

రెడ్‍మీ నోట్ 12 4జీ ఫోన్ ధర రూ.15వేలలోపు ఉంటుందని అంచనా. ఎంఐ.కామ్, ఫ్లిప్‍కార్ట్ తో పాటు ఆఫ్‍లైన్ స్టోర్లలోనూ ఈ మొబైల్‍ అందుబాటులోకి వస్తుంది. మూడు కలర్ ఆప్షన్‍లలో అందుబాటులోకి వస్తోంది. గ్లోబల్‍గా ఈ ఫోన్ రేపే విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఇండియాలో ఈ నెల 30న అడుగుపెడుతుంది.

రెడ్‍మీ నోట్ 12 సిరీస్‍లో ప్రస్తుతం మూడు మోడల్స్ ఉన్నాయి. రెడ్‍మీ నోట్ 12 5జీ, రెడ్‍మీ నోట్ 12 ప్రో 5జీ, రెడ్‍మీ నోట్ 12 ప్రో+ 5జీ లభిస్తున్నాయి. రెడ్‍మీ నోట్ 12 5జీ ప్రారంభ ధర రూ.17,999గా ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం