Google Pixel 7a vs Samsung Galaxy A54 : గూగుల్ నుంచి పిక్సెల్ 7ఏ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్‌గా గుర్తింపు తెచ్చుకుంటోంది. కాగా.. ఈ స్మార్ట్‌ఫోన్.. శామ్సంగ్ గెలాక్సీ ఏ54కు గట్టిపోటీనిస్తుందని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పోల్చి.. ఏది బెస్ట్? ఏది కొంటే వాల్యూ ఫర్ మనీ అవుతుంది? అన్నది తెలుసుకుందాము..
Google Pixel 7a price : పిక్సెల్ 7ఏ డిజైన్ ఇతర పిక్సెల్ ఫోన్స్‌ను పోలి ఉంటుంది. హారిజాంటల్ కెమెరా బార్ రేర్‌లో ఉంటుంది. పిక్సెల్ 7 బాక్లో గ్లాస్ ఉంటుంటే.. 7ఏలో ప్లాస్టిక్ ఇస్తున్నారు. ఇందులో 6.1 ఇంచ్ ఫుల్హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే (90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్) వస్తోంది.
ఇక శామ్సంగ్ గెలాక్సీ ఏ54.. గెలాక్సీ ఎస్23 డిజైన్‌ను పోలి ఉంటుంది. రేర్‌లో ప్రీమియం గ్లాస్, ట్రిపుల్ కెమెరా సెటప్ వస్తోంది. ఇందులో 6.4 ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే (120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్) లభిస్తోంది.
Samsung Galaxy A54 price : పిక్సెల్ 7ఏలో పిక్సెల్ యూఐ ఉంటుంది. సామ్సంగ్ గెలాక్సీ ఏ54 పాజీలో ఆండ్రాయిడ్ 13 ఆధారిత వన్‌యూఐ 5.1 సాఫ్ట్వేర్ వస్తోంది.
Google Pixel 7a launch : పిక్సెల్ 7ఏలో 64ఎంపీ, 13ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా సెన్సార్లు లభిస్తున్నాయి. సెల్ఫీల కోసం ఫ్రెంట్లో 13ఎంపీ కెమెరాను ఇస్తోంది గూగుల్. 4,85 ఎంఏహెచ్ బ్యాటరీ దీని సొంతం. వయర్ లెస్ ఛార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేస్తుంది.
Samsung Galaxy A54 features : మరోవైపు శామ్సంగ్ గెలాక్సీ ఏ54 5జీలో 50ఎంపీ, 12ఎంపీ అల్ట్రావైడ్, 5ఎంపీ మాక్రో లెన్స్‌తో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ వస్తోంది. ఫ్రెంట్లో సెల్ఫీ కోసం 32ఎంపీ కెమెరాను ఇస్తోంది శామ్సంగ్. 5000ఎంఏహెచ్ బ్యాటరీ దీని సొంతం. అయితే ఇది వయర్లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయదు.
Google Pixel 7a features : గూగుల్ పిక్సెల్ 8జీబీ ర్యామ్- 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 43,999గా ఉంది. లాంచ్ ఆఫర్స్‌తో రూ. 39,999కే ఈ స్మార్ట్‌ఫోన్‌ను పొందవచ్చు. శామ్సంగ్ గెలాక్సీ ఏ54 5జీ ధర రూ. 38,999గా ఉంది.
సంబంధిత కథనం