Poco F5 5G : అదిరిపోయే స్పెసిఫికేషన్లతో పోకో ఎఫ్5 5జీ లాంచ్: ధర, ఆఫర్లు ఎలా ఉన్నాయంటే!-poco f5 5g launched in india check price specification sale date ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Poco F5 5g : అదిరిపోయే స్పెసిఫికేషన్లతో పోకో ఎఫ్5 5జీ లాంచ్: ధర, ఆఫర్లు ఎలా ఉన్నాయంటే!

Poco F5 5G : అదిరిపోయే స్పెసిఫికేషన్లతో పోకో ఎఫ్5 5జీ లాంచ్: ధర, ఆఫర్లు ఎలా ఉన్నాయంటే!

Chatakonda Krishna Prakash HT Telugu
May 09, 2023 07:04 PM IST

Poco F5 5G launched: పోకో ఎఫ్5 ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది. ఈ మొబైల్ పూర్తి స్పెసిఫికేషన్లు, ధర, సేల్ వివరాలను ఇక్కడ చూడండి.

Poco F5 5G : అదిరిపోయే స్పెసిఫికేషన్లతో పోకో ఎఫ్5 5జీ లాంచ్ (Photo: Poco)
Poco F5 5G : అదిరిపోయే స్పెసిఫికేషన్లతో పోకో ఎఫ్5 5జీ లాంచ్ (Photo: Poco)

Poco F5 5G launched in India: ఎఫ్ సిరీస్‍లో తన పవర్‌ఫుల్ మొబైల్‍ను పోకో బ్రాండ్ లాంచ్ చేసింది. పోకో ఎఫ్5 5జీ (Poco F5 5G) మొబైల్‍ను మంగళవారం (మే 9) భారత మార్కెట్‍లో విడుదల చేసింది. గేమింగ్ ఫోకస్డ్‌గా మిడ్ రేంజ్‍లో మంచి స్పెసిఫికేషన్లతో ఈ మొబైల్ లాంచ్ అయింది. డాల్బీ విజన్‍కు సపోర్ట్ చేసే 120 హెర్ట్జ్ అమోలెడ్ (AMOLED) డిస్‍ప్లేను పోకో ఎఫ్5 5జీ ఫోన్ కలిగి ఉంది. వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ ఈ మొబైల్ ఉంది. పోకో ఎఫ్5 5జీ ధర, పూర్తి స్పెసిఫికేషన్లు, ఆఫర్లు, సేల్ వివరాలను ఇక్కడ చూడండి.

100 నిట్స్ బ్రైట్‍నెస్ అమోలెడ్ డిస్‍ప్లేతో..

Poco F5 5G: 6.67 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+ అమోలెడ్ డిస్‍ప్లేతో పోకో ఎఫ్5 5జీ వచ్చింది. 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 1000 నిట్స్ వరకు పీక్ బ్రైట్‍నెస్ ఉంటుంది. డాల్బీ విజన్, హెచ్‍డీఆర్10+కు ఈ డిస్‍ప్లే సపోర్ట్ చేస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంటుంది.

ఈ ప్రాసెసర్‌తో తొలి ఫోన్

Poco F5 5G: పోకో ఎఫ్5 5జీ ఫోన్‍లో స్నాప్‍డ్రాగన్ 7+ జెన్ 2 (Snapdragon 7+ Gen 2) ప్రాసెసర్ ఉంది. ఈ ప్రాసెసర్‌తో ఇండియాలో లాంచ్ అయిన తొలి మొబైల్ ఇదే. ఆండ్రాయిడ్ 13 (Android 13) బేస్డ్ ఎంఐయూఐ 14 ఆపరేటింగ్ సిస్టమ్‍తో ఈ మొబైల్ వచ్చింది. 12 5జీ బ్యాండ్‍లకు ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.

64 OIS మెగాపిక్సెల్ కెమెరాతో..

Poco F5 5G: వెనుక మూడు కెమెరాల సెటప్‍తో పోకో ఎఫ్5 5జీ మొబైల్ వచ్చింది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‍ (OIS)కు సపోర్ట్ చేసే 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్‍కు 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను పోకో ఇచ్చింది.

67 వాట్ల ఫాస్ట్ చార్జింగ్

Poco F5 5G: పోకో ఎఫ్5 మొబైల్‍లో 5,000mAh బ్యాటరీ ఉంటుంది. 67 వాట్ల టర్బో ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. 0 నుంచి 100 శాతానికి 45 నిమిషాల్లోనే ఈ ఫోన్ చార్జ్ అవుతుందని పోకో పేర్కొంది.

డ్యుయల్ స్టీరియో స్పీకర్లు

Poco F5 5G: డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉండే డ్యుయల్ స్టీరియో స్పీకర్లు పోకో ఎఫ్5 ఫోన్‍కు ఉన్నాయి. హీట్ కంట్రోల్ అయ్యేలా వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్, 14 లేయర్స్ గ్రాఫైట్ సిస్టమ్ ఈ మొబైల్‍లో ఉంటాయి.

పోకో ఎఫ్5 5జీ ధర, సేల్

Poco F5 5G Price in India: పోకో ఎఫ్5 5జీ ఫోన్ మొబైల్ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది.

  • Poco F5 5G 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర: రూ.29,999
  • Poco F5 5G 12జీబీ ర్యామ్ + 512జీబీ స్టోరేజ్ ధర: రూ.33,999

ఈనెల (మే) 16వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‍కార్ట్ (Flipkart)లో ఈ మొబైల్ సేల్ మొదవుతుంది. కార్బన్ బ్లాక్, ఎలక్ట్రిక్ బ్లూ, స్నో స్ట్రామ్ వైట్ కలర్ ఆప్షన్‍లలో పోకో ఎఫ్5 5జీ లభిస్తుంది.

Poco F5 5G: ఆఫర్లు

Poco F5 5G: తొలి సేల్ సందర్భంగా ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డుతో పోకో ఎఫ్5 5జీ మొబైల్‍ను కొంటే రూ.3,000 డిస్కౌంట్ పొందవచ్చు. అంటే బేస్ వేరియంట్‍ను రూ.26,999కే దక్కించుకోవచ్చు.

WhatsApp channel