Oppo Find N2 Flip Price: ఇండియాలో ఒప్పో మడత ఫోన్ ధర ఇదే: అధికారికంగా ప్రకటించిన ఒప్పో-oppo find n2 flip price in india ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Oppo Find N2 Flip Price In India

Oppo Find N2 Flip Price: ఇండియాలో ఒప్పో మడత ఫోన్ ధర ఇదే: అధికారికంగా ప్రకటించిన ఒప్పో

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 13, 2023 02:09 PM IST

Oppo Find N2 Flip Price in India: ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్ ధర వెల్లడైంది. ఇండియాలో ఈ మొబైల్ ధరను ఒప్పో అధికారికంగా ప్రకటించింది.

Oppo Find N2 Flip Price: ఇండియాలో ఒప్పో మడత ఫోన్ ధర ఇదే (Photo: Oppo)
Oppo Find N2 Flip Price: ఇండియాలో ఒప్పో మడత ఫోన్ ధర ఇదే (Photo: Oppo)

Oppo Find N2 Flip Price in India: భారత్‍లో ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్ ఫోన్ ధర వెల్లడైంది. గతేడాది చైనాలో విడుదల చేసిన ఈ ఫ్లిప్ ఫోన్‍ను ఇటీవల గ్లోబల్‍గా లాంచ్ చేసింది ఒప్పో. ఇప్పుడు ఇండియాలో ధరను ప్రకటించింది. సేల్‍ తేదీని వెల్లడించింది. మీడియాటెక్ డైమన్సిటీ 9000 ప్లస్ ప్రాసెసర్ సహా ఫ్లాగ్‍షిప్ స్పెసిఫికేషన్లతో ఈ ఒప్పో ఫైండ్ ఎన్‍2 ఫ్లిప్ మడత ఫోన్ వచ్చింది. పూర్తి వివరాలివే.

ట్రెండింగ్ వార్తలు

ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్ ధర, సేల్, ఆఫర్

Oppo Find N2 Flip Price in India: 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ఉన్న ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్ మొబైల్ ధర రూ.89,999గా ఉంది. ఈనెల 17వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‍కార్ట్, ఒప్పో ఇండియా స్టోర్‍లో ఈ మడత ఫోన్‍ సేల్‍కు వస్తుంది. పర్పుల్, బ్లాక్ కలర్ ఆప్షన్‍లో లభిస్తోంది.

Oppo Find N2 Flip Offers: ఐసీఐసీఐ బ్యాంక్, కొటాక్ బ్యాంక్, ఎస్‍బీఐ, యెస్ బ్యాంక్ కార్డులతో ఒప్పో ఫైండ్ ఎన్‍‍2 ఫ్లిప్ ఫోన్‍ను కొంటే రూ.5,000 డిస్కౌంట్ లభిస్తుందని ఒప్పో పేర్కొంది.

Oppo Find N2 Flip: స్పెసిఫికేషన్లు

మీడియాటెక్ డైమన్సిటీ 9000 ప్లస్ 5జీ ఫ్లాగ్‍షిప్ ప్రాసెసర్‌తో ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్ వస్తోంది. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ కలర్ఓఎస్‍తో అడుగుపెడుతోంది. 5జీ, 4జీ ఎల్‍టీఈ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్‍బీ టైప్-సీ పోర్టు కనెక్టివిటీ ఫీచర్లుగా ఉన్నాయి.

Oppo Find N2 Flip: 6.8 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+ అమోలెడ్ మెయిన్ డిస్‍ప్లేను ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్ కలిగి ఉంది. 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ పీక్ బ్రైట్‍నెస్ ఈ డిస్‍ప్లేకు ఉంటుంది. 900 నిట్స్ పీక్ బ్రైట్‍నెస్ ఉండే 3.26 ఇంచుల కవర్ అమోలెడ్ డిస్‍ప్లే ఉంటుంది. ఫోన్ మడత పెట్టినప్పుడు (ఫ్లిప్ చేసినప్పుడు) ఈ కవర్ డిస్‍ప్లే వాడుకోవచ్చు.

Oppo Find N2 Flip: ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్ ఫోన్ వెనుక రెండు కెమెరాలు ఉంటాయి. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాలు ఉంటాయి. సెల్పీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో ఈ ఫ్లిప్ మొబైల్ వస్తోంది. ఈ మొబైల్‍లో 4,300mAh బ్యాటరీ ఉంటుంది. 44 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. అయితే రిటైల్ బాక్స్‌లో 80 వాట్ల ఫాస్ట్ చార్జర్‌ను ఇవ్వనున్నట్టు ఒప్పో పేర్కొంది.

WhatsApp channel