WhatsApp Upcoming Feature: చానెల్స్ ఫీచర్‌ను తీసుకొస్తున్న వాట్సాప్: ఎలా ఉపయోగపడుతుందంటే!-whatsapp to launch telegram like channels feature know how to use how it work ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Whatsapp To Launch Telegram Like Channels Feature Know How To Use How It Work

WhatsApp Upcoming Feature: చానెల్స్ ఫీచర్‌ను తీసుకొస్తున్న వాట్సాప్: ఎలా ఉపయోగపడుతుందంటే!

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 25, 2023 05:39 PM IST

WhatsApp Channels Feature: వాట్సాప్ త్వరలో చానెల్స్ ఫీచర్‌ను తీసుకురానుంది. ఇది ఎలా ఉపయోగపడుతుందో ఇక్కడ చూడండి.

WhatsApp Upcoming Feature: చానెల్స్ ఫీచర్‌ను తీసుకొస్తున్న వాట్సాప్
WhatsApp Upcoming Feature: చానెల్స్ ఫీచర్‌ను తీసుకొస్తున్న వాట్సాప్

WhatsApp Channels Feature: ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‍ఫామ్ వాట్సాప్‍కు త్వరలో మరో కొత్త ఫీచర్ యాడ్ కానుంది. పోటీ యాప్ అయిన టెలిగ్రామ్‍లో ఉన్న ఓ ఫీచర్‌ను వాట్సాప్ కూడా తన యూజర్ల కోసం తీసుకొస్తోంది. వాట్సాప్ త్వరలో చానెల్స్ ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం వాట్సాప్ బీటా యూజర్లకు టెస్టింగ్ కోసం ‘చానెల్స్’ను వాట్సాప్ ఇచ్చింది. ఈ విషయాన్ని వాట్సాప్ బీటాఇన్ఫో వెల్లడించింది. త్వరలోనే యూజర్లందరికీ ఈ ఫీచర్ యాడ్ కానుంది. వాట్సాప్ చానెల్స్ ఫీచర్ ఎలా ఉండనుందో ఇక్కడ చూడండి.

ట్రెండింగ్ వార్తలు

చానెల్స్ అంటే ఏంటి?

WhatsApp Channels Feature: వాట్సాప్ తీసుకురానున్న చానెల్స్ ఫీచర్ ఓ బ్రాడ్‍కాస్టింగ్ టూల్‍లా ఉంటుంది. విభిన్నమైన టాపిక్‍లపై ఈ చానెల్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. తమ ఆసక్తి మేరకు ఏ చానెల్‍‍లో అయినా యూజర్లు వాట్సాప్‍లో జాయిన్ కావొచ్చు. కావాలంటే ఓ టాపిక్‍పై చానెల్ సృష్టించవచ్చు. ఆ టాపిక్‍పై న్యూస్, అప్‍డేట్లను అందులో పోస్ట్ చేయవచ్చు. వేరే యూజర్లు ఆ చానెల్ లో జాయిన్ అవొచ్చు. ఉదాహరణకు ఏవైనా ఎలక్ట్రానిక్స్ ఆఫర్ల గురించి చానెల్ క్రియేట్ చేసుకోవచ్చు. దాంట్లో ఆఫర్లకు సంబంధించిన అప్‍డేట్లను పోస్ట్ చేయవచ్చు. ఈ చానెళ్లలో ఏ యూజర్ అయినా జాయిన్ అవ్వొచ్చు. రకరకాల టాపిక్‍లపై చాలా చానెల్స్ ఉంటాయి. ఇప్పటికే టెలిగ్రామ్‍లో ఈ చానెల్స్ ఫీచర్ ఉంది.

WhatsApp Channels Feature: ప్రస్తుతం వాట్సాప్‍లో చానెల్స్ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది. బీటా ఫర్ ఆండ్రాయిడ్ 2.23.8.6 అప్‍డేట్ ద్వారా ప్రస్తుతం బీటా యూజర్లకు ఈ ఫీచర్ ఉందుబాటులో ఉంది. ఐఓఎస్ బీటా యూజర్లకు కూడా వచ్చింది. ఈ విషయాన్ని డబ్ల్యూఏబీటా ఇన్ఫో పేర్కొంది. ఈ కొత్త చానెల్స్ ఫీచర్‌ను బీటా యూజర్లు ముందుగా టెస్ట్ చేస్తారు. బగ్స్ ఏవీ లేకుండా సిద్ధంగా ఉన్నప్పుడు సాధారణ యూజర్లందరికీ ఈ ఫీచర్‌ను వాట్సాప్ తీసుకొస్తుంది. రానున్న వారాల్లో అందరికీ ఇది అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది.

WhatsApp Channels Feature: వాట్సాప్ చానెల్ ప్రైవేట్ టూల్‍గా ఉంటుంది. చానెల్‍లో ఉన్న యూజర్ల ఫోన్ నంబర్లు, సమాచారం ఇతరులకు కనిపించదు. అలాగే, యూజర్ నేమ్‍ను ఎంటర్ చేసి కూడా వాట్సాప్ చానెల్‍ను సెర్చ్ చేసే సదుపాయం ఉండనుంది.

మరోవైపు, ఎడిట్ ఫీచర్‌ను వాట్సాప్ టెస్ట్ చేస్తోందని తెలుస్తోంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే సెండ్ చేసిన మెసేజ్‍ను కూడా యూజర్లు ఎడిట్ చేయవచ్చు. ఇందుకు నిర్ధిష్ట కాలపరిమితి ఉంటుంది. ఈ ఫీచర్ కోసం యూజర్లు ఎప్పటి నుంచో వేచిచూస్తున్నారు. టెలిగ్రామ్‍లో ఇప్పటికే ఈ ఎడిట్ ఫీచర్ ఉంది.

WhatsApp channel

సంబంధిత కథనం