Poha For Breakfast : బ్రేక్‌ఫాస్ట్‌లో పోహా.. అద్భుతమైన ప్రయోజనాలు
08 February 2023, 6:45 IST
- Breakfast : అల్పాహారం ఏం చేద్దామా.. అని కొంతమంది తెగ ఆలోచిస్తూ ఉంటారు. అయితే పోహా తినడం వల్ల రోజంతా మీరు హాయిగా ఉంటారు. ఇది మీ జీర్ణవ్యవస్థకు బాగా ఉపయోగపడుతుంది. ఇది తినడానికి తేలికపాటి ఆహారం.
బ్రేక్ ఫాస్ట్ పోహా
పోహా చాలా మంది ఇళ్లలో ఇష్టమైన బ్రేక్‌ఫాస్ట్(Breakfast)లలో ఒకటి. ఎందుకంటే ఇది మంచి రుచితోపాటుగా చాలా పోషకాలను అందిస్తుంది. అల్పాహారం కోసం రుచికరమైన పోహాను తినడమంటే చాలా మందికి ఇష్టం. ఇది ఫిట్‌గా ఉంచడమే కాకుండా, బరువు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. కార్బోహైడ్రేట్ ఇందులో తగినంత పరిమాణంలో ఉంటుంది. ఇది శరీరానికి అవసరమైన విటమిన్లను కూడా కలిగి ఉంటుంది. ఇది సులభంగా జీర్ణమయ్యేలా ఉదయం పూట తీసుకునే ఉత్తమమైన బ్రేక్‌ఫాస్ట్‌లలో ఒకటి.
పోహాలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. క్రమం తప్పకుండా ఒక ప్లేట్ పోహా తినే వ్యక్తికి ఇనుము లోపం ఉండదు. రక్తహీనతకు దూరంగా ఉంటారు. ఇది శరీరంలో హిమోగ్లోబిన్, రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఇనుము శరీరంలోని కణాలకు ఆక్సిజన్‌ను అందిస్తుంది.
పోహ ఎఫెక్టివ్ డయాబెటిక్ పేషెంట్లకు చాలా మేలు చేస్తుంది. డయాబెటిక్ పేషెంట్ పోహా(Poha) తినడం వల్ల ఆకలి తగ్గుతుంది. బీపీ లెవెల్ సరిగ్గా ఉంటుంది. పోహా ప్లేట్‌లో 244 కిలో కేలరీలు ఉంటాయి.
పోహాలో కొంతమంది అనేక రకాల కూరగాయలు(Vegetables), గింజలను కలిపి తయారుచేస్తారు. పోహాలో కూరగాయలు, గింజలను తీసుకోవడం ద్వారా, శరీరానికి తగినంత విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ అందుతాయి.
కార్బోహైడ్రేట్లు కూడా పోహాలో మంచి పరిమాణంలో కనిపిస్తాయి. కార్బోహైడ్రేట్ శరీరానికి శక్తిని ఇస్తుంది. మీ శరీరానికి సంబంధించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ప్రతిరోజూ అల్పాహారంగా పోహా తినవచ్చు.
మీ పొట్టలో ఏదైనా సమస్య ఉంటే పోహా అల్పాహారంగా తీసుకోవడం మంచిది. ఇది తేలికగా జీర్ణమవుతుంది. కొంతమంది రోగులకు వైద్యులు కూడా పోహా తినమని సిఫార్సు చేస్తారు.