Don't Skip Breakfast : అల్పాహారం స్కిప్ చేయకండి.. చాలా సమస్యలు వస్తాయ్
You Shouldn't Ever Skip Your Breakfast : అల్పాహారం తినకుంటే ఏం అవుతుందిలేనని చాలా మంది అనుకుంటారు. లేటుగా లేస్తాం కదా.. మధ్యాహ్నం తింటే సరిపోతుంది అనే అభిప్రాయం ఉంటుంది. కానీ అల్పాహారం స్కిప్ చేస్తే.. వచ్చే సమస్యలు చాలా ఉన్నాయ్.
చాలా మంది జీవితాల్లో బిజీ బిజీ షెడ్యూల్ కారణంగా అల్పాహారం మానేస్తారు. బరువు తగ్గాలనే ప్రయత్నంలో కూడా చాలా మంది ఇలా చేస్తారు. శరీరంలోకి తక్కువ క్యాలరీలు వెళ్తాయని భావించి బ్రేక్‌ఫాస్ట్‌ను మానేస్తుంటారు. అయితే మీరు చేసే ఈ పొరపాటు వల్ల మీ ఆరోగ్యానికి చాలా హాని కలుగుతుంది. అల్పాహారం రోజులో ముఖ్యమైనది. కాబట్టి ఇది ఎల్లప్పుడూ సమయం ప్రకారం తీసుకోవాలి. చాలా మంది దీనిని విస్మరిస్తారు. దీని కారణంగా ఆరోగ్యం దెబ్బతింటుంది. మొదట్లో దీని ప్రభావం తెలియకపోయినా.., కాలక్రమేణా దాని డ్యామేజ్ తీవ్రంగా ఉంటుంది. దీని వల్ల గుండె ఆరోగ్యం కూడా దారుణంగా దెబ్బతింటుంది.
బ్రేక్ ఫాస్ట్ మానేయడం వల్ల గుండె బలహీనపడుతుంది.
అల్పాహారం దాటవేయడం వల్ల గుండె సంబంధిత సమస్యలు పెరుగుతాయి.
ఇది మానేయడంతో గుండె జబ్బుల ముప్పు 27 శాతం పెరుగుతుంది.
అల్పాహారం మానివేయడం వల్ల అధిక రక్తపోటు సమస్యలు వస్తాయి.
ఉదయం తినకపోతే.. గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ.
బ్రేక్ ఫాస్ట్ మానేయడం వల్ల టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది.
అల్పాహారం మానేయడం వల్ల ఊబకాయం వస్తుంది.
ఉదయం అల్పాహారం చేయకపోతే, క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
బ్రేక్ ఫాస్ట్ మానేయడం మెదడుపై చెడు ప్రభావం చూపుతుంది.
అల్పాహారం దాటవేయడం వల్ల మైగ్రేన్ వస్తుంది.
జుట్టు రాలడంతో పాటు జీర్ణక్రియపై కూడా చెడు ప్రభావం ఉంటుంది.
క్రమం తప్పకుండా అల్పాహారం తీసుకోవడం వల్ల ఈ వ్యాధులన్నింటి నుండి మిమ్మల్ని రక్షించవచ్చు. అల్పాహారం తీసుకుంటే.. గుండె బలహీనపడదు. మీరు అల్పాహారం మానేయడం వల్ల కలిగే నష్టాన్ని నివారించాలనుకుంటే ఉదయాన్నే మీ ఆహారంలో ఆరోగ్యకరమైన, పోషకాలను చేర్చండి.