Vegetable Ponganalu Recipe । అల్పాహారం రుచిగానే కాకుండా, ఆరోగ్యకరంగానూ ఇలా చేసుకోవచ్చు!
Vegetable Ponganalu Recipe: మీకు నచ్చిన కూరగాయలతో, అందరూ మెచ్చెలా రుచికరమైన, ఆరోగ్యకరమైన వెజిటెబుల్ పొంగనాలు రెసిపీని ఇక్కడ చూసి తెలుసుకోండి.
మీరు రోజూ ఇడ్లీ, దోశలు తింటూ విసిగిపోతే, వాటికి కావాల్సిన సామాగ్రిని ఉపయోగించే వెరైటీగా పొంగనాలు చేసుకోవచ్చు. వీటిలో మీకు నచ్చిన కూరగాయలను స్టఫ్ చేసుకొని మరింత రుచికరంగా కూడా మార్చుకోవచ్చు. పొంగానాలు అనేవి మైసూర్ బజ్జీల లాగా గుండ్రంగా ఉంటాయి, అయితే వీటిని నూనెలో డీప్ ఫ్రై చేయారు, ఆవిరి మీద ఉడికిస్తారు. అంతేకాకుండా పొంగనాలు తయారీలో పోషకాలతో కూడిన పదార్థాలు ఉపయోగిస్తాం కాబట్టి, ఇవి తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.
కూరగాయలను కలిపి చేసే వెజిటెబుల్ పొంగనాలు ఎంతో రుచికరమైన అల్పాహారం. వీటిని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కాబట్టి స్కూల్ స్నాక్స్ కోసం లంచ్ బాక్స్‌లో ప్యాక్ చేయవచ్చు. సాయంత్రం వేళ ఆఫీస్ లో తినడానికి స్నాక్స్ లాగా తీసుకెళ్లవచ్చు, రాత్రి అల్పాహారంగా తినవచ్చు.
మీకు సమయం లేకపోతే త్వరితగతిన, సులభంగా రవ్వతో తయారు చేసుకోగలిగే వెజిటెబుల్ పొంగనాలు రెసిపీ ఇక్కడ ఉంది, చూడండి.
Vegetable Ponganalu Recipe కోసం కావలసినవి
- 1 కప్పు రవ్వ
- 1/2 కప్పు పెరుగు
- 1/2 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ
- 1/4 కప్పు సన్నగా తరిగిన క్యారెట్
- 1/4 కప్పు చిన్నగా తరిగిన క్యాబేజీ
- 1 టీస్పూన్ అల్లం తురుము
- 1 టీస్పూన్ సన్నగా తరిగిన పచ్చి మిరపకాయలు
- 1/4 కప్పు తరిగిన కొత్తిమీర
- 5-6 తరిగిన కరివేపాకు ఆకులు
- 1/2 టీస్పూన్ బేకింగ్ సోడా
- 1/2 టీస్పూన్ మిరియాల పొడి
- రుచి తగినంత ఉప్పు
- పాన్ గ్రీజు చేయడానికి వంట నూనె
వెజిటెబుల్ పొంగనాలు తయారీ విధానం
- ముందుగా ఒక గిన్నెలో రవ్వ, పెరుగు, ఉప్పు, మిరియాల పొడి వేసి, సుమారు 1 కప్పు నీరు పోసి బాగా కలపండి, సుమారు 10 నిమిషాలు పక్కన పెట్టండి.
- అనంతరం మరికొంత నీరు సర్దుబాటు చేసుకొని, బేకింగ్ సోడా వేసి కలపాలి.
- ఆ తరువాత, అన్ని కూరగాయల ముక్కలను వేసి మళ్లీ బాగా కలపాలి.
- ఇప్పుడు గుంత పొంగనాలు చేసే పాన్‌లో కొద్దిగా నూనె వేసి, అచ్చుల్లో పొంగనాలు వేయండి.
- పాన్ మూతపెట్టి, మీడియం మంట మీద బంగారు గోధుమ రంగులోకి వచ్చే వరకు ఉడికించాలి.
- వాటిని తిప్పండి, మళ్లీ పాన్ కవర్ చేసి, మరో వైపు 2-3 నిమిషాలు ఉడికించాలి.
అంతే, వెజిటెబుల్ పొంగనాలు రెడీ. మీకు నచ్చిన చట్నీ లేదా డిప్పింగ్ సాస్‌తో తింటూ ఆనందించండి.
సంబంధిత కథనం