తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Seeds For Weight Loss : బరువు తగ్గాలనుకుంటున్నారా? ఆ విత్తనాలను మీ డైట్​లో చేర్చుకోండి..

Seeds for Weight Loss : బరువు తగ్గాలనుకుంటున్నారా? ఆ విత్తనాలను మీ డైట్​లో చేర్చుకోండి..

03 November 2022, 12:39 IST

    • Seeds for Weight Loss : సీడ్స్ అనేవి పోషకాలకు పవర్​హౌస్​గా చెప్పవచ్చు. అందుకే చాలామంది వీటిని తమ డైట్​లో చేర్చుకుంటారు. ఇవి ఆరోగ్యకరమైనవి. అంతే కాకుండా కేలరీలు తక్కువగా ఉంటాయి. అందుకే బరువు తగ్గాలి అనుకునేవాళ్లు తమ డైట్​లో సీడ్స్ ఉండేలా చూసుకోవాలి అంటున్నారు. మరి వేటిని తీసుకుంటే హెల్త్​కి మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ విత్తనాలు మీ డైట్లో చేర్చుకోండి..
ఈ విత్తనాలు మీ డైట్లో చేర్చుకోండి..

ఈ విత్తనాలు మీ డైట్లో చేర్చుకోండి..

Seeds for Weight Loss : ప్రోటీన్, ఫైబర్, అసంతృప్త కొవ్వు ఆమ్లాలతో విత్తనాలు నిండి ఉంటాయి. ఇవి మీ జీవక్రియను పెంచడంలో సహాయం చేస్తాయి. ఆరోగ్యకరమైన గుండెకు మద్దతు ఇస్తాయి. అంతేకాకుండా మధుమేహాన్ని, ప్రోస్టేట్‌ను నిర్వహించడంలో సహాయం చేస్తాయ. అంతేకాకుండా వీటిని డైట్​లో యాడ్ చేసుకోవడం వల్ల బరువు కూడా తగ్గుతారు అంటున్నారు. ఇవి మీ మొత్తం ఆరోగ్యాన్ని రక్షిస్తాయి అంటున్నారు. మరి ఇంతకీ ఏ సీడ్స్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

అవిసె గింజలు

ఫైబర్, మాంసకృత్తులతో నిండిన అవిసె గింజలలో కేలరీలు తక్కువగా ఉంటాయి. మొక్కల ఆధారిత ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలకు మంచి మూలం. ఈ అవిసె గింజలు మీ ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడంలో సహాయం చేస్తాయి. ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి. శరీరంలోని హార్మోన్లను సమతుల్యం చేస్తాయి. ఈ విత్తనాలు శరీరంలో థర్మోజెనిసిస్‌ను కూడా పెంచుతాయి. ఈ ప్రక్రియ కొవ్వును కాల్చడంలో సహాయపడుతుంది. బరువు తగ్గాలి అనుకునేవారు.. పెరుగుతో అవిసె గింజలను కలిపి తీసుకోవచ్చు.

గుమ్మడికాయ గింజలు

రాగి, ప్రొటీన్, మెగ్నీషియం, జింక్ వంటి ముఖ్యమైన పోషకాలను గుమ్మడికాయ గింజలు అధికంగా కలిగి ఉంటాయి. ముఖ్యమైన పోషకాలతో నిండిన ఈ సీడ్స్ ఆరోగ్యకరమైన జీవక్రియను పెంచడానికి, బరువు తగ్గడానికి సహాయం చేస్తాయి.

ఈ విత్తనాలు బల్క్ అప్, కండరాలను నిర్మించడంలో కూడా సహాయం చేస్తాయి. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇవి మీ ఆకలిని తీరుస్తాయి. అతిగా తినడాన్ని నిరోధిస్తాయి. తద్వారా బరువు తగ్గుతారు. ఉబ్బరం, మలబద్ధకాన్ని నివారిస్తాయి. మీ జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మీరు వాటిని పచ్చిగా తీసుకోవచ్చు. లేదంటే ఫ్రై చేసుకోవచ్చు. నానబెట్టి కూడా తినవచ్చు.

చియా విత్తనాలు

సూక్ష్మపోషకాలు, ఐరన్, డైటరీ ఫైబర్, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చియా విత్తనాలు నిండి ఉంటాయి. ఇవి మీ బరువు తగ్గించే ఆహారాలలో ఒకటి. అంతేకాకుండా ఇవి మీ శక్తి స్థాయిలను పెంచుతాయి. మీ శరీరం నీటిని గ్రహించడంలో సహాయపడతాయి.

యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు మీ జీవక్రియ రేటును పెంచుతాయి. ఇది కొవ్వును కాల్చడాన్ని ప్రోత్సహిస్తుంది. వాటిని తినే ముందు రాత్రిపూట లేదా కొన్ని గంటలపాటు నీటిలో నానబెట్టి తీసుకోండి.

పొద్దుతిరుగుడు విత్తనాలు

పొద్దు తిరుగుడు విత్తనాలలో తక్కువ కేలరీలు ఉంటాయి. ఇవి తేలికపాటి నట్టి రుచిని కలిగి ఉంటాయి. బహుళ అసంతృప్త లేదా మంచి కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్‌తో నిండి ఉంటాయి.

ఆరోగ్యకరమైన పద్ధతిలో బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తాయి. మీరు వీటిని సలాడ్‌లు, స్మూతీస్ లేదా తృణధాన్యాలతో కలిపి తీసుకోవచ్చు. వీటిలో పీచు ఎక్కువగా ఉంటుంది. పొద్దుతిరుగుడు గింజలు కూడా మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతాయి. ఆహారం తీసుకోవడాన్ని తగ్గిస్తాయి. మీ శరీరాన్ని డిటాక్స్ చేయడానికి కూడా సహాయం చేస్తాయి.

టాపిక్

తదుపరి వ్యాసం