తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Curd Macaroni Breakfast । మాకరోనీ సలాడ్.. ప్రోటీన్లు, పోషకాలు నిండిన అల్పాహారం!

Curd Macaroni Breakfast । మాకరోనీ సలాడ్.. ప్రోటీన్లు, పోషకాలు నిండిన అల్పాహారం!

HT Telugu Desk HT Telugu

21 April 2023, 6:30 IST

    • Hung Curd Macaroni: తక్కువ సోడియం, తక్కువ కార్బోహైడ్రేట్లు, ఎక్కువ ప్రోటీన్లు ఉండే అల్పాహారం కోసం చూస్తున్నారా? అయితే ఈ మాకరోనీ సలాడ్ ట్రై చేయండి, రెసిపీ ఇక్కడ చూడండి.
Hung Curd Macaroni Recipe
Hung Curd Macaroni Recipe (slurrp)

Hung Curd Macaroni Recipe

Summer Breakfast Recipes: ఈ వేసవిలో పెరుగు, మజ్జిగ వంటివి వీలైనంత ఎక్కువ తీసుకోవాలి. ఇది సూర్యతాపం నుంచి రక్షిస్తూ మీ శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. అంతేకాకుండా పెరుగులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ఒక అద్భుతమైన ప్రోబయోటిక్. మీ పేగును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఎసిడిటీని నియంత్రిస్తుంది. పెరుగుతో వండే వంటకాలు కూడా ఎంతో రుచిగా ఉంటాయి. పెరుగుతో మజ్జిగచారు, మునగకాయ పెరుగుకూర, చట్నీ, రైతా వంటివి ఎన్నో చేసుకోవచ్చు. సాదా పెరుగుకు బదులు హంగ్ పెరుగు ఉపయోగిస్తే మరిన్ని ప్రయోజనాలు ఉంటాయి. ఎందుకంటే ఇందులో తక్కువ సోడియం ఉంటుంది. కార్బోహైడ్రేట్లు తక్కువ ఉంటాయి, ప్రోటీన్లు ఎక్కువ ఉంటాయి.

మీకు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ కోసం పెరుగుతో (Hung Curd) చేసే అద్భుతమైన మాకరోనీ రెసిపీని ఇక్కడ అందిస్తున్నాం. మీరూ ఈ ఆరోగ్యకరమైన రెసిపీని ప్రయత్నించి చూడండి.

Hung Curd Macaroni Recipe కోసం కావలసినవి

  • 1 కప్పు మాకరోనీ
  • 1/2 ఉల్లిపాయ
  • 1/2 కప్పు మొక్కజొన్న గింజలు
  • 1 క్యారెట్
  • 1/4 కప్పు క్యాప్సికమ్ ముక్కలు
  • కొన్ని పాలకూర ఆకులు
  • 1 టమోటా
  • 1 కప్పు హంగ్ పెరుగు
  • 2 వెల్లుల్లి రెబ్బలు
  • 1 స్పూన్ తాజాగా పిండిన నిమ్మరసం
  • 1/2 స్పూన్ చక్కెర
  • 1/2 స్పూన్ ఎండిన పార్ల్సీ
  • 1/2 tsp సుగంధద్రవ్యాలు
  • 1-2 టేబుల్ స్పూన్లు కాల్చిన వేరుశనగ
  • రుచికి తగినంత ఉప్పు, మిరియాల పొడి

పెరుగు మాకరోనీ తయారీ విధానం

  1. ముందుగా ఎల్బో మాకరోనీని ఉడికించి, ఆపై నీటిని వడకట్టి పక్కన పెట్టండి.
  2. తర్వాత ఒక పెద్ద సలాడ్ గిన్నెలో ఉడికించిన మాకరోనీ, ఉల్లిపాయ ముక్కలు, టొమాటోలు, గ్రీన్ బెల్ పెప్పర్, కార్న్స్, క్యారెట్ ముక్కలు, పాలకూర ఆకులు వేసి బాగా కలపండి.
  3. అనంతరం మరొక చిన్న గిన్నెలో పెరుగు, చక్కెర, ఉప్పు, మిరియాలు, వెల్లుల్లి, నిమ్మరసం, డ్రై పార్ల్సీ , మిక్స్డ్ హెర్బ్స్ వేసి బాగా గిలక్కొట్టండి.
  4. ఇప్పుడు ఈ డ్రెస్సింగ్‌ను మాకరోనీ సలాడ్‌లో వేసి బాగా కలపాలి.
  5. ఆపై గిన్నెను క్లాంగ్ ర్యాప్‌తో చుట్టి, రిఫ్రిజిరేటర్‌లో కనీసం ఒక గంట పాటు ఉంచండి, ఇది రుచులను కలిపి మిళితం చేస్తుంది.
  6. చివరగా మరోసారి బాగా కలిపి వేయించిన వేరుశనగలతో గార్నిష్ చేయండి.

అంతే, సర్వ్ చేసుకోండి, రుచిని ఆస్వాదించండి, మైమరచిపోండి.

తదుపరి వ్యాసం