Chanakya Niti In Telugu : ఈ లక్షణాలు ఉన్న పురుషులను స్త్రీలు ఎక్కువగా ఇష్టపడుతారు
15 May 2024, 8:00 IST
- Chanakya Niti Telugu : ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో స్త్రీ, పురుషుల గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. పురుషులకు స్త్రీల ఆకర్శితులు అవ్వడానికి గల కారణాలను వివరించాడు.
చాణక్య నీతి
చాణక్యుడి మాటలు ఏ వయసు వారికైనా సంబంధించినవి. చాణక్య నీతిని అనుసరించడం అనేక సమస్యల నుండి ఒకరిని కాపాడుతుంది. చాణక్య నీతి మానవ జీవితాన్ని సంతోషంగా, విజయవంతం చేసే అనేక విషయాలను చెబుతుంది. చాణక్యుడి మాటలు పాటిస్తే మీ గౌరవం పెరుగుతుంది. జీవితాన్ని సరళంగా, సంతోషంగా మార్చుకోవడానికి అనేక మార్గాలు చాణక్య నీతిలో వివరించబడ్డాయి.
జీవితంలో చాణక్యుడి మాటలను పాటిస్తే పెద్ద కష్టాన్ని కూడా సులభంగా అధిగమించవచ్చు. చాణక్య నీతిలో పురుషుల కొన్ని లక్షణాలు కూడా పేర్కొ్న్నాడు. ఈ లక్షణాలను కలిగి ఉన్న పురుషుల పట్ల మహిళలు సులభంగా ఆకర్షితులవుతారు. చాణక్య నీతిలో పేర్కొన్న పురుషుల లక్షణాలు ఏంటో చూద్దాం..
తమకు తగిన గౌరవం ఇచ్చే పురుషుల పట్ల మహిళలు సులభంగా ఆకర్షితులవుతారని చాణక్యుడు చెప్పాడు. స్త్రీలందరూ తమ భాగస్వామిని గౌరవించాలని కోరుకుంటారు. అలాంటి పురుషులు చాలా దృఢంగా ఉంటారు. అవతలి వ్యక్తి చెప్పేది జాగ్రత్తగా వింటారు. కాబట్టి స్త్రీలు తక్షణమే అలాంటి పురుషుల పట్ల ఆకర్షితులవుతారు.
చాణక్యుడు ప్రకారం, స్త్రీలు నిజాయితీ, నమ్మదగిన పురుషులను ఇష్టపడతారు. సాధారణంగా స్త్రీలు అబద్ధాలు చెప్పే మగవాళ్ళను ఇష్టపడరు. నిజాయితీ గల వ్యక్తి ఎల్లప్పుడూ నిజమైన మార్గాన్ని అనుసరిస్తాడు. అటువంటి పరిస్థితిలో వారు ఎప్పుడూ తప్పు చేయరు. నిజాయితీ గల పురుషులతో కలిసి జీవించడం వల్ల స్త్రీలు సంతోషంగా ఉంటారు. స్త్రీలు నిజాయితీ గల పురుషుల పట్ల త్వరగా ఆకర్షితులవుతారు.
మర్యాదగల పురుషులు
చాణక్య నీతి ప్రకారం, స్త్రీలు మర్యాదగల పురుషులను త్వరగా ఇష్టపడతారు. అహంకారం లేని, ఏ తప్పు జరిగినా వినయంతో అంగీకరించే పురుషులు చాలా అరుదు. పురుషుల ఈ గుణం బంధంలో మధురానుభూతిని తెస్తుందని మహిళలు నమ్ముతారు. మనిషి మొదట మర్యాదగా ఉండాలని చాణక్యుడు చెప్పాడు.
మంచి ప్రవర్తన
మంచి నడవడిక ఎవరి మనసునైనా గెలుచుకోగలదని అంటారు. చాణక్యుడు తన చాణక్య నీతిలో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించాడు. మహిళలు తరచుగా సాధారణ వ్యక్తిత్వం ఉన్న పురుషులను ఇష్టపడతారు. నిశ్శబ్ద పురుషుల పట్ల మహిళలు చాలా త్వరగా ఆకర్షితులవుతారు. చాణక్య నీతి స్త్రీలు సౌమ్యుడైన వ్యక్తితో ప్రేమలో పడతారని చెప్పారు.
బోల్డ్ పురుషులు
మహిళలు బోల్డ్ పురుషులను ప్రేమిస్తారు. కుక్క తన యజమానికి ఎంత రక్షణగా ఉంటుందో పురుషుడు తన భార్యకు రక్షణగా ఉండాలని చాణక్య నీతి చెబుతోంది. ఎల్లప్పుడూ భార్యను రక్షించండి. అంతేకాదు ఏదైనా ఉంటే నేరుగా చెప్పేయాలి. మహిళలు బోల్డ్ పురుషులను త్వరగా ఇష్టపడతారు.
చెప్పే విషయాలపై శ్రద్ధ
స్త్రీలు తమ భాగస్వామి మాట్లాడే విషయాలపై శ్రద్ధ వహించాలని, వారి మాటలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటారు. స్త్రీలు తమ చిన్న చిన్న చర్యలను కూడా చాలా శ్రద్ధగా వినే పురుషులను చాలా త్వరగా ఇష్టపడతారు. మహిళలు తమ హృదయాల్లో అలాంటి పురుషులకు సులభంగా చోటు కల్పిస్తారు.
చాణక్యుడు చెప్పిన జీవిత సత్యాలు ఎంతగానో ఉపయోగపడతాయి. చాణక్య నీతిలో చెప్పిన విషయాలను ఇప్పటికీ పాటించేవారు ఉన్నారు. వాటి ద్వారా జీవితంలో మనం ముందుకు వెళ్లడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే చాణక్యుడి జీవిత సత్యాలు నేటికీ ఫాలో అయ్యేవారు ఉన్నారు.