తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Raw Onions Health Benefits: పచ్చి ఉల్లిపాయలు తింటే ఆరోగ్యానికి మంచిదా? వివరాలివే

Raw Onions health benefits: పచ్చి ఉల్లిపాయలు తింటే ఆరోగ్యానికి మంచిదా? వివరాలివే

30 May 2023, 12:33 IST

    • Raw Onions health benefits: పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల ఆరోగ్యానికి కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. అవేంటో ఇక్కడ చూడండి.
Raw Onions health benefits: పచ్చి ఉల్లిపాయలు తీంటే ఆరోగ్యానికి మంచిదా? వివరాలివే (HT Photo)
Raw Onions health benefits: పచ్చి ఉల్లిపాయలు తీంటే ఆరోగ్యానికి మంచిదా? వివరాలివే (HT Photo)

Raw Onions health benefits: పచ్చి ఉల్లిపాయలు తీంటే ఆరోగ్యానికి మంచిదా? వివరాలివే (HT Photo)

Raw Onions health benefits: మన వంట గదుల్లో ఉల్లిపాయలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. టిఫిన్లు, కర్రీలు, పప్పు.. ఇలా చాలా వంటల్లో వాటిని వేస్తారు. వంటలకు ఉల్లిపాయలు మంచి రుచిని ఇస్తాయి. అయితే, కొందరికి వాసన కారణంగా ఉల్లిపాయలు అంతగా నచ్చవు. అందుకే కాస్త తక్కువగా తింటుంటారు. అయితే, ఉల్లిపాయలతో కలిగి ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుంటే.. ఇక వారు కూడా ఎక్కువగా తీసుకుంటారు. ముఖ్యంగా వండిన ఆనియన్స్ కంటే.. పచ్చి ఉల్లిపాయలతో చాలా ప్రయోజనాలు ఉంటాయి. ప్రతీ రోజు ఉల్లిపాయను పచ్చిగా తింటే శరీరానికి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. గుండె ఆరోగ్యం పెరగడం నుంచి కంటి చూపు మెరుగు వరకు కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అలా ఉల్లిపాయలను పచ్చిగా తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇక్కడ చూడండి.

రోగ నిరోధక శక్తి మెరుగు

ఉల్లిపాయలను వంటలో కాకుండా పచ్చిగా తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి మెరుగవుతుంది. ఆనియన్‍లో ఫైబర్, ప్రీబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. అవి రెండు శరీరంలో రోగాలకు కారణయ్యే వాటిని నిరోధించి.. రోగ నిరోధక శక్తి పెరిగేందుకు తోడ్పడతాయి.

గుండె ఆరోగ్యానికి..

ఉల్లిపాయల్లో యాంటియాక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. దీంతో ఉల్లిపాయలు తీసుకుంటే శరీరంలో ట్రిగ్లిసెరైడ్, చెడు కొలెస్ట్రాల్‍ తగ్గేందుకు సహాయపడతాయి. తద్వార గుండెకు మేలు జరుగుతుంది. గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.

కంటి చూపునకు మంచిది

విటమిన్-ఈని ఉత్పత్తి చేసే సెలేనియమ్ ఉల్లిపాయల్లో ఉంటుంది. విటమిన్-ఈ యాంటియాక్సిడెంట్‍గా పని చేసి కళ్లు చాలా మేలు చేస్తుంది. అందుకే పచ్చి ఉల్లిపాయ తింటే కంటి చూపునకు ప్రయోజనంగా ఉంటుంది.

సెక్సువల్ హెల్త్ మెరుగుదల

పునరుత్పాదక అర్గాన్లను పెంపొందించే ఆఫ్రోడిసియాక్‍గా ఉల్లిపాయ ఉంది. అంగస్తంభన సమస్య ఉన్న వారు ఉల్లిపాయ తినడం చాలా మంచిది. మొత్తంగా పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల సెక్యువల్ హెల్త్ మెరుగవుతుంది.

జ్యూస్‍లా అయినా..

ఉడికించిన, వండిన ఉల్లిపాయ కంటే పచ్చి ఉల్లిపాయ తింటేనే ఎక్కువగా ప్రయోజనాలు శరీరానికి అందుతాయి. అందుకే మోతాదు మేర పచ్చి ఉల్లిపాయ తీసుకుంటే మంచిది. ఒకవేళ నేరుగా పచ్చి ఉల్లిపాయ తినలేకపోయినా జ్యూస్ చేసుకొని అయినా తాగవచ్చు. అయితే, పచ్చి ఉల్లిపాయలు కూడా మోతాదు మేరకే తీసుకోవాలి. సైజును బట్టి రోజుకు ఒకటి, రెండు పచ్చి ఉల్లిపాయలు తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.