తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Wine Benefits:వైన్‌తో పార్టీలలో చిల్ అవుతున్నారా?అయితే ఈ విషయం తెలుసుకోండి!

Wine Benefits:వైన్‌తో పార్టీలలో చిల్ అవుతున్నారా?అయితే ఈ విషయం తెలుసుకోండి!

HT Telugu Desk HT Telugu

03 September 2022, 20:57 IST

  • Wine Health Benefits: వైన్ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలు అధ్యయనాలలో తేలింది.

     గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ నియంత్రణ.  ఇతరుల వ్యాధులను తగ్గించడంలో వైన్ ఉపయోగపడుతుందని వివరించాయి. 

Wine Health Benefits
Wine Health Benefits

Wine Health Benefits

Wine Health Benefits: వీకెండ్ వచ్చేసింది. ఇంకేంటి చాలా మంది ఎంజాయ్ మోడ్‌లోకి వెళ్ళిపోతారు. నలుగురు ఒక్క చోట చేరారంటే ముక్క, చుక్కతో ఫుల్ దావత్. అయితే కొంత అల్కహాల్ అలవాటు లేని వారు ప్రత్యామ్నాయంగా వైన్ తీసుకోవడానికి ట్రై చేస్తుంటారు. అయితే వైన్ తాగడం చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సాధారణంగా వైన్ పులియబెట్టిన ద్రాక్ష రసంతో తయారు చేయబడే ఆల్కహాలిక్ పానీయం. వైన్ తాగడం లైఫ్ ఎక్స్టెన్షన్, గుండె ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు. అలాగే జీర్ణక్రియ సజువుగా జరగడానికి, వివిధ రకాల వ్యాధుల చికిత్సకు ఔషధంగా ఉపయోగించబడింది. నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ 2018 అధ్యయనం ప్రకారం రెడ్ వైన్‌లో పాలీఫెనాల్స్ ఉన్నాయి. ఇవి ఆరోగ్యకరమైన హృదయనాళ పనితీరుకు అవసరమైన యాంటీఆక్సిడెంట్లు అందిస్తాయి. మధుమేహం, కొన్ని క్యాన్సర్లు, హృదయ సంబంధ రుగ్మతల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అయితే మితంగా తీసుకున్నప్పుడే ఈ ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి.

వైన్ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

1. కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది

ఇటీవలి అధ్యయనాల ప్రకారం, రెడ్ వైన్ మితంగా వినియోగించినప్పుడు హానికరమైన కొలెస్ట్రాల్‌ను తగ్గించవచ్చు. హానికరమైన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి రియోజా-శైలి రెడ్ వైన్‌లు ప్రత్యేకంగా ప్రాచుర్యం పొందాయి.

2. గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది

వైన్ కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంతో పాటు మొత్తం గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. రెడ్ వైన్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లలో పాలీఫెనాల్స్ ఒకటి. ఇవి రక్తనాళాల వశ్యతను, ఆరోగ్యాన్ని కాపాడుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి, ఇది అవాంఛితంగా రక్తం గడ్డకట్టడాన్ని నివారించడంలో సహాయపడుతుంది.

3. బ్లడ్ షుగర్ నియంత్రణ

ద్రాక్ష తొక్కలో ఉండే సహజ యాంటీఆక్సిడెంట్, రెస్వెరాట్రాల్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అధ్యయనం ప్రకారం రెస్వెరాట్రాల్‌ దాదాపు మూడు నెలల పాటు ప్రతిరోజూ దాదాపు 250 mg పదార్థాన్ని తీసుకున్న వారిలో రక్తంలో చక్కెర స్థాయిలు గణనీయంగా తగ్గాయి.

4. డిప్రెషన్ తగ్గిస్తుంది

మితమైన ఆల్కహాల్ వాడకం డిప్రెషన్ అవకాశాన్ని తగ్గిస్తుంది. రెడ్ వైన్ తాగే వారులో డిప్రెషన్ చాలా వరకు తగ్గుతుంది. వాస్తవానికి, రెడ్ వైన్ వల్ల ఈ ప్రయోజనం ఉన్నప్పటికీ, వైన్ తాగడం డిప్రెషన్ తగ్గించుకోవడానికి ఆచరణీయమైన ఎంపిక కాదని గ్రహించడం చాలా ముఖ్యం.

5. వైన్ దీర్ఘాయువును అందిస్తుంది

రెడ్ వైన్‌ను మితంగా తీసుకుంటే, తీసుకోని వారి కంటే ఎక్కువ కాలం జీవించవచ్చని పలు అధ్యయానాలలో తేలింది. వైన్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది, దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షణ కల్పించే రోగనిరోధక శక్తిని పెంచడం, సుదీర్ఘమైన, ఆరోగ్యకరమైన జీవితాలను ప్రోత్సహిస్తుంది.