తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  కొండకోనల్లో డాంటకుడడనా..! తెలియని వారితో శృంగారం చేయడం ఇక్కడి యువతుల ఆచారం

కొండకోనల్లో డాంటకుడడనా..! తెలియని వారితో శృంగారం చేయడం ఇక్కడి యువతుల ఆచారం

Manda Vikas HT Telugu

28 December 2021, 17:10 IST

    • గునుంగు కొండ జావనీస్ జాతికి ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఏదైనా అపవిత్ర కార్యం ముఖ్యంగా అపరిచితులతో శృంగారం చేస్తే వారికి తిరుగులేని అదృష్టం వరిస్తుందని ఇక్కడి ప్రజల నమ్మకం. ఈ ప్రదేశాన్ని మౌంట్ కెముకుస్ అని కూడా పిలుస్తారు. 
Representational Image
Representational Image (Unsplash)

Representational Image

మన చుట్టూ జరిగే కొన్ని ఆచారాలు మనకు వింతగా అనిపించొచ్చు కానీ ఎవరి విశ్వాసం వారిది, ఎవరి సంప్రదాయం వారిది. తమ పూర్వీకులు అందించిన ఆచారవ్యవహారాలను అనాదిగా పాటిస్తూ వారి తర్వాతి తరం వారికి పరిచయం చేసే జాతులు మన సమాజంలో ఎన్నో ఉన్నాయి. ఇలా వారు అమూల్యంగా భావించే సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడుకుంటూ నేటికీ వారి అస్థిత్వాన్ని నిలుపుకుంటున్నాయి కొన్ని జాతులు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొన్ని ఆచారాలు అలాంటివే!

ఎక్కడ ఉందంటే?

వివరాల్లోకి వెళ్తే, ఇండోనేసియాలోని జావా ద్వీపంలో సోలో అనే గ్రామానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో గునుంగు కొండ అనే ప్రాంతం ఉంది. ఇది ఇండోనేషియాలోని జావనీస్ జాతికి ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం. దీనిని మౌంట్ కెముకుస్ అని కూడా పిలుస్తారు. తర్వాతి కాలంలో ఇదే శృంగార కొండగా ప్రాముఖ్యత పొందింది. చుట్టూ పచ్చని అడవి, మధ్యలో కొండకోనలతో ఈ ప్రాంతం అంతా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ గునుంగు కొండపై ఏదైనా అపవిత్ర కార్యం ముఖ్యంగా అపరిచితులతో శృంగారం చేస్తే వారికి తిరుగులేని అదృష్టం వరిస్తుందని ఇక్కడి ప్రజల నమ్మకం.

శృంగారం వీరికి పవిత్ర కార్యం.. 

గ్రేగోరియన్ క్యాలెండర్ ప్రకారం పవిత్రమైన జుమాత్ పోన్, శుక్రవారం రోజున ఇండోనేషియా నలుమూలల నుంచి జావనీస్ జాతికి చెందిన యువతులు, వివాహిత మహిళలు గునుంగు కొండకు తరలివస్తారు. ఆ రోజున పరిశుద్ధంగా స్నానం ఆచరించి కొండపై కొలువై ఉన్న జావా యువరాజు పంగెరాన్ సామొడ్రో, అతడి ప్రేయసి న్యాగి ఒంట్రోవులన్ విగ్రహాలను పూలు, ఫలాలతో ఆరాధించి అనంతరం ఎవరైనా అపరిచితులతో శృంగారం జరిపి మొక్కు తీర్చుకోవడం ఆనవాయితీ. అది కూడా అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించాలి. అంటే తన అపరిచిత భాగిస్వామి పట్ల అమితమైన ప్రేమను కురిపిస్తూ శృంగారాన్ని ఆస్వాదిస్తూ అతడిని సంతృప్తి పరచాలి. 

ఇలా ఒకసారి కాదు వరుసగా ఏడు సార్లు, ప్రతీ 35 రోజులకోసారి ఈ శృంగార కార్యం నిర్వహించాలి. అంటే సుమారుగా వారిద్దరూ ఒక ఏడాది పాటు తమ బంధాన్ని కొనసాగించాలి. అప్పుడే మొక్కు చెల్లించడం పరిపూర్ణం అవుతుంది, ఇలా పరిపూర్ణంగా మొక్కు చెల్లించిన వారికి తమ జీవితంలో అదృష్టం, సుఖసంతోషాలు లభిస్తాయనేది ప్రతీతి.

ఎందుకు చేస్తారంటే?

జావనీస్ ఇతిహాసాల ప్రకారం జావా రాకుమారుడైన పంగెరాన్ సామొడ్రో అనే యువరాజు తన తండ్రి చిన్న భార్య అంటే తనకు పిన్ని వరుస అయ్యే న్యాగి ఒంట్రోవులన్ తో వెళ్లిపోయి ఈ గునుంగు కొండ ప్రాంతంలోనే నివసించారు. వీరి వ్యవహారం తెలిసిన రాజు వీరిరువురిని చంపేయాలని సైనికులను పంపాడు. ఈ జంట శృంగారంలో ఉండగా కార్యం మధ్యలోనే సైనికులు వీరిని నరికేశారు. దీంతో వీరి రక్తంతో తడిసిన ఇక్కడి నేల పవిత్రంగా మారినట్లు ఇక్కడి చరిత్ర చెబుతోంది. వీరి అమర ప్రేమకు చిహ్నంగానే అపరిచితులతో శృంగార కార్యం నిర్వహించడం ఇక్కడ ప్రారంభమైనట్లు కథనాలు వెలుగులోకి వచ్చాయి

అయితే ఈ శృంగార కొండపై గ్లోబల్ మీడియాలో కథనాలు రావడంతో ఈ ప్రాంతానికి పర్యాటకుల తాకిడి పెరిగి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. దీంతో ఈ కొండపై శృంగారాన్ని అక్కడి ప్రభుత్వం 2014లో నిషేధించింది. పర్యాటకరంగాన్ని ప్రోత్సహించేందుకు అయితే అనధికారికంగా మాత్రం పలు కార్యకలాపాలు ఇప్పటికీ సాగుతున్నాయనేది ప్రచారంలో ఉంది.