Buddha Motivational Quotes । జీవిత పరమార్థాన్ని తెలిపే గౌతమ బుద్ధుని బోధనలు ఇవే!
05 May 2023, 8:57 IST
- Happy Buddha Purnima 2023: బుద్ధ పూర్ణిమ సందర్భంగా స్ఫూర్తిదాయకమైన కొన్ని సూక్తులను ఇక్కడ అందిస్తున్నాం. వీటిని మీ ఆత్మీయులతో పంచుకోండి, ఇవి మీకు జీవితంలో మంచి ప్రేరణను ఇవ్వగలవు.
Happy Buddha Purnima 2023
Happy Buddha Purnima 2023: హిందూ క్యాలెండర్ ప్రకారం, వైశాఖ మాసంలో వచ్చే మొదటి పౌర్ణమి రోజును బుద్ధ పూర్ణిమగా గుర్తిస్తారు. ఈరోజునే బుద్ధుని జయంతిగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ ఏడాది బుద్ధ భగవానుడి జయంతి మే 5న శుక్రవారం రోజున వచ్చింది. గౌతమ బుద్ధుడు స్థాపించిన బౌద్ధమతం నేడు ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద మతంగా అవతరించింది. శాంతికాముకుడైన బుద్ధుడి శక్తివంతమైన బోధనలే ఎంతో మందిని బౌద్ధమతాన్ని స్వీకరించేలా చేశాయి. సాధారణంగా బౌద్ధమతం సంతోషకరమైన, ప్రశాంతమైన జీవితాన్ని ఎలా గడపాలో నొక్కి చెబుతుంది. మనల్ని మనం అర్థం చేసుకోవడం, మనకు ఉండే సమస్యలను శాంతి మార్గంలో ఎలా ఎదుర్కోవాలో నేర్పుతుంది.
బుద్ధ పూర్ణిమ సందర్భంగా స్ఫూర్తిదాయకమైన కొన్ని సూక్తులను ఇక్కడ అందిస్తున్నాం. వీటిని మీ ఆత్మీయులతో పంచుకోండి, ఇవి మీకు జీవితంలో మంచి ప్రేరణను ఇవ్వగలవు.
Motivational and Inspirational Quotes by Buddha- బుద్ధుని బోధనలు
- మనల్ని మనం తప్ప మరెవరూ రక్షించలేరు. మనకోసం ఎవరూ ఏం చేయలేరు, చేయాలని అనుకోరు. మన బాటలో మనం నడవాలి.
- మన ఆలోచనల ద్వారానే మనం రూపుదిద్దుకుంటాము, మనం ఎలాంటి ఆలోచనలు చేస్తామో అలాంటి వ్యక్తిగా మారతాం.
- మనస్సు స్వచ్ఛంగా ఉన్నప్పుడు, ఆనందం ఎప్పటికీ వదలని నీడలా అనుసరిస్తుంది.
- మీరు సాధించిన ఘనతను అతిగా అంచనా వేయకండి, అలాగే ఇతరులను చూసి అసూయపడకండి. ఇతరులను చూసి అసూయ చెందేవాడు ఎన్నటికీ మనశ్శాంతిని పొందలేడు.
- మూడు విషయాలు చాలా కాలం దాచబడవు: సూర్యుడు, చంద్రుడు, సత్యం.
- కరిగిపోవడం వలన కొవ్వొత్తి జీవితం తరిగిపోదు, ఒక్క కొవ్వొత్తి నుండి వేల కొవ్వొత్తులను వెలిగించవచ్చు. మీ జ్ఞానాన్ని పంచుకోవడం వల్ల, మంచిని వ్యాప్తి చేయడం వల్ల మీ ఆత్మ ఎల్లప్పుడూ వెలుగుతూనే ఉంటుంది.
- శాంతి అనేది మీ లోపలి నుండి వస్తుంది, బయట నుంచి కోరుకోవద్దు.
- మరణం, దుఃఖం నుండి ఎవరూ తప్పించుకోలేరు. జీవితంలో సంతోషాన్ని మాత్రమే ఆశించేవారు నిరాశ చెందుతారు.
- మీ పని మీ ప్రపంచాన్ని కనుగొనడం మరియు మీ హృదయంతో దానికి మిమ్మల్ని మీరు అప్పగించుకోవడం.
- మీరు మరొకరి జీవితంలో దీపం వెలిగిస్తే, అది మీ మార్గాన్ని కూడా ప్రకాశవంతం చేస్తుంది.
బుద్ధుడు చూపిన శాంతి మార్గం నేటికి స్ఫూర్థిదాయకం. జీవిత సారాన్ని అర్థం చేసుకోండి, ప్రశాంతమైన జీవితాన్ని అనుభవించండి. బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు!