Buddha Purnima |బుద్ధం శరణం గచ్ఛామి.. శక్తివంతమైన బుద్ధుని బోధనలు ఇవిగో!
వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు బుద్ధ జయంతిగా ప్రాముఖ్యత పొందింది. శాంతికాముకుడైన బుద్ధుని బోధనలు పఠించడం, బుద్ధుని స్మరించడం ఈరోజు చేస్తారు. జీవితసారాన్ని తెలిపే బుద్ధుని బోధనలు ఇక్కడ కొన్ని అందించాం. తెలుసుకోండి. పాపం కార్యం సుఖం.. పాప ఫలితం కడు దుర్భరం, బుద్ధుని బోధనలు శక్తివంతం
ఈరోజు వైశాఖ శుద్ధ పౌర్ణమి. బుద్ధుడు జన్మించిన రోజుగా ఈరోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతీ ఏడాది వైశాఖ మాసంలో (మే నెలలో) వచ్చే పౌర్ణమి రోజున ప్రపంచవ్యాప్తంగా బౌద్ధ మతాన్ని విశ్వసించే వారందరూ బుద్ధ జయంతిని ఎంతో పవిత్రంగా జరుపుకుంటారు. బుద్ధుని బోధనలు పఠిస్తారు, జీవిత చరిత్రను స్మరించుకుంటారు. బుద్ధుని చూపిన మార్గంలో నడుస్తామని ప్రతిజ్ఞలు చేస్తారు. బౌద్ధ మండపాలన్నీ అలంకరించి ఉత్సవాలు జరుపుతారు. ఎంతో భక్తిశ్రద్ధలతో బుద్ధుడిని ఆరాధిస్తారు.
వాస్తవానికి బుద్ధుడి జననమరణాల గురించి స్పష్టమైన సమాచారం లేదు. అయినప్పటికీ వైశాఖ పౌర్ణమి రోజునే బుద్ధుడికి బోధిచెట్టు కింద జ్ఞానోదయం అయిందని ప్రతీతి. ఈ ముహూర్తమే బౌద్ధ ధర్మానికి మూలకారణం అయిందని నమ్ముతారు. అనంతరం ఒక అధ్యాత్మిక గురువుగా, మహా బుద్ధుడిగా ఆయన అవతించాడు. అనంతరం బుద్ధుడు చేసిన ప్రవచనాలు, ఆయన చూపిన శాంతి మార్గం, ఆచరించిన ధర్మాలు తరతరాలుగా కొనసాగాయి, నేటికీ కొనసాగుతున్నాయి.
ఐహిక సుఖాలను వదులుకోవడం, కోరికలను త్యజించడం, క్రమశిక్షణతో జీవించడం, ధ్యానం ద్వారా ఆత్మను ప్రసన్నం చేసుకోవడం లాంటివి అతి ముఖ్యమైన బౌద్ధ సిద్ధాంతాలు.
బుద్ధుడు బోధించిన కొన్ని ధర్మాలు
1) పాపం చేసేటపుడు ఎవరికైనా సుఖ భ్రాంతి ఉంటుంది.
కానీ ఆ పాప ఫలితం అనుభవించే రోజున జీవితం కడు దుర్భరంగా ఉంటుంది.
2) కోపంగా ఉండటం అంటే రగిలే నిప్పును చేతబట్టడం
దానిని ఇతరులపై విసిరే లోపల ఆ నిప్పు నిన్ను దహించివేస్తుంది.
3) బుద్ధం శరణం గచ్చామి
ధర్మం శరణం గచ్చామి
సంఘం శరణం గచ్చామి
బుద్ధి విచక్షణతో ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధర్మ మార్గంలో ఈ సమాజంతో కలిసి నడవాలి
4) దుష్టులతో కలిసి నడవటం కంటే ఏకాకిగా ఉండటం ఎంతో మేలు
5) సంతోషంగా ఉండాలంటే ఒకటి నీ పరిస్థితిని మార్చుకోవాలి
లేదా నీ మనస్తత్వాన్ని మార్చుకోవాలి.
6) స్వీయ నియంత్రణ కలిగి ఉండటమే బలం
సరియైన ఆలోచనలు చేయటమే పాండిత్యం
ప్రశాంతంగా ఉండటమే శక్తి అసలు రూపం.
నీ ఆలోచనలతోనే నీ చుట్టూ ప్రపంచం ఏర్పడుతుంది.
సంబంధిత కథనం
టాపిక్