తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Before Gym: మొదటిసారి జిమ్‌కు వెళుతున్నారా..? ఈ విషయాలు తెలుసుకుని వెళ్తే బెటర్

Before Gym: మొదటిసారి జిమ్‌కు వెళుతున్నారా..? ఈ విషయాలు తెలుసుకుని వెళ్తే బెటర్

Ramya Sri Marka HT Telugu

22 December 2024, 18:30 IST

google News
  • Before Gym:  మొదటిసారి జిమ్‌కు వెళుతున్న వారికి మనసులో రకరకాల అనుమానాలు, ఆందోళనలు ఉంటాయి. వాటన్నింటినీ తట్టుకుని నిలబడి జిమ్‌లో ప్రశాంతంగా వర్కవుట్ చేయాలంటే ఈ విషయాలను ముందుగానే తెలుసుకోవడం బెటర్. 

మొదటిసారి జిమ్‌కు వెళుతున్నారా..? ఈ విషయాలు తెలుసుకుని వెళ్తే బెటర్
మొదటిసారి జిమ్‌కు వెళుతున్నారా..? ఈ విషయాలు తెలుసుకుని వెళ్తే బెటర్ (pixabay)

మొదటిసారి జిమ్‌కు వెళుతున్నారా..? ఈ విషయాలు తెలుసుకుని వెళ్తే బెటర్

జిమ్‌కు వెళ్లడం వర్కవుట్ చేయడం అనేది ఈరోజుల్లో పెద్ద విషయం ఏమీ కాకపోవచ్చు. కానీ వాస్తవం ఏంటంటే నేటీకీ చాలా మంది మహిళలు జిమ్‌కు వెళ్లడం అనేది గొప్ప విషయమే. జిమ్‌కు వెళ్లాలి అనుకునే స్త్రీలకు మనసులో ఎన్నో భయాలు, సంకోచాలు, ప్రశ్నలు ఉంటాయి. ఈ కారణంగా చాలా మంది మహిళలు జిమ్‌కు వెళ్లడానికి ఆందోళన చెందుతుంటారు. కానీ తప్పదు నేటి బిజీబిజీ లైఫ్ లో, కలుషిత ఆహారపు అలవాట్లతో ఆరోగ్యంగా ఉండటం కష్టం. కనుక ప్రతి ఒక్కరూ తమ ఫిట్నెస్ జర్నీని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లక తప్పదు. ముఖ్యంగా మహిళలు ఫిట్ గా, ఆరోగ్యంగా ఉండకపోతే పూర్తి కుటుంబం ప్రమాదంలో పడుతుంది. మొదటిసారి జిమ్ కు వెళ్లాలనుకుంటే కొన్ని ముఖ్యమైన విషయాలను గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది.

దుస్తుల విషయంలో..

జిమ్‌కు వెళ్ళేటప్పుడు మహిళలు గుర్తుంచుకోవాల్సింది దుస్తుల గురించి. జిమ్‌లో అసౌకర్యమైన పరిస్థితి బట్టల గురించి ఎదురు కావచ్చు. కాబట్టి అత్యంత సౌకర్యవంతమైన, సరైన ఫిట్టింగ్ జిమ్ దుస్తులను ఎంచుకోండి. ఇవి మరీ బిగుతుగా లేదా మరీ వదులుగా ఉండకూడదు. ఎందుకంటే కొన్ని వ్యాయామాలు చేసేటప్పుడు వదులుగా ఉండే బట్టలు ఇబ్బందిగా అనిపించొచ్చు. ఇది అసౌకర్యాన్ని కలిగిస్తుంది కూడా. అదే సమయంలో, బిగుతైన దుస్తులు కూడా కొన్నిసార్లు అసౌకర్య పరిస్థితిని కలిగిస్తాయి.

స్పోర్ట్స్ బ్రాను ఎంచుకోండి

మీకు పూర్తి మద్దతు ఇచ్చే సరైన, సౌకర్యవంతమైన ఫిట్టింగ్ ఉండే స్పోర్ట్స్ బ్రాను ఎంచుకోండి. దీనితో పాటు, ఎల్లప్పుడూ ప్యాడ్ స్పోర్ట్స్ బ్రాను ఎంచుకోండి. ఛాతీ పరిమాణం ఏదైనప్పటికీ, ఇది మిమ్మల్ని అసౌకర్య పరిస్థితి నుండి కాపాడుతుంది.

జిమ్ ట్రైనర్ విషయంలో

జిమ్ ఎంచుకునేటప్పుడు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండండి. సురక్షితమైన జిమ్ ను ఎంచుకోవడమే కాకుండా ట్రైనర్స్ కూడా మంచి వారై ఉండాలి. అలాగే, మీరు మొదటిసారి జిమ్ కు వెళుతున్నట్లయితే అసౌకర్యంగా ఉండకూడదనుకుంటే, ఎల్లప్పుడూ అమ్మాయిల టైమింగ్ లేదా గర్ల్స్ విభాగాన్ని ఎంచుకోండి. తద్వారా మీరు వ్యాయామంపై దృష్టి పెట్టవచ్చు. అసౌకర్యానికి గురికాకుండా ఉండవచ్చు.

సోషల్ మీడియాల నుంచి

మీరు మొదటిసారి జిమ్ లో వ్యాయామం చేయాలనుకుంటే జిమ్ లో పర్సనల్ ట్రైనర్ ఉంటే బాగుంటుంది. ఇలా చేయడం వల్ల అన్ని యంత్రాలను ఉపయోగించడంతో పాటు సరైన టెక్నిక్ కూడా తెలుస్తుంది. కానీ మీకు పర్సనల్ ట్రైనర్ సూచించకపోతే ముందుగానే ప్లాన్ చేసుకోండి. లేదా యూట్యూబ్ లాంటి సోషల్ మీడియాల నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని వ్యాయామం చేయండి. తద్వారా మీరు సమయాన్ని వృథా చేయకుండా వ్యాయామాన్ని సరిగ్గా పూర్తి చేయవచ్చు.

స్నేహితులు లేదా తెలిసిన వారితో మాత్రమే

ఇతరులు ఏమనుకుంటారో ఆలోచించకుండా, మీ ఫిట్‌నెస్‌పై దృష్టి సారించి లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నించండి. ఎలాంటి ఆందోళన లేకుండా ఉండాలంటే, జిమ్ కు వెళ్లే ప్రతిసారీ స్నేహితుడితో కలిసి వెళ్లేందుకు ప్రయత్నించాలి. ఇలా చేయడం వల్ల మీకు జిమ్ పార్టనర్ కూడా దొరుకుతారు. మీరు మొదటిసారి జిమ్ కు వెళ్తున్నామనే భయాందోళనలకు దూరంగా ఉంటారు. జిమ్ లో ఏదైనా సమస్య ఉన్నా, జిమ్ ట్రైనర్ తో ఇబ్బందికర పరిస్థితి ఉన్నా ఆలోచించకుండా జిమ్ ను మార్చుకోవడం మంచిది. మీకు సురక్షితంగా అనిపించే జిమ్ లో చేరడమే అన్ని విధాల ఉత్తమం.

తదుపరి వ్యాసం