తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Weight Loss: జిమ్‍కు వెళ్లకుండా 19 కేజీలు తగ్గిన మహిళ.. తాను పాటించిన 5 రూల్స్ గురించి పోస్ట్

Weight loss: జిమ్‍కు వెళ్లకుండా 19 కేజీలు తగ్గిన మహిళ.. తాను పాటించిన 5 రూల్స్ గురించి పోస్ట్

13 December 2024, 14:00 IST

google News
    • Weight loss: ఇంట్లోనే కొన్ని రూల్స్ పాటిస్తూ ఓ మహిళ 19 కేజీల బరువు తగ్గారు. తాను జిమ్‍కు వెళ్లలేదని చెప్పారు. ఇంట్లోనే వర్కౌట్స్ చేశారు. మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ వివరాలను ఇన్‍స్టాగ్రామ్‍ పోస్టులో వెల్లడించారు.
Weight loss: జిమ్‍కు వెళ్లకుండా 19 కేజీలు తగ్గిన మహిళ.. తాను పాటించిన 5 రూల్స్ గురించి పోస్ట్
Weight loss: జిమ్‍కు వెళ్లకుండా 19 కేజీలు తగ్గిన మహిళ.. తాను పాటించిన 5 రూల్స్ గురించి పోస్ట్

Weight loss: జిమ్‍కు వెళ్లకుండా 19 కేజీలు తగ్గిన మహిళ.. తాను పాటించిన 5 రూల్స్ గురించి పోస్ట్

బరువు తగ్గేందుకు కొందరు తమకు తగిన ప్లాన్‍ను సెట్ చేసుకుంటారు. ఆహారం, వర్కౌట్ల విషయంలో కొన్ని రూల్స్ పెట్టుకుంటారు. వెయిట్ లాస్ అవుతుంటారు. ఆస్ట్రేలియాకు చెందిన న్యూట్రిషన్ కోచ్ టెయాగాన్.. తాను 19 కేజీల బరువు తగ్గానంటూ ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ పెట్టారు. తన వెయిట్ లాస్ జర్నీ గురించి ఓ వీడియో పోస్ట్ చేశారు. తాను పాటించిన రూల్స్ వెల్లడించారు.

జిమ్‍కు వెళ్లకుండా ఇంట్లోనే వర్కౌట్స్ చూస్తే 19 కేజీల బరువు తగ్గానని టెయాగాన్ వెల్లడించారు. క్రాష్ డైటింగ్ లేకుండా.. తీవ్రమైన విధానాలు పాటించకుండా ఇంట్లోనే వెయిట్ లాస్ అయ్యానని, కొన్ని అలవాట్లు, మార్పులు ఇందుకు కారణమయ్యాయని చెప్పారు. తాను పాటించిన రూల్స్ వెల్లడించారు.

టెయాగాన్ పాటించిన ఐదు రూల్స్ ఇవి

బరువు తగ్గేందుకు తాను ఫాలో అయిన ఐదు నిబంధనలు ఏవో టెయాగాన్ తన పోస్టులో రాసుకొచ్చారు. అవేంటంటే..

  • క్యాలరీల లోపం: “నేను ప్రతీ రోజు అవసరమైన దాని కంటే 500 క్యాలరీలు తక్కువగా తిన్నాను. నా ఆహారాన్ని సమీక్షించుకున్నా” అని టెయాగన్ రాశారు.
  • పది వేల అడుగులు: తాను రోజులో 5000 అడుగుల నుంచి 10000 అడుగులు నడిచేలా ప్రతీ వారం పెంచుకుంటూ వెళ్లానని ఆమె వెల్లడించారు.
  • ఇంట్లోనే వర్కౌట్స్: తాను వారంలో 3 నుంచి 5 రోజులు 30 నిమిషాల పాటు స్ట్రెంథ్ ట్రైనింగ్ వర్కౌట్స్ చేశానని ఆమె చెప్పారు. తనకు అంతే టైమ్ కుదిరిందని, అయితే నిలకడగా అదే విధానం కొనసాగించడం ముఖ్యమని పేర్కొన్నారు.
  • ఒత్తిడి, నిద్ర: “ఒత్తిడి తగ్గించుకునేందుకు నేను యోగా, మెడిటేషన్, డీప్ బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‍లు చేశా. ప్రతీ రాత్రి 7 నుంచి 9 గంటలు నిద్రపోయా” అని ఆమె రాసుకొచ్చారు.
  • పోల్చుకోకుండా..: వెయిట్ లాస్ జర్నీలో తాను ఎవరితో పోల్చుకోకుండా.. తన వృద్ధిపైనే ఫోకస్ పెట్టానని టెయాగన్ తెలిపారు.

బరువు తగ్గేందుకు..

బరువు తగ్గేందుకు తీసుకునే ఆహారం, వర్కౌట్స్ చాలా ముఖ్యం. క్యాలరీలు తక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలి. ప్రోటీన్లు, విటమన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ ఉండే ఆహారాలు తినాలి. ప్రాసెస్డ్, ఫ్రైడ్, జంక్ ఫుడ్స్ లాంటివి తీసుకోకూడదు. పోషకాలతో ఉండే బ్యాలెన్స్డ్ డైట్ పాటించాలి.

వెయిట్ లాస్ అవ్వాలంటే వర్కౌట్స్ కూడా చాలా ముఖ్యం. ఎవరికి తగ్గట్టుగా వారు వర్కౌట్స్ ప్లాన్ చేసుకోవాలి. ఈ విషయంలో ఫిట్‍నెస్ ట్రైనర్ సలహాలు తీసుకోవచ్చు. జిమ్‍కు వెళ్లడమో.. వీలుకాకపోతే ఇంట్లోనే వర్కౌట్స్ చేసుకునేలా ప్రణాళిక రచించుకోవాలి.

గమనిక: ప్రతీ ఒక్కరి ఆరోగ్య, శారీరక, సామాజిక పరిస్థితులు, ఫిట్‍నెస్ గోల్స్ వేర్వేరుగా ఉండొచ్చు. అందుకే బరువు తగ్గాలనుకునే వారు వారి పరిస్థితికి తగ్గట్టుగా డైట్, వ్యాయామాలు ప్లాన్ చేసుకోవడం ముఖ్యం. అవసరమైతే సంబంధిత నిపుణులను సంప్రదించాలి.

తదుపరి వ్యాసం