తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ganesh Chaturthi 2022 : వినాయక పూజ కోసం ప్రసాదాలు సింపుల్​గా చేసేయండిలా..

Ganesh Chaturthi 2022 : వినాయక పూజ కోసం ప్రసాదాలు సింపుల్​గా చేసేయండిలా..

30 August 2022, 16:39 IST

google News
    • Ganesh Chaturthi 2022 : వినాయకుడికి భోజనమంటే మహా ప్రీతి అని పురాణాలు చెప్తున్నాయి. పార్వతీ దేవి గణేషునికి ఇష్టమైన వంటకాలను తయారు చేసి.. తినిపించేవారని పండితులు చెప్తారు. మరీ ఈ వినాయక చవితి రోజు.. స్వామికి ఎటువంటి నైవేద్యాలు సమర్పిస్తున్నారు. ఏమి చేయాలో తెలియకపోతే ఈ సింపుల్ రెమిడీస్​ను ప్రయత్నించండి. 
వినాయకునికి నైవేద్యాలు
వినాయకునికి నైవేద్యాలు

వినాయకునికి నైవేద్యాలు

Ganesh Chaturthi 2022 : రేపే గణేష్ చతుర్థి. ఈ పండుగ సమయంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది నైవేద్యాలు గురించే. ఎందుకంటే గణనాథుడు భోజన ప్రియుడని అందరికీ తెలిసిందే. పైగా చవితి సమయంలో చాలామంది ఉండ్రాళ్లను ఎక్కువగా తయారు చేసి.. స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు. అయితే పదిరోజులకు పైగా జరిగే ఈ పండుగలో వినాయకునికి రకరకాల ప్రసాదాలను అందిచవచ్చు. వీటికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. అయితే మీరు తప్పకుండా ప్రయత్నించాల్సిన నైవేద్యాలు, వాటి తయారీ విధానం ఇక్కడ ఉంది.

బెల్లం, ఓట్స్ మోదకం

ఒక కప్పు ఓట్స్‌ను మూడు-నాలుగు నిమిషాలు వేయించాలి. వాటిని చల్లార్చి.. కొన్ని డ్రై ఫ్రూట్స్, గింజలతో కలిపి పౌడర్‌గా చేయాలి. ఇప్పుడు 1/2 కప్పు తరిగిన బెల్లం వేసి గ్రైండ్ చేయాలి. ఓ గిన్నె తీసుకుని దానిలో రెండు టేబుల్ స్పూన్ల దేశీ నెయ్యి, పాలు, మిక్స్ చేసిన పిండి వేసి కలపండి. మోదకాల రూపంలో మిశ్రమాన్ని తయారు చేసుకుని.. 10 నిమిషాలు ఆవిరిలో ఉడికించాలి. అంతే బెల్లం, ఓట్స్ మోదకం రెడీ.

మోతీచూర్ లడ్డూ

వినాయకునికి మరో ఇష్టమైన వంటకం మోతీచూర్​ లడ్డూ అని చెప్పవచ్చు. దానికోసం ముందుగా చక్కెర సిరప్ తయారుచేసుకోవాలి. పాలు, తర్వాత యాలకుల పొడి, ఆరెంజ్ ఫుడ్ కలర్ వేయాలి. ఒక గిన్నె తీసుకుని అందులో శెనగపిండి, పాలు వేయాలి. బాగా కలిపాక బేకింగ్ సోడా వేయాలి.

పాన్‌లో నెయ్యి వేడి చేసి మిశ్రమాన్ని బంగారు రంగు వచ్చేవరకు కలపండి. చక్కెర సిరప్‌తో గ్లేజ్ చేయండి. చల్లారిన తర్వాత లడ్డూలు చేయండి.

ఖీర్

బాణలిలో నెయ్యి, దంచిన యాలకులు, నానబెట్టిన బియ్యాన్ని వేసి.. రెండు నిమిషాలు ఉడికించాలి. దానిలో పాలు పోసి మరిగించాలి. తక్కువ వేడి మీద సుమారు 25 నిమిషాలు ఉండనివ్వాలి. ఇప్పుడు రుచికి తగినంత చక్కెర వేసి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి. దానిలో బాదం, జీడిపప్పు వంటి గింజలను కూడా వేసుకోవచ్చు. స్టవ్ ఆపేసి.. గది ఉష్ణోగ్రతకు వచ్చిన తర్వాత దానిని ఫ్రిజ్​లో ఉంచాలి. మరిన్ని నట్స్​తో గార్నిష్ చేసి.. సర్వ్ చేసుకోవచ్చు.

పైనాపిల్ హల్వా

పాన్‌లో కొన్ని తరిగిన పైనాపిల్స్, నీరు, రుచికి చక్కెర వేయాలి. పసుపు లేదా కొద్దిగా కుంకుమపువ్వు వేసి బాగా కలపాలి. అది ఉడికిన తర్వాత ఒక పాన్​లో నెయ్యి, కొంచెం రవ్వ వేసి వేయించాలి. జీడిపప్పు, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. మిశ్రమాన్ని లేత బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ఉడికించిన పైనాపిల్ మిశ్రమాన్ని వేయించిన రవ్వతో కలపాలి. నట్స్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు.

తదుపరి వ్యాసం