తెలుగు న్యూస్ / ఫోటో /
Ganesh Chaturthi 2022 : పండుగకు చీరలే అందం.. వాటిని ట్రెండీగా ఇలా స్టైల్ చేయండి
- Ganesh Chaturthi 2022 : వినాయక చవితి దగ్గరలోనే ఉంది. రోజూ ఎలా ఉన్నా.. పండుగ రోజు మాత్రం బాగా రెడీ అవ్వాలని అందరికీ ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయులు ట్రెడీషనల్గా కనిపించేందుకు.. ఆసక్తి చూపిస్తారు. అయితే ట్రెండీగా, సంప్రదాయంగా కనిపించాలంటే.. మీరు ఈ సెలబ్రెటీలను ఫాలో అయిపోండి.
- Ganesh Chaturthi 2022 : వినాయక చవితి దగ్గరలోనే ఉంది. రోజూ ఎలా ఉన్నా.. పండుగ రోజు మాత్రం బాగా రెడీ అవ్వాలని అందరికీ ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయులు ట్రెడీషనల్గా కనిపించేందుకు.. ఆసక్తి చూపిస్తారు. అయితే ట్రెండీగా, సంప్రదాయంగా కనిపించాలంటే.. మీరు ఈ సెలబ్రెటీలను ఫాలో అయిపోండి.
(1 / 6)
పండుగలు అంటే పూజలు, పిండివంటలు, సాంప్రదాయ దుస్తులు. ఆ సమయంలో వస్త్రధారణలో ఎలాంటి రాజీపడకుండా అందరూ ఓటు వేసేది సాంప్రదాయ దుస్తులకే. అయితే త్వరలో రానున్న గణేష్ చతుర్థికి మీరు ఇప్పటినుంచే షాపింగ్ చేసేయాలి. మీకు నచ్చినట్లు ఫ్యాషన్‌గా, ఇంట్లో వాళ్లకి సాంప్రదాయంగా కనిపించాలనుకుంటే.. మీరు ఈ సెలబ్రిటీలను ఫాలో అయిపోవాల్సిందే. (Instagram)
(2 / 6)
కియారా అద్వానీ : మీరు మీ లుక్‌లో వైబ్రెంట్‌గా కనిపించకూడదనుకుంటే.. కియారును ఫాలో అయిపోవచ్చు. మంచిగా షీర్ చీరను ఎంచుకోవచ్చు. దానిని భారీ ఆభరణాలతో జత చేసి.. మినిమల్ మేకప్‌తో మీ లుక్ సెట్ చేసుకోవచ్చు. పండుగరోజు నలుపు వేసుకోవాలని ఎక్కువమంది అనుకోరు కాబట్టి వేరే రంగుల్లో ఇలాంటి లుక్‌ని సెట్ చేసుకోండి.(Instagram/@kiaraaliaadvani)
(3 / 6)
జాన్వీ కపూర్ : ఇది షీర్ చీరల సీజన్. జాన్వీ కపూర్ లాగా క్లాసిక్ ఎంబ్రాయిడరీ చీరను ఎంచుకోండి. బేసిక్ స్లీవ్‌లెస్ బ్లౌజ్, ఆధునిక ఆభరణాలతో మీ లుక్ నిజంగానే అదిరిపోతుంది.(Instagram/@janhvikapoor)
(4 / 6)
రకుల్ ప్రీత్: ఈ పండుగ సీజన్‌లో.. అమ్మలు రకుల్ ప్రీత్ లుక్‌ని కచ్చితంగా ఇష్టపడతారు. మీ వార్డ్‌రోబ్ నుంచి టైమ్‌లెస్ చీరను ఎంచుకోండి. దానికి మ్యాచింగ్ బ్లౌజ్, అందమైన జ్యువెలరీ కలిపి తయారైతే.. పండుగంత మీ చుట్టూనే ఉంటుంది.(Instagram/@rakulpreet)
(5 / 6)
భూమి పెడ్నేకర్: రంగులతో ప్రయోగాలు చేయడానికి వెనుకడగు వేయొద్దు. ఇప్పుడు ఇదే ఫ్యాషన్. పాస్టెల్ లెహంగాలు ఇప్పుడు ట్రెండ్‌లోనే ఉన్నాయి. అయితే ఈ పండుగ సీజన్‌లో ప్రత్యేకంగా నిలవాలి అనుకుంటే.. మీరు భూమిని ఫాలో అయిపోవచ్చు.(Instagram/@bhumipednekar)
ఇతర గ్యాలరీలు