Ganesh Blessings : వినాయకుని ఆశీర్వాదం.. ఆ రాశుల వారిపై ఏడాదంతా ఉంటాయట..-ganesh blessings on these zodiac signs from vinayaka chavithi 2022 ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ganesh Blessings : వినాయకుని ఆశీర్వాదం.. ఆ రాశుల వారిపై ఏడాదంతా ఉంటాయట..

Ganesh Blessings : వినాయకుని ఆశీర్వాదం.. ఆ రాశుల వారిపై ఏడాదంతా ఉంటాయట..

Geddam Vijaya Madhuri HT Telugu
Aug 25, 2022 12:41 PM IST

గణపతి బప్పా మోరియా అంటూ భక్తులు వినాయకచవితికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మట్టి విగ్రహాలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు భక్తులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఎన్ని విగ్రహాలు పెట్టినా.. ఎన్ని పూజలు చేసినా.. అది వినాయకుని ఆశీర్వాదం కోసమే. అయితే కొన్ని రాశులవారిపై వినాయకుని ఆశీర్వాదం ఏడాది పొడవు ఉంటుందంటున్నారు జ్యోతిష్యులు. మరి ఆ రాశుల వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

వినాయక చవితి
వినాయక చవితి

Ganesh Blessings : నవరాత్రికి ముందు.. కృష్ణాష్టమి తర్వాత వచ్చే అతి పెద్ద ప్రధాన పండుగ వినాయక చవితి. ప్రతి వీధి వినాయకుని విగ్రహాలతో కళకళలాడిపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో గణేష్ చతుర్థికి మంచి ప్రాధన్యత ఇస్తారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ప్రతి గణేష్ చతుర్థి సమయంలో బహుళ రాశులపై గణేషుని ఆశీర్వాదాలు ఉంటాయి. అయితే ఈ సంవత్సరం కూడా పలు రాశుల వారిపై వినాయకుని ఆశీర్వాదాలు ఉంటాయంటున్నారు. అయితే పలు రాశులవారిపై ఏడాది పొడవునా వినాయకుని ఆశీర్వాదం ఉంటుందని అంటున్నారు జ్యోతిష్యులు. ఆ రాశుల వారు ఎవరంటే..

మేష రాశి

మేష రాశి వారికి ఎల్లప్పుడూ గణేశుడి ఆశీర్వదాలు అందుతాయి. కాబట్టి మేష రాశి వారు ఏ పనిలోనైనా విజయం సాధిస్తారు. వారు ఏదైనా త్వరగా చేయగలరు. వినాయకుని ఆశీర్వాదంతో మేష రాశి వారికి ధైర్యం పెరుగుతుంది.

మిథునరాశి

మిథున రాశి వారు గణేశుడి అనుగ్రహం వల్ల ప్రయోజనం పొందుతారు. ఉద్యోగంలో విజయం సాధిస్తారు. వ్యాపారాలు చేసే మిథున రాశి వారికి లాభం ఉంటుంది. గణేషుడి ఆశీర్వాదంతో మిధున రాశి వారు ఏ పనిలోనైనా విజయం సాధిస్తారు.

మకరం

మకర రాశి వారికి శనిగ్రహం ఆశీర్వాదం ఉంటుంది. వారి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఏ పనిలోనైనా సులభంగా విజయం సాధిస్తారు. వినాయకుని ఆశీర్వాదంతో మకరరాశి వారి జీవితం విజయవంతమవుతుంది.

WhatsApp channel