Vinayaka Chavithi School Holiday : స్కూళ్లకు వినాయక చవితి హాలిడే
30 August 2022, 16:18 IST
- తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు వినాయక చవితి సందర్భంగా సెలవు ప్రకటించింది.
ప్రతీకాత్మక చిత్రం
వినాయక చవితి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలకు సెలవు ప్రకటించింది. ఆగస్టు 31న వినాయక చవితిని పురస్కరించుకుని పాఠశాలలకు హాలిడే ఇస్తోంది. గతంలో విడుదల చేసిన స్కూల్ క్యాలెండర్ లోనే సెలవు తేదీని పేర్కొంది.
ఆగస్టు 31 నుంచి వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం అవుతున్నాయి. మరోవైపు గణేష్ మండపాల ఏర్పాటు, ఉత్సవాల నిర్వహణకు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. పలు నిబంధనలను పేర్కొంటూ ప్రకటన విడుదల చేశారు.
నిబంధనలు ఇవే
Guidelines For Setting Up Ganesh Pandals: విగ్రహం సైజు, బరువు, ఉత్సవం ఎన్ని రోజులు నిర్వహిస్తారు. నిమజ్జనం చేసే తేదీ, కమిటీ సభ్యుల వివరాలను ముందుగానే తెలియజేయాలి.
బలవంతపు చందాలు వసూళ్లు చేయరాదు. ఎవరైనా అటువంటి చర్యలకు పాల్పడితే డయల్ 100 గానీ ఫిర్యాదు చేయవచ్చు.
మట్టితో తయారుచేసిన విగ్రహాలనే పూజించేందుకు ప్రాధాన్యమివ్వాలి.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదాలు జరగకుండా నిర్వాహకులు, మందుస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. నిర్లక్ష్యంగా వహించరాదు.
కమిటీ సభ్యులు రాత్రి సమయంలో మండపం వద్ద కాపలాగా ఉండాలి.
శబ్దకాలుష్యం విషయంలో పీసీబీ నియమాలు విధిగా పాటించాలి.
ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లు వినియోగించాలి.
మండపాల ప్రదేశం వద్ద ట్రాఫిక్ అంతరాయం కలిగించకూడదు.
విగ్రహాల ఊరేగింపు సమయంలో అశ్లీల పాటలు వేసినా, డ్యాన్సులు చేసినా కఠిన చర్యలు ఉంటాయి.
మందుగుండు సామగ్రి కాల్చరాదు,
వినాయక నిమజ్జన ఊరేగింపు నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలి.
ఘర్షణలకు కారణమైన వారిపై కేసులు నమోదు చేస్తారు.