తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ganesh Chaturthi 2022 । వినాయక విగ్రహ ప్రతిష్ఠాపనకు శుభముహూర్తం, పూజా విధానం!

Ganesh Chaturthi 2022 । వినాయక విగ్రహ ప్రతిష్ఠాపనకు శుభముహూర్తం, పూజా విధానం!

HT Telugu Desk HT Telugu

29 August 2022, 11:08 IST

google News
    • Ganesh Chaturthi 2022 : ఈ ఏడాది వినాయక చవితి ఆగష్టు 31న వస్తుంది. ఈ గణేష్ ఉత్సవాలు పది రోజుల పాటు ఘనంగా జరుగుతాయి. అయితే విగ్రహ ప్రతిష్ఠకు శుభముహూర్తం ఏమిటి? ఏ సమయంలో గణేషుడిని ఆరాధించాలి? పూజా విధానం ఇక్కడ తెలుసుకోండి.
Ganesh Chaturthi 2022
Ganesh Chaturthi 2022 (Pixabay)

Ganesh Chaturthi 2022

హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిథి నాడు గణేష్ చతుర్థి జరుపుకుంటారు. గణేష్ మహోత్సవం చతుర్థి తిథి నుండి ప్రారంభమై 10 రోజుల పాటు కొనసాగుతుంది. అనంత చతుర్దశి నాడు నిమజ్జనోత్సవం నిర్వహిస్తారు.

ఈ ఏడాది వినాయక చవితి ఆగస్టు 31, బుధవారం నాడు వస్తుంది. చతుర్థి తిథి ఆగష్టు 30, 2022న మధ్యాహ్నం 03:33 గంటలకు ప్రారంభమై ఆగస్టు 31, 2022న మధ్యాహ్నం 03:22 గంటలకు ముగుస్తుంది. గణేశ పూజ ముహూర్తం ఉదయం 11:06 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 01:40 గంటలకు ముగుస్తుంది.వినాయక నిమజ్జనం అనంత చతుర్దశి నాడు సెప్టెంబర్ 9, శుక్రవారం జరుగుతుంది.

వినాయక చతుర్థి నాడు చంద్రుడిని చూడకూడదు, చూసిన వారు అపనిందలు మోయాల్సి వస్తుందని ఒక నమ్మకం ప్రచారంలో ఉంది.

Ganesh Chaturthi 2022 శుభ ముహూర్థం

2022 ఆగష్టు 31, బుధవారం రోజున ఉదయం 11:05 నుంచి మధ్యాహ్నం 1:38 గంటల వరకు శుభ సమయం ఉంది. ఈ ముహూర్తాన గణేశుడిని పూజిస్తే మంచిది. అలాగే ఇదే రోజున ఉదయం 05:58 నుంచి మధ్యాహ్నం 12:12 వరకు రవియోగం ఉంటుంది. ఈ కాలంలో శుభ కార్యాలు చేయడం చాలా మంచిదని పండితులు చెబుతున్నారు.

గణనాథుడి పతిష్ఠ ఎప్పుడు చేయాలి?

చతుర్థి తిథి ఆగస్టు 30, 2022 మధ్యాహ్నం 03:33 గంటలకు ప్రారంభమవుతుంది. ఆగస్టు 31 మధ్యాహ్నం 03.22 గంటలకు ముగుస్తుంది. పద్మ పురాణం ప్రకారం గణేశుడు మధ్యాహ్న కాలంలో స్వాతి నక్షత్రంలో జన్మించాడు. కాబట్టి ఆగస్టు 31వ తేదీ ఉదయం 11:05 గంటల నుంచి సెప్టెంబర్ 1వ తేదీ మధ్యాహ్నం 01.38 గంటల వరకు గణపతి ప్రతిష్ఠాపనకు శుభ ముహూర్తం. ఈ సమయంలో గణేషుడి ప్రతిష్టించడం, పూజించడం శుభసూచకం.

వినాయకుడి విగ్రహం ఎలా ఉండాలి

  • గణపతి విగ్రహం మట్టితో తయారు చేసినదై ఉండాలి.
  • మట్టితో పాటు బంగారం, వెండి, స్ఫటికం వంటి పదార్థాలతో చేసిన వినాయక విగ్రహాన్ని ఇంట్లో లేదా పనిచేసే చోట ఉంచవచ్చు.
  • విగ్రహం ప్రసన్నవదనంతో ఉండాలి. కోపంగా ఉండకూడదు.
  • అలాగే విగ్రహం విరిగిన స్థితిలో ఉండకూడదని గుర్తుంచుకోండి.
  • గణేశుడి విగ్రహంలో చేతులు వరం ఇచ్చే భంగిమలో ఉండాలి.
  • ఇవేకాకుండా అంకుశం, తొండం, లడ్డూలు, ట్రంక్, అతని శరీరంపై ఒక దారం, పక్కనే ఎలుక వాహనం ఉండాలి. డెకొరేషన్ ఐడియాలు కోసం క్లిక్ చేయండి.

గణేషుడి విగ్రహ ప్రతిష్ఠాపన, పూజా విధానం

  • వినాయక చవితి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తల స్నానం ఆచరించి, శుభ్రమైన బట్టలు ధరించండి.
  • విగ్రహ ప్రతిష్ఠ చేసే చోటును గంగాజలంతో శుద్ధి చేయాలి.
  • ఆరిన తర్వాత, ఎరుపు లేదా తెలుపు వస్త్రాన్ని పరిచి దానిపై ఒక ప్లేటులో గంధం, కుంకుమ, అక్షతలతో స్వస్తిక గుర్తును వేయండి.
  • స్వస్తిక గుర్తుపై గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించండి.
  • రిద్ధి-సిద్ధి రూపంలో విగ్రహానికి రెండు వైపులా తమలపాకులను ఉంచండి.
  • గణేశ విగ్రహానికి కుడి వైపున నీటితో నిండిన కలశాన్ని ఉంచండి.
  • గరిక, ఇతర పత్రాలు, పుస్తకాలు మొదలైనవి ఉంచవచ్చు.
  • పూజా స్థలంలో తూర్పు దిక్కుకు అభిముఖంగా ఆసనంలో కూర్చోండి.
  • మీ ఇంటి దేవతను తలుచుకోండి, పూజను ప్రారంభించండి.
  • ఓం గణపతయే నమః అనే మంత్రాన్ని జపిస్తూ పుష్పాలు, పత్రాలతో వినాయకుడిని పూజించండి.
  • నైవేద్యాలు సమర్పించండి.

వినాయకుడు విగ్రహం ఉన్నన్నీ రోజులు దీపధూప నైవేద్యాలు సమర్పిస్తూ, పరిశుద్ధంగా ఉంటూ విఘ్నేశ్వరుడిని ఆరాధించాలి.]

తదుపరి వ్యాసం