తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Wednesday-win This Day | ఖేల్ ఖతమ్ అయ్యేదాక డోంట్ స్టాప్ రే..

Wednesday-Win This Day | ఖేల్ ఖతమ్ అయ్యేదాక డోంట్ స్టాప్ రే..

HT Telugu Desk HT Telugu

13 April 2022, 8:14 IST

    • గెలవలేదంటే.. ఓడిపోవడం కాదు. ప్రయత్నాన్ని విరమించడమే అసలైన ఓటమి. అందుకే ఒకసారి ఓడిపోయామని.. లేదా ఎంత కష్టపడినా గెలుపు రావట్లేదని.. అవకాశాలు దొరకట్లేదని.. అనుకున్న దానిని ఆపేయకూడదు. గెలుపు అనేది ముఖ్యమే కానీ.. గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా.. ఓర్పుగా, కొత్త అంశాలు నేర్చుకుంటూ ముందుకు సాగడమే అసలైన గెలుపు.
సక్సెస్ మంత్ర
సక్సెస్ మంత్ర

సక్సెస్ మంత్ర

Motivational | లైఫ్​లో సక్సెస్ అవ్వాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కలల వేరు కావొచ్చు కానీ.. గమ్యానికి చేరుకోవాలనే ఆలోచన మాత్రం అందరినీ ఒకేవైపు నడిపిస్తుంది. సక్సెస్ అనేది మనం ఆలోచిస్తూ కుర్చుంటేనో లేదా దాని గురించి తెలుసుకుంటేనో సరిపోదు. మన దేనిలో విజేతగా నిలవాలి అనుకుంటున్నామో దాని గురించి పూర్తిగా తెలుసుకుని... ప్రణాళికలు వేసుకుని... కృషి చేస్తే.. అనుకున్న రంగంలో విజయం సాధిస్తాము.

ట్రెండింగ్ వార్తలు

Coconut Chutney: మూడు పప్పులు కలిపి ఇలా కొబ్బరి పచ్చడి చేస్తే అన్నంలో అదిరిపోతుంది

Banana Milk Shake: బనానా మిల్క్ షేక్ ఇలా తాగితే వేసవి తాపం నుంచి బయటపడవచ్చు

Coconut water: కొబ్బరి బోండా నుండి నేరుగా కొబ్బరినీళ్లు తాగకూడదట, ఎందుకో తెలుసుకోండి

Sweating Benefits: చెమట పట్టడం లేదని ఆనందపడకండి, చెమట పడితేనే కిడ్నీలు రాళ్లు చేరవు

‘Failure is not the opposite of Success. It is part of Success’

విజయం సాధించడం అంటే అంత సులువేమి కాదు. ఒక్కోసారి ఎంత కష్టపడినా తగిన ఫలితం రాదు. ఒక్కోసారి అసలు విజయమే సాధించలేకపోవచ్చు. ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన లైఫ్​లో అంతా ముగిసిపోయినట్టు కాదు. ‘Try and Try until you Succeed' అన్నట్లు.. ట్రై చేస్తూనే ముందుకు పోవాలి. అయినా సక్సెస్​ అనేది వెంటనే వచ్చినా దానిని పెద్దగా ఆస్వాదించలేము. ఎన్నో కష్టాలు పడి.. ఎన్నో ప్రయత్నాలు చేసిన తర్వాత వచ్చే సక్సెస్​ గురించి మాటల్లో చెప్పలేము.

వెన్నుతట్టి ప్రోత్సాహించేవారు ఉంటే..

''గెలుపులో ఏముందిరా.. మహా అయితే ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది. ఒక్కసారి ఓడిపోయి చూడు.. ప్రపంచం అంటే ఏంటో నీకు పరిచయం అవుతుంది.'' అని పిల్లజమీందార్ మూవీలో రావు రమేష్ చెప్పే డైలాగ్​ ఇది. నిజమే గెలిచే వరకు మనం ఎవరు అనేది ఎవరూ పట్టించుకోరు. మన చుట్టూ ఉన్న వాళ్లు గెలిచింది మావాడే అని చెప్పుకుంటారు. అది ఒక్కసారి ఓడిపోతే.. ఎవరు మనవారో తెలుస్తుంది. గెలుపులో పక్కన ఉండే వారు కాదు.. ఓడిపోయినప్పుడు వెన్నుతట్టి.. మళ్లీ పోరాడు అని చెప్పేవారే ముఖ్యం.

డీవియేట్ అవ్వకుండా..

ఓటమితో ఒక్కోసారి మనం ఎప్పటికీ విజయం సాధించలేమేమో అనే ఆలోచనలు వస్తుంటాయి. అలాంటి సమయంలో మన చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా మనల్ని డీవియేట్ చేయడానికి ప్రయత్నిస్తాయి. వాటికి తలొగ్గకుండా.. అనుకున్న రంగంలో, అనుకున్న పనిలో ముందుకు వెళ్లడమే మీ విజయానికి బాటలు వేస్తాయి. ఇలా వయసుతో సంబంధం లేకుండా, ఓటములతో కుంగిపోకుండా ఓ వ్యక్తి విజయం సాధించిన గాథ ఇటీవలె చిత్రంగా మన ముందుకు వచ్చింది. ‘Kaun Pravin Tambe?'.. ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా ఏప్రిల్ 1వ తేదీన విడుదలైంది. ఇండియన్ క్రికెట్ టీమ్​కి ఆడాలనే తన తపన.. 41 ఏళ్లలో టీ 20 లీగ్​వైపునకు అతనిని నడిపింది.

టాపిక్