Green Tea Timings : ఈ సమయంలో గ్రీన్ టీ తాగుతున్నారా? ప్లీజ్ ఇకపై వద్దు
21 April 2023, 9:49 IST
- Green Tea Benefits : గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిదిగా చెబుతారు. అందుకే దీన్ని తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. కానీ గ్రీన్ టీని సరైన సమయంలో సరైన పద్ధతిలో తీసుకుంటేనే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. తాగడానికి సరైన సమయం తెలుసుకోవాలి.., లేకుంటే అది సమస్య కావచ్చు.
గ్రీన్ టీ
గ్రీన్ టీ(green tea)ని రోజు తీసుకోవడం వల్ల బరువు తగ్గడమే కాకుండా యాంటీ ఆక్సిడెంట్ గుణాల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇది అందరికీ తెలుసు. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది దీనిని తాగేందుకు మొగ్గు చూపుతారు. ఎందుకంటే ఇది ఆరోగ్యకరమైన పానీయం మాత్రమే కాదు.. సురక్షితమైనది కూడా. అయితే కొన్ని సమయాల్లో దీనిని తాగకూడదు.
గ్రీన్ టీ ప్రయోజనాలు
క్యాన్సర్(cancer) చాలా తీవ్రమైన వ్యాధి. గ్రీన్ టీ తాగడం వల్ల క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు. ఇందులోని పాలీఫెనాల్స్ ట్యూమర్, క్యాన్సర్ కణాలను నివారిస్తుంది. ముఖ్యంగా బ్రెస్ట్, ప్రోస్టేట్ క్యాన్సర్‌ను నిరోధించే శక్తి గ్రీన్ టీకి ఉంది.
గ్రీన్ టీని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల రక్తంలోని చెడు కొలెస్ట్రాల్(Cholesterol) స్థాయిని తగ్గిస్తుంది. ఇది రక్త నాళాలలో అడ్డంకిని తగ్గిస్తుంది, గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తుంది.
చర్మం(Skin) దెబ్బతిన్నప్పుడు, కణాలను పునరుజ్జీవింపజేయవలసి వచ్చినప్పుడు గ్రీన్ టీ(Green Tea) తాగడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది స్కిన్ ఇన్ఫెక్షన్ల(Skin Infection) నుండి కాపాడుతుంది. ఇది వాపు తగ్గించడంలో సహాయపడుతుంది. గ్రీన్ టీ తాగడం వల్ల చర్మానికి ఉపయోగకరంగా ఉంటుంది. మొటిమలను తగ్గిస్తుంది.
గ్రీన్ టీలోని యాంటీ ఆక్సిడెంట్లు జీవక్రియను పెంచుతాయి. దీన్ని తాగడం వల్ల శరీరంలోని కొవ్వు క్రమంగా తగ్గుతుంది. వ్యాయామానికి ముందు తాగడం మంచిది. బరువు తగ్గేందుకు నిపుణులు.. గ్రీన్ టీని తాగమంటారు.
గ్రీన్ టీ ఎప్పుడు తాగాలి ?
భోజనానికి గంట ముందు గ్రీన్ టీ తాగడం ప్రయోజనకరంగా పరిగణిస్తారు. అయితే భోజనం చేసిన వెంటనే దీనిని తాగవద్దు. ఖాళీ కడుపుతో గ్రీన్ టీ(Green Tea) తీసుకోవద్దు. రోజుకు గరిష్టంగా 3 కప్పుల గ్రీన్ టీ తాగాలి. అంతకు మించి తాగడం సమస్యగా మారుతుంది. పడుకునే ముందు ఎప్పుడూ గ్రీన్ టీ తాగకండి. పడుకునే ముందు తాగడం వల్ల డీహైడ్రేషన్ ఏర్పడుతుంది.
గ్రీన్ టీ ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగడం వల్ల గుండె కొట్టుకోవడం క్రమరహితంగా ఉంటుందని వివిధ అధ్యయనాలు సూచిస్తున్నాయి. కాబట్టి గుండె జబ్బులు ఉన్నవారు గ్రీన్ టీకి దూరంగా ఉండటం మంచిది. ఇందులో ఉండే కెఫీన్.. మీ నిద్ర చక్రంపై(Sleeping Cycle) ప్రభావం చూపుతుంది. మీరు డిప్రెషన్‌లో ఉన్నట్లయితే.. మీరు ఖచ్చితంగా ఖాళీ కడుపుతో గ్రీన్ టీని తాగకూడదు. గ్రీన్ టీలో టానిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కడుపులో ఎసిడిటీని పెంచుతాయి. ఇది మలబద్ధకం, వికారాన్ని కలిగిస్తాయి.