తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Onion Juice For Hair : ఉల్లిరసంతో జుట్టు రాలడం ఆగుతుందా? నిజాలేంటి?

Onion Juice For Hair : ఉల్లిరసంతో జుట్టు రాలడం ఆగుతుందా? నిజాలేంటి?

HT Telugu Desk HT Telugu

02 April 2023, 19:04 IST

google News
    • Onion Juice For Hair : ఉల్లి రసాన్ని జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు పెరుగుతుందని నమ్ముతారు. ఇది పురాతన కాలం నుండి ఉపయోగించబడుతున్న ఇంటి నివారణ. కానీ అందరికీ ఒకే విధమైన పరిష్కారాన్ని అందించకపోవచ్చు. దీని గురించి నిపుణులు ఏమంటున్నారు?
ఉల్లిరసం
ఉల్లిరసం

ఉల్లిరసం

మెరిసే, దృఢమైన జుట్టు(Healthy Hair) పొందడానికి ఉల్లిపాయ రసాన్ని తలకు పట్టించడం ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న హోం రెమెడీ. ఇది కిచెన్‌లో సులభంగా దొరుకుతుంది. ఎటువంటి రసాయనాలు లేకుండా సహజంగా తయారు చేయబడినందున, చాలా మంది సహజ సౌందర్యం కోసం దీనిని తలకు అప్లై చేస్తారు. చాలా మంది ఈ నేచురల్ హెయిర్ మాస్క్‌(Natural Hair Mask)తో తమకు సానుకూల ప్రయోజనాలు ఉన్నాయని చెబుతారు. ఉల్లిపాయలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్ లక్షణాలు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయని అంటారు. ఉల్లిపాయలలో సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది. సల్ఫర్ హెయిర్ ఫోలికల్స్ పునరుత్పత్తికి సహాయపడుతుందని చెబుతారు.

చర్మవ్యాధి నిపుణుడు డా.జై శ్రీ శరద్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఇది అపోహ అని, శాస్త్రీయ అధ్యయనాలు తగినంతగా మద్దతు ఇవ్వలేదని చెప్పారు. జుట్టు పెరుగుదలకు(Hair Growth) ఉల్లిపాయ రసం నిజంగా మంచిదైతే, బట్టతల ఉన్నవారు ఉండరు అని అంటున్నారు. అందరూ ఉల్లిపాయ రసాన్ని(Onion Juice) తలకు రాసుకుంటే జుట్టు విపరీతంగా పెరుగుతుంది కదా అని శరద్ అంటున్నారు.

అది నిజంగా జుట్టు రాలడానికి(Hair Loss) కారణమవుతుందని చర్మవ్యాధి నిపుణులు శరద్ అంటున్నారు. నిజానికి ఇది చికాకు, దద్దుర్లు, కాలిన గాయాలు, జుట్టు నష్టం కలిగిస్తుందట. మీరు జుట్టు రాలడాన్ని ఎదుర్కొంటుంటే, చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించండని చెబుతున్నారు. నిపుణుల సలహా లేకుండా ఇంటి నివారణలను ఉపయోగించడం మానుకోవాలని డాక్టర్ శరద్ చెప్పారు.

ఈస్తటిక్ క్లినిక్స్ కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ రింకీ కపూర్ మాట్లాడుతూ.. ఉల్లిపాయ రసాన్ని తలకు రాసుకోవడం వల్ల అందరికీ ఒకే రకమైన ప్రయోజనం ఉండదని, కొంతమంది సైడ్ ఎఫెక్ట్స్‌(Side Effects)ను ఎదుర్కొంటారని అంటున్నారు. ఉల్లిపాయ రసాన్ని ఉపయోగించడం వల్ల కేవలం 2 వారాల్లో తలపై జుట్టు తిరిగి పెరుగుతుందని నమ్ముతారు. కానీ, జుట్టుకు ఉపయోగించే ముందు చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించడం మంచిదని చెబుతున్నారు.

'ఉల్లిపాయ రసాన్ని తలకు పట్టించడం(Onion Juicer To Hair) వల్ల అందరికీ ప్రయోజనం ఉండదు. ఇది మంచి కంటే ఎక్కువ హాని చేస్తుంది. ఉల్లిపాయ రసం జుట్టు పెరుగుదలకు లేదా ఇతర జుట్టు సమస్యలకు(Hair Problems) సహాయపడుతుందని సోషల్ మీడియాలో వచ్చే వాటిని నమ్మకండి. ఉల్లిపాయ రసం తలపై మంట, దురద కలిగించవచ్చు. ఇది జుట్టు రాలడానికి కారణమవుతుంది. కాబట్టి ఉల్లిపాయ రసాన్ని తలకు పట్టించకుండా ఉండటం మంచిది.' అని రింకీ కపూర్ అంటున్నారు.

తదుపరి వ్యాసం