Christmas 2024: క్రిస్మస్ రోజున పిల్లలు ఎంతో ఇష్టంగా తినే స్ట్రాబెర్రీలతో ఇలా పేస్ట్రీలు తయారు చేయండి
22 December 2024, 17:00 IST
Christmas 2024: క్రిస్మస్ పండుగ వచ్చేస్తోంది. కేకులు, పేస్ట్రీలు లేకుండా పండుగకు ప్రత్యేకతే ఉండదు. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే స్ట్రాబెర్రీ పండ్లలో వారికి నచ్చే విధంగా ఇలా పేస్ట్రీలను తయారు చేసి వారికి ఇవ్వండి. మీ పండుగ సంతోషాన్ని రెట్టింపు చేసుకొండి.
క్రిస్మస్ రోజున పిల్లలు ఎంతో ఇష్టంగా తినే స్ట్రాబెర్రీలతో
క్రిస్మస్ పండుగకు ఇంకొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. ప్రపంచవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటూ గిఫ్ట్‌లతోనూ, స్వీట్స్‌తోనూ తమ ఆనందాన్ని ఇతరులతో పంచుకుంటారు. మరి ఆ గిఫ్టులు, స్వీట్లు బయట నుంచి తెచ్చేకన్నా ఇంట్లోనే తయారు చేసుకుంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆనందాన్ని పొందవచ్చు కదా. ఈ ప్రత్యేక సందర్భంలో పిల్లలకు ఏదైనా రుచికరంగా చేయాలనుకుంటే, మీరు కేకులతో పాటు పేస్ట్రీలను కూడా తయారు చేయవచ్చు. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే స్ట్రాబెర్రీ ఫ్లేవర్డ్ పేస్ట్రీలను ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇది ఖచ్చితంగా మీ పిల్లలకు నచ్చుతుంది. మీ పండుగ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే ఈ పేస్ట్రీలను పిల్లల టిఫిన్ లో కూడా పెట్టిపంపించవచ్చు.
స్ట్రాబెర్రీ పేస్ట్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు..
మైదా పిండి -1/2 టీస్పూన్
బేకింగ్ పౌడర్ - 3 టీస్పూన్
ఉప్పు - 1/2 కప్పు
కరిగించిన వెన్న - 1/2 కప్పు
నీరు - 250 గ్రాములు
చక్కెర - 50 గ్రాములు
పెరుగు - 1 టీస్పూన్
ఆపిల్ సైడర్ వెనిగర్ - 1/2 టీస్పూన్
బేకింగ్ సోడా - 1/4 టీస్పూన్
వెనిల్లా ఎక్స్ట్రాక్ట్ - 1 టీస్పూన్
విప్పింగ్ క్రీమ్ - 1 టీస్పూన్
ఐసింగ్ షుగర్ - రుచికి సరిపడ
స్ట్రాబెర్రీ పేస్ట్రీ ఎలా తయారు చేయాలి:
- ఈ పేస్ట్రీ తయారు చేయడానికి, పిండి, బేకింగ్ పౌడర్, చిటికెడు ఉప్పును తీసుకుని జల్లెడ పట్టండి.
- ఈ మూడింటిని ఒక గిన్నెలో వేసి బాగా కలపండి.తరువాత ఈ మిశ్రమంలో పెరుగు, నీరు, చక్కెర, ఆపిల్ సైడర్ వెనిగర్, వెనిల్లా ఎక్స్ట్రాక్ట్ లను వేయండి.
- ఇవన్నీ చక్కగా కలిసిపోయి చక్కెర మొత్తం కరిగే వరకు ఈ మిశ్రమాన్ని బాగా కలపండి.తర్వాత అందులో బేకింగ్ సోడా చల్లి అంతా సమానంగా కలపాలి.
- ఇప్పుడు పిండి మిశ్రమంలో పెరుగు, కరిగించిన వేసి వెన్న కలపుతూ మెత్తని పిండిలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక బేకింగ్ ప్యాన్ తీసుకుని దానికి కాస్త వెన్న లేదా నెయ్యిని రుద్ది ఈ మిశ్రమాన్ని దాంట్లో పోయాలి.
- ఆ ప్యాన్ ను గాలి పోకుండా మూత పెట్టి పక్కకు ఉంచండి.తరువాత ఓవెన్ ను 180 డిగ్రీల సెల్సియస్ లో 15 నిమిషాల పాటు వేడి చేయండి.
- ఇప్పుడు 7 నుండి 8 అంగుళాల చతురస్రాకార ట్రేను వెన్నలో ముంచండి. తర్వాత అందులో బటర్ పేపర్ వేసి ట్రే పైన కూడా బటర్ అప్లై చేయాలి
- ఇప్పుడు కేక్ పాన్ ను ప్రీహీట్ చేసిన ఓవెన్ లో ఉంచి 30 నుంచి 35 నిమిషాల పాటు బేక్ చేయాలి. ఓవెన్లో నుంచి బయటకు తీసి చల్లారిన తర్వాత మధ్యలో కట్ చేసి పంచదార పాకం వేయాలి.
- తర్వాత దానిపై ఫ్రోస్టింగ్, స్ట్రాబెర్రీ ముక్కలు వేసి మూతపెట్టాలి. పైన బాగా క్రీమ్ వేసి స్ట్రాబెర్రీ ముక్కలు వేయాలి. దానిపై స్ట్రాబెర్రీ జామ్ ను కూడా వేసుకోవచ్చు.
- అంతే స్ట్రాబెర్రీ పేస్ట్రీ తయారయినట్లే. క్రిస్మస్ పర్వదినాన ఇంట్లో వాళ్ల కోసం మీరు ప్రత్యేకంగా చేసే ఈ వంటకం వారికి చాలా సంతోషాన్నిస్తుంది. స్ట్రాబెర్రీలు రుచితో పాటు పిల్లల ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.