తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Strawberry Growing: స్టాబెర్రీలను ఇంటి బాల్కనీలోనే కుండీల్లో సులువుగా పెంచేయండిలా

Strawberry growing: స్టాబెర్రీలను ఇంటి బాల్కనీలోనే కుండీల్లో సులువుగా పెంచేయండిలా

Haritha Chappa HT Telugu

16 February 2024, 14:00 IST

    • Strawberry growing: స్ట్రాబెర్రీలు కచ్చితంగా తినాల్సిన పండ్లు. ఇవి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందికి ఫేవరెట్ ఫ్రూట్స్. వీటిని ఇంట్లోనే పెంచుకోవచ్చు.
స్ట్రాబెర్రీ మొక్కల పెంపకం
స్ట్రాబెర్రీ మొక్కల పెంపకం (pixabay)

స్ట్రాబెర్రీ మొక్కల పెంపకం

Strawberry growing: పిల్లలకు ఇష్టమైన పండ్లలో స్ట్రాబెర్రీ ఒకటి. స్ట్రాబెర్రీలను రోజువారీ డైట్లో చేర్చుకోమని పోషకాహారు నిపుణులు చెబుతూ ఉంటారు. ఇవి తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇవి సూపర్ మార్కెట్లలో అన్ని సీజన్లో లభిస్తాయి. తీపి, పుల్లని రుచిని కలిపి ఉండే ఈ పండ్లు మన రోగనిరోధక శక్తిని పెంచి వ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి. స్ట్రాబెర్రీలను ఇంటి బాల్కనీలోనే సులువుగా పెంచుకోవచ్చు. వీటికి ఎండతగిలే చోటు ఉంటే చాలు, సులువుగా పెరిగేస్తాయి.

స్ట్రాబెర్రీలను ఇంట్లోనే పెంచడం ఎలా?

స్ట్రాబెర్రీలను ఇంటి దగ్గర ఎలా పెంచాలో సులువైన పద్ధతులు ఇక్కడ మేము చెబుతున్నాము. స్ట్రాబెర్రీలను ముందుగా కొని తెచ్చుకోవాలి. వాటికి బయట వైపునే చిన్నచిన్న విత్తనాలు ఉంటాయి. ఆ సీడ్స్‌ను జాగ్రత్తగా తీసి ఒక టిష్యూ పేపర్ మీద పెట్టాలి. వాటికి ఎండ తగిలేలా కాసేపు ఉంచండి. ఒక కుండీలో పొడిగా ఉండే మట్టిని వేసి ఈ సీడ్స్ ను అందులో చల్లండి. ఎండ తగిలేచోట ఆ కుండీని నాలుగు గంటల పాటు ఉంచండి. కానీ నీరు వేయకండి. ఈ విత్తనాలు చల్లడానికి ముందే ఆ మట్టి పోషకాలతో నిండి ఉందో లేదో చూసుకోండి. వర్మీ కంపోస్ట్, కోకోపీట్, మట్టి అన్ని కలిపి ఆ కుండీలో వేయండి. ఇప్పుడు ఆ కుండీల్లో లోతుగా రంధ్రాలు చేసి ఈ సీడ్స్ ను అందులో వేయండి. ప్రతి సీడ్ కు మధ్య గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి.

ఇప్పుడు ఆ మట్టిపై నీళ్లు చల్లండి. మరీ ఎక్కువ నీళ్లు చల్లినా స్ట్రాబెర్రీలు మొలకెత్తకపోవచ్చు. అలాగని మరీ పొడిగా ఉన్నా కూడా అవి మొలకత్తలేవు. కాబట్టి చిన్న గ్లాస్ తో కుండీలో నీళ్లు చల్లుతూ ఉండండి. మట్టి తడిగా ఉండేలా చూసుకోండి.

మీరు బియ్యం కడిగే నీటిని, అరటి పండు తొక్కలను నానబెట్టిన నీటిని వేస్తూ ఉండండి. ఇవి మంచి ఫెర్టిలైజర్లుగా పనిచేస్తాయి. ఒక నెల రోజులపాటు ఇలా వాటిని కాపాడుకుంటే అవి మొక్కలుగా ఎదుగుతాయి. నెల రోజులు తర్వాత స్ట్రాబెర్రీలు కాయడం మొదలవుతుంది. ఏదైనా పండుకి డామేజ్ అయినట్టు అనిపిస్తే, ఆ పండును వెంటనే కట్ చేసి పడేయండి. లేకపోతే మిగతా పండ్లకు కూడా జెర్మ్స్ చేరవచ్చు.

బాల్కనీలో ఉండే చిన్న ఖాళీ ప్రదేశాల్లోనే కుండీలతో ఈ స్ట్రాబెర్రీ మొక్కలను పెంచుకోవచ్చు. ఒక్కసారి పెంచితే మీకే అలవాటైపోతుంది. పెద్ద కుండీల్లో పెంచుకుంటే స్ట్రాబెర్రీలు ఎక్కువగా వస్తాయి.

ఇంట్లోనే స్ట్రాబెర్రీలు పెంచుకోవడం వల్ల సేంద్రియ పద్ధతిలోనే అవి పెరుగుతాయి. ఎలాంటి రసాయనాలు చల్లాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇవి ఎంతో ఆరోగ్యకరం అని చెప్పవచ్చు. ఎర్రటి ఈ పండును అనేక వంటల్లో భాగం చేసుకుంటారు. పిల్లలు చాకోలెట్ ద్రవంలో ఈ స్ట్రాబెర్రీను ముంచి తింటూ ఉంటారు. ఐస్ క్రీమ్, మిల్క్ షేక్, జామ్ రూపంలో కూడా వీటిని తినవచ్చు. ప్రతిరోజూ రెండు స్ట్రాబెర్రీలు తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.

టాపిక్

తదుపరి వ్యాసం