తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mango Dessert Glass Recipe । మామిడిపండు డెజర్ట్.. వేసవి సాయంకాలానికి పర్‌ఫెక్ట్!

Mango Dessert Glass Recipe । మామిడిపండు డెజర్ట్.. వేసవి సాయంకాలానికి పర్‌ఫెక్ట్!

HT Telugu Desk HT Telugu

28 April 2023, 16:06 IST

google News
    • Mango Dessert Glass Recipe: మీకు డెజర్ట్స్ అంటే ఇష్టమా? మామిడిపండుతో రుచికరమైన చల్లని డెజర్ట్ ఎలా చేయాలో ఇక్కడ రెసిపీ ఉంది చూడండి.
Mango Dessert Glass
Mango Dessert Glass (Unsplash)

Mango Dessert Glass

Mango Recipes: సీజన్‌కు తగినట్లుగా ఆ సీజన్‌లో లభించే పండ్లు తినడం ఆరోగ్యకరం. ఈ వేసవికాలం మామిడిపండ్లకు సీజన్ అని తెలిసిందే. ప్రతిరోజూ భోజనంతో పాటు ఒక మామిడిపండును తినాలని న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు. మామిడి పండ్లలో శరీరానికి అవసరమయ్యే విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె లతో పాటు పొటాషియం, మెగ్నీషియం, బీటా కెరోటిన్, ఫోలేట్, కోలిన్ వంటి అద్భుతమైన పోషకాలు ఉంటాయి. ఇవన్నీ మీ శరీరంలో వివిధ అవసరాలను తీరుస్తాయి.

మామిడిపండును కేవలం పండుగానే కాకుండా చాలా రకాలుగా తీసుకోవచ్చు. ఈ పండుకు ఉండే ఆకర్షణీయమైన రంగు, మధురమైన రుచి కారణంగా స్వీట్లు, డెజర్ట్‌లు చేసుకోవటానికి అద్భుతంగా ఉంటుంది. స్మూతీలు, జ్యూస్‌లు, ఐస్ క్రీంలు ఇలా చాలా రకాలుగా మామిడిపండును ప్రయత్నించవచ్చు. మీకోసం ఇక్కడ ఒక ప్రత్యేకమైన మ్యాంగో డెసర్ట్ గ్లాస్ రెసిపీని అందిస్తున్నాం. ఇలా ఒకసారి తినిచూడండి.

Mango Dessert Glass Recipe కోసం కావలసినవి

  • 1 కప్పు పాలు
  • అరకప్పు క్రీమ్
  • 1 టేబుల్ స్పూన్ తేనె
  • 1/2 tsp దాల్చిన చెక్క పొడి
  • 1/2 కప్పు మామిడిపండు ముక్కలు
  • పుదీనా గార్నిషింగ్ కోసం

మ్యాంగో డెసర్ట్ గ్లాస్ తయారీ విధానం

  1. ముందుగా ప్యాన్ వేడి చేసి, అందులో పాలు, క్రీమ్ వేసి సగానికి తగ్గేవరకు వేడిచేయండి.
  2. తర్వాత అందులో తేనె, దాల్చిన చెక్క పొడిని కలపండి
  3. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చి, ఆపై మామిడిపండు ముక్కలను వేయండి.
  4. ఈ మిశ్రమాన్ని ఒక గ్లాసులోకి తీసుకొని. దీన్ని రెండు గంటల పాటు ఫ్రిజ్ లో ఉంచి చల్లబరచండి
  5. చివరగా ఫ్రిజ్ నుండి బయటకు తీసి, పుదీనా రెమ్మతో అలంకరించండి.

అంతే, మ్యాంగో డెసర్ట్ రెడీ. చల్లచల్లగా సర్వ్ చేసుకోండి.

తదుపరి వ్యాసం