రాత్రి భోజనం చేసిన తర్వాత మామిడిపండు తింటున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి!-mango season nutritionist reveals the right time and way to eat the fruit ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  రాత్రి భోజనం చేసిన తర్వాత మామిడిపండు తింటున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి!

రాత్రి భోజనం చేసిన తర్వాత మామిడిపండు తింటున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి!

HT Telugu Desk HT Telugu
May 21, 2022 03:19 PM IST

ఏదైనా మితంగా తినడం మంచిది. అలాగే తీసుకుకే ఆహార సమయం కూడా చాలా ముఖ్యం. ఆహార విషయంలో చేసే పొరపాట్లు కారణంగా చాలా అనారోగ్య సమస్యలు వస్తుంటాయి.

<p>Mango&nbsp;</p>
Mango

వేసవిలో విరివిగా దొరికే పండ్లలో మామిడి పండు ఒకటి. ఈ కాలంలో వాటిని తినని వారు చాలా అరుదు. మామిడిని పండ్లలో రాజుగా చెప్పుకునే ఈ మధురఫలం రుచి అమోఘం అని చెప్పవచ్చు. అయితే మామిడిపండును తినే విషయంలో కొందరికి కొన్ని అపోహాలు ఉన్నాయి. ఉదాహరణకు, మామిడిపండ్లు తినడం వల్ల బరువు పెరుగుతారని, వాటిని తిన్న తర్వాత జీర్ణక్రియలో ఇబ్బందులు ఉంటాయని నమ్ముతుంటారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మామిడిపండ్లను ఎప్పుడు తినాలి, ఎప్పుడు తినకూడదు. రాత్రి భోజనం చేసిన తర్వాత మామిడి పండ్లను తినడం మంచిదా చెడ్డదా? అనే విషయాలపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

కేలరీలను పెంచుతుంది:

సాధారణ పరిమాణంలో ఉండే మామిడి పండ్లలో దాదాపు 150 కేలరీలు ఉంటాయి. రాత్రిపూట మామిడిపండు తినడం వల్ల శరీరంలో కేలరీలు రెట్లు పెరుగుతాయి. ఎందుకంటే రాత్రి సమయంలో శరీరక శ్రమ ఉండదు కాబట్టి బాడీలో కేలరీలు పెరిగిపోతాయి. అందుకే మామిడి పండును రాత్రిపూట కాకుండా పగలు తినాలని నిపుణులు అంటున్నారు.

శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది:

రాత్రిపూట మామిడి పండ్లను తినే వారి శరీర ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. మామిడి పండ్లను ఎక్కువగా తింటే మొటిమల సమస్య కూడా వస్తుంది. ఇప్పటికే చర్మంపై మొటిమలు ఉన్నవారు మామిడి పండు తినేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి:

మధుమేహం ఉన్నవారు ముఖ్యంగా రాత్రిపూట మామిడి పండ్లను తినకూడదు. మామిడిపండు శరీరంలో చక్కెర స్థాయిని పెంచుతుంది.

బరువు పెరగడం కావచ్చు:

మామిడిని బరువు పెరగడానికి కూడా కారణమవుతుంది. పగటిపూట మామిడి పండు తినడం వల్ల శారీరకంగా ఎలాంటి నష్టం ఉండదు. రాత్రి తినడంలో వల్ల శరీరంలో కొంత మేరకు కొవ్వు పేరుకుపోతుంది. మీరు ఇప్పటికే అధిక బరువుతో ఉన్నట్లయితే, రాత్రిపూట మామిడి పండ్లను తినడం వలన మీరు మరింత బరువు పెరిగే అవకాశం ఉంటుంది.

అజీర్తితో సమస్యలు రావచ్చు

రాత్రిపూట మామిడిపండు తింటే అజీర్తి కూడా వస్తుంది. ఇది అతిగా తినడం వల్ల రావచ్చు. అందుకే మధ్యాహ్న భోజనం సమయంలో మామిడిపండు తింటే మంచిది.

(ఇక్కడ అందించిన సమాచారం కేవలం నిపుణులు అభిప్రాయం మాత్రం. ఇది సాధారణ సమాచారం మాత్రమే.)

Whats_app_banner

సంబంధిత కథనం