Popsicles | మ్యాంగో బెర్రీ పాప్సికల్స్. .మనసు దోచేస్తుంది వీటి రుచి!-here is how to make popsicles with mangos and strawberries ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Popsicles | మ్యాంగో బెర్రీ పాప్సికల్స్. .మనసు దోచేస్తుంది వీటి రుచి!

Popsicles | మ్యాంగో బెర్రీ పాప్సికల్స్. .మనసు దోచేస్తుంది వీటి రుచి!

HT Telugu Desk HT Telugu
May 24, 2022 04:58 PM IST

ఎండాకాలంలో ఐస్ పాప్సికల్స్ తింటుంటే వచ్చే మజానే వేరు, చిన్ననాటి రోజులు గుర్తుకువస్తాయి. మీకూ తినాలనిపిస్తుందా? బయటకు ఎటూ వెళ్లకుండా ఇంట్లోనే ఉండి ఇలా మ్యాంగో బెర్రీ పాప్సికల్స్ చేసుకోండి.

<p>Popsicles</p>
Popsicles (Stockphoto)

ఎండాకాలం ఇంకా అయిపోలేదు, మన దాహం ఇంకా తీరనే లేదు. కాబట్టి ఈ కాలంలో లభించే పండ్లతో వేడుకలు చేసుకుంటూనే ఉండాలి. మామిడి పండ్ల నుంచి పుచ్చకాయల వరకు మనకు ఏ పండ్లూ సరిపోవు. మొత్తం పండ్ల రసాలను దోచేయాలి, ఈ వేసవిని పీల్చి పిప్పిచేయాలి.

ఈ సీజన్ లో మనకు ఎక్కువగా దొరికేవి మామిడి పండ్లు. స్మూతీస్ నుండి డెజర్ట్‌ల వరకు మామిడి పండ్లను ఎలా అయినా తీసుకోవచ్చు. చాలా మందికి ఇష్టమైన పండ్ల జాబితాలో మామిడిపండ్లు ఎప్పుడూ అగ్రస్థానాన్ని ఆక్రమిస్తాయి. మామిడిపండ్లు వేడి అయినప్పటికీ ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే మామిడిపండ్లకు స్ట్రాబెర్రీ రుచిని మిక్స్ చేస్తే దాని రుచి ఎంతగా ఉంటుందో మీరు టేస్ట్ చేశారా? చేయకపోతే బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ పర్సనల్ ట్రైనర్ యాస్మిన్ కరాచీవాలా ఒక సులభమైన ఐస్ పాప్సికల్ రెసిపీని పంచుకున్నారు. నోరూరించే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయకుండా ఉండలేరు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానాన్ని ఇక్కడ తెలుసుకోండి.

కావలసినవి:

  • మామిడి పండ్లు - 2
  • స్ట్రాబెర్రీలు - 1 కప్పు
  • బాదాం పాలు - ¼ కప్పు

తయారీ విధానం

  1. ముందుగా మామిడిపండ్లను ముక్కలుగా కోసుకొని మిక్సర్ బ్లెండర్‌లో వేసి కలపాలి.
  2. ¼ కప్ బాదాం పాలు కూడా వేసి మృదువుగా మిక్స్ చేసుకోవాలి. అవసరం మేరకు నీరు కలుపుకోవచ్చు.
  3. ఇప్పుడు సెపరేటుగా స్ట్రాబెర్రీలను ప్యూరీ లాగా మిక్స్ చేసుకోవాలి.
  4. ఇప్పుడు పాప్సికల్స్ చేసేందుకు అచ్చు పాత్రలను తీసుకొని అందులో సగం వరకు స్ట్రాబెర్రీ ప్యూరీ నింపండి, మిగతా సగం మామిడిపండు ప్యూరీతో నింపండి.
  5. ఈ మిశ్రమంలో పాప్సికల్స్ కోసం పుల్లలను చొప్పించి గడ్డ కట్టేంతవరకు ఫ్రీజ్ చేయండి.

మ్యాంగో బెర్రీ పాప్సికల్స్ రెడీ అయినట్లే, బయటకు తీసి చప్పరించుకుంటూ తింటూ ఆస్వాదించండి.

STRAWBERRY MANGO POPSICLES - Recipe Video

Whats_app_banner

సంబంధిత కథనం