తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chicken Cutlet: చికెన్ కట్లెట్ ఎప్పుడైనా తిన్నారా..? క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉండే ఈ రెసిపీని తయారు చేసుకోవడం చాలా ఈజీ

Chicken Cutlet: చికెన్ కట్లెట్ ఎప్పుడైనా తిన్నారా..? క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉండే ఈ రెసిపీని తయారు చేసుకోవడం చాలా ఈజీ

Ramya Sri Marka HT Telugu

23 December 2024, 15:30 IST

google News
  • Chicken Cutlet: చికెన్ కట్లెట్ చాలా టెంప్టింగ్‌గా, క్రిస్పీగా ఉండి అన్ని వయసుల వారికి నచ్చే వంటకం. ఈ రెసిపీని ట్రై చేసి, మీకు బాగా ఇష్టమైన వారిని ఇంప్రెస్ చేసేయండి. ఇప్పుడు, రుచిగా ఉండే చికెన్ కట్లెట్ తయారీ విధానం చూద్దాం.

చికెన్ కట్లెట్ ఎప్పుడైనా తిన్నారా..? క్రిస్పీగా అండ్ టేస్టీ
చికెన్ కట్లెట్ ఎప్పుడైనా తిన్నారా..? క్రిస్పీగా అండ్ టేస్టీ

చికెన్ కట్లెట్ ఎప్పుడైనా తిన్నారా..? క్రిస్పీగా అండ్ టేస్టీ

అసలు చికెన్ అంటేనే అందరికీ టెంప్టింగ్ ఫుడ్ కదా. అందులో కట్‌లెట్ రూపంలో తినడం అంటే ఇక ఆ ఫీల్ సపరేట్ ఉంటుంది. చికెన్ ను కట్ లెట్ మాదిరిగా షేప్ చేసి పాన్ మీద ఫ్రై చేస్తుంటే, ఓ వైపు వేయించుకున్న కట్‌లెట్‌ను తిప్పగానే గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో కనిపిస్తుందే.. అది.. అది చాలు. అమాంతం తినేయాలని అనిపించడానికి.

కావల్సిన పదార్థాలు:

  • చికెన్ – 500 గ్రాములు (చిన్న ముక్కలుగా కట్ చేయాలి)
  • బంగాళ దుంపలు – 2 (ఉడకబెట్టాలి)
  • నూనె – 2 టేబుల్ స్పూన్లు (పాన్‌లో వేయించడానికి)
  • ఉల్లిపాయ – 1 (తరిగి)
  • అల్లం పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
  • వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
  • పచ్చిమిర్చి – నాలుగు
  • తరిగిన కరివేపాకు – కొన్ని ఆకులు
  • పసుపు – 1/2 టేబుల్ స్పూన్
  • కారం/మిరియాల పొడి – 1 టేబుల్ స్పూన్
  • గరం మసాలా – 1 టేబుల్ స్పూన్
  • ఉప్పు – రుచికి సరిపడా
  • ఎగ్ వైట్ – 1 (బ్రెడ్ క్రంబ్స్ కోసం)
  • బ్రెడ్ క్రంబ్స్ – 1
  • టమాటో కెచప్/పుదీనా-కొత్తిమీర చట్నీ – సర్వ్ చేసేందుకు

చికెన్ కట్లెట్ తయారు చేసే విధానం

బంగాళ దుంపలు ఉడకబెట్టడం:

ఒక గిన్నెలో నీరు పోసి అందులో కొన్ని బంగాళ దుంపలు వేసి ఉడకబెట్టండి. కాసేపటి తర్వాత బంగాళదుంపల తోలు తీసి వాటిని మెత్తటి గుజ్జుగా చేయండి.

చికెన్ ఉడికించడం:

మరోవైపు చికెన్‌ను చిన్న ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడిగి నీరు మొత్తం కిందకు వంచేయండి. ఆ చికెన్ లో కాస్త పసుపు, ఉప్పు, నీళ్లు వేసి ఓ మోస్తారుగా ఉడికేవరకూ కుక్కర్లో ఉడికించండి. ఒక గిన్నె తీసుకుని అందులో చికెన్ వేసి వీలైనంతగా మెత్తగా చేసుకోండి.

మిశ్రమాన్ని కలపడం:

ఇప్పుడు కళాయి తీసుకుని రెండు టీస్పూన్ల నూనె వేసి వేడి చేసుకోండి. తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఒక టేబుల్ స్పూన్ అల్లం, ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి, చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఉప్పు వేసి వేయించండి. నూనె సపరేట్ అయ్యేంత వరకూ అలా చేస్తూ ఉండండి. ఆ తర్వాత కరివేపాకు ఆకులను, పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం లేదా మిరియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేయండి. ఈ మిశ్రమాన్ని పచ్చివాసన పోయేంత వరకూ వేయించండి. అందులో చికెన్ వేసి బాగా కలపండి.

కట్లెట్ బాల్స్ తయారుచేయడం:

అలా చేసిన తర్వాత అందులోకి మెత్తగా చేసుకున్న బంగాళ దుంపలను వేయండి. సన్నని మంటపై ఉంచి అందులో నీరు పోయేంత వరకూ వేడి చేస్తూనే ఉండండి. రుచికి సరిపడ ఉప్పు, కారం వేసుకుని కాసేపటి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆ గుజ్జును తీసుకుని చిన్న చిన్న బాల్స్ మాదిరిగా చేసుకోండి. లేదంటే కావాల్సిన షేప్ లలో తయారుచేసుకోండి.

బ్రెడ్ క్రంబ్స్ లో ముంచడం:

వాటిని బాగా కలుపుకున్న ఎగ్ వైట్ మిశ్రమంలో ముంచి తీయండి. ఆ తర్వాత బ్రెడ్ క్రంబ్స్ (బ్రెడ్ పొడి)ని అంటించండి.

చికెన్ కట్లెట్ వేయించడం:

ఆ పీస్ లను తీసుకుని నూనె వేసిన పాన్ పై ఉంచి వేడి చేయండి. రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకూ వేగనివ్వాలి. అంతే చికెన్ కట్లెట్ రెడీ అయిపోయినట్లే. ఇలా చేసుకున్న వాటిని గిన్నెలోకి తీసుకుని, సర్వ్ చేసేసుకోవచ్చు.

సర్వింగ్:

దీనికి టమాటో కెచప్ గానీ, పుదీనా-కొత్తిమీర చట్నీగానీ అంచుకు పెట్టుకుని తింటే సూపర్బ్ టేస్ట్ చూడొచ్చు. ఈ చికెన్ కట్లెట్ క్రిస్పీగా ఉంటుంది. స్నాక్‌గా లేదా చిరు భోజనంగా ఈ రుచిని ఆనందించవచ్చు.

తదుపరి వ్యాసం