తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాలో ఫెలోషిప్ ఖాళీలు.. దరఖాస్తు చేసుకోండిలా!

బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాలో ఫెలోషిప్ ఖాళీలు.. దరఖాస్తు చేసుకోండిలా!

HT Telugu Desk HT Telugu

03 October 2022, 14:33 IST

  • BSI Recruitment 2022: బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా 33 జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు www.bsijrfrecruitment.com వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్ మోడ్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు

BSI Recruitment 2022
BSI Recruitment 2022

BSI Recruitment 2022

పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా 33 జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

ట్రెండింగ్ వార్తలు

Saturday Motivation: ఏం జరిగినా అంతా మన మంచికే అనే పాజిటివ్ థింకింగ్ పెంచుకోండి, ఎప్పటికైనా మేలే జరుగుతుంది

Buttermilk : వేసవిలో మజ్జిగను ఇలా చేసి తాగితే చర్మం, జుట్టుకు చాలా మంచిది

Iskon khichdi Recipe : కొత్తగా ట్రై చేయండి.. ఇస్కాన్ కిచిడీ రెసిపీ.. చాలా టేస్టీ

Foundation Side effects: ప్రతిరోజూ ముఖానికి ఫౌండేషన్ అప్లై చేస్తున్నారా? ఇలా చేస్తే జరిగేది ఇదే

ఆసక్తి గల అభ్యర్థులు www.bsijrfrecruitment.com వెబ్‌సైట్‌లో ఇచ్చిన లింక్ ద్వారా తమ ఆన్‌లైన్ దరఖాస్తును నమోదు చేసుకోవచ్చు . ఎంపిక చేసిన అభ్యర్థులు ఇటానగర్, షిల్లాంగ్, గాంగ్‌టక్, హౌరా, కోల్‌కతా, అలహాబాద్, నోయిడా, డెహ్రాడూన్, జోధ్‌పూర్, పూణే, హైదరాబాద్, పోర్ట్ బ్లెయిర్, కోయంబత్తూర్, సోలన్‌లలో ఉన్న BSI ప్రాంతీయ కార్యాలయాలు/కేంద్రాలలో పని చేయాల్సి ఉంటుంది.

ఫెలోషిప్ మొత్తం మొదటి రెండు సంవత్సరాలు రూ. 31,000, మూడవ సంవత్సరం నుండి రూ 35,000. అదనంగా, నిబంధనల ప్రకారం ఇంటి అద్దె భత్యం ఇవ్వబడుతుంది.

“జూనియర్ రీసెర్చ్ ఫెలోలకు మొదట 2 సంవత్సరాల పాటు నియమకం ఉంటుంది. మొదటి రెండు సంవత్సరాలలో చేసిన పనిని అంచనా వేసిన తర్వాత సని తీరు బాగుంటే , సీనియర్ రీసెర్చ్ ఫెలోస్‌గా మరో సంవత్సరానికి నియమించబడవచ్చు లేదా పని సంతృప్తికరంగా లేనట్లయితే తొలగించబడవచ్చు. కేటాయించిన పని సంతృప్తికరమైన పనితీరుపై ఆధారపడి SRF మరో 2 సంవత్సరాలు పొడిగించబడుతుంది, ”అని సంస్థ ప్రకటనలో తెలిపింది.

దరఖాస్తును సమర్పించే సమయంలో దరఖాస్తుదారు UGC గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం అందించే బోటనీలో మాస్టర్స్ డిగ్రీలో కనీసం 55% మార్కులను కలిగి ఉండాలి.

ప్లాంట్ టాక్సానమీ లేదా ప్లాంట్-సిస్టమాటిక్స్‌లో MSc డిగ్రీ ఉత్తీర్ణులు & కంప్యూటర్‌లో పని పరిజ్ఞానం ఉన్నవారు అర్హులు. విశ్లేషణాత్మక సామర్థ్యం, టెక్నికల్ రైటింగ్ నైపుణ్యాలు కలిగిన వ్యక్తికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

NET (CSIR-JRF) అర్హత పొందిన అభ్యర్థులకు ఎంపిక పరీక్ష రాయడం నుండి మినహాయింపు ఉంటుంది. వారు ప్రాంతీయ కేంద్రాల ఎంపికకు సంబందించిన ఆన్‌లైన్‌లో ఫారమ్‌ను పూరించాలి. ఎంపిక చేయబడితే ఇంటర్వ్యూకి హాజరు కావాలి.

JRF అవార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి గరిష్ట వయోపరిమితి దరఖాస్తు ఫారమ్ స్వీకరించిన చివరి తేదీ నాటికి 28 సంవత్సరాలు కలిగి ఉండాలి.షెడ్యూల్ కులాలు/షెడ్యూల్ తెగలు/ శారీరక వికలాంగులు, మహిళా దరఖాస్తుదారుల విషయంలో 5 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది. అయితే OBC (నాన్-క్రీమీ లేయర్ అభ్యర్థులు)ల విషయంలో 3 సంవత్సరాలు .

పరీక్ష రుసుము రూ. 400 ( OBC దరఖాస్తుదారులకు రూ. 200, SC/ST/PH దరఖాస్తుదారులకు రూ. 100).

మరిన్ని వివరాల కోసం, దిగువ నోటిఫికేషన్‌ను చూడండి: