Mocktail Recipes । పార్టీ ఏదైనా తగ్గేదేలే.. టాప్ చెఫ్‌లు అందించిన మాక్‌టైల్స్ రెసిపీలు ఇవిగో!
28 December 2022, 20:00 IST
- Mocktail Recipes: నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు రెడీ అవుతున్నారా? మీ పార్టీలో జోష్ నింపేందుకు ఇక్కడ కొన్ని అద్భుతమైన మాక్‌టైల్స్ రెసిపీలు ఉన్నాయి చూడండి.
Mocktail Recipes
నూతన సంవత్సరం రాబోతుంది, మరి మీరు ఇంట్లోనే న్యూ ఇయర్ పార్టీ హోస్ట్ చేస్తుంటే మంచి డిన్నర్‌తో పాటు డ్రింక్స్ లేకపోతే అసలు పార్టీలో కిక్ ఉండదు. మరి మీ ఇంటికి పార్టీ కోసం వచ్చే అతిథులకు అవే బోరింగ్ ఫిజీ బాటిల్ డ్రింక్స్ అందించడం వలన వారు సంతృప్తి చెందరు. వారికి అద్భుతమైన మాక్‌టైల్స్ ఫ్లేవర్లను రుచి చూపించండి. ఢిల్లీలోని టాప్ చెఫ్‌లు ప్రత్యేకంగా రూపొందించిన కొన్ని పాపులర్ మాక్‌టైల్స్ వెరైటీలను, వాటి రెసిపీలను (Mocktail Recipes ) ఇక్కడ అందిస్తున్నాం. ఈ మాక్‌టైల్స్‌ను మీరు కూడా చాలా సులభంగా నిమిషాలలోనే సిద్ధం చేసుకోవచ్చు. వీటిని ఒక్కసారి రుచికి మీరు కాక్‌టైల్స్ వద్దని, ఈ మాక్‌టైల్స్ తాగటానికే ఇష్టపడతారు.
చాలా మంది న్యూ ఇయర్ అనగానే బీర్, విస్కీ, రమ్ అంటూ ఆల్కాహాల్ డ్రింక్స్ తాగటానికే ఇష్టపడతారు. ఆ తర్వాత ఉదయం హ్యాంగోవర్‌తో ఇబ్బందిపడతారు. అలాంటి డ్రింక్స్‌తో అనారోగ్యాన్ని కొనితెచ్చుకునే బదులు ఈ మాక్‌టైల్స్‌తో మీ పార్టీకి ఊపు తీసుకురండి. మరి ఈ మాక్‌టైల్స్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ రెసిపీలు ఉన్నాయి చూడండి.
Love Heist Mocktail Recipe
కావలసినవి:
- లిచీ జ్యూస్ 60ml
- దానిమ్మ రసం 60ml
- లైన్ జ్యూస్ 5ml
- షుగర్ సిరప్ 5ml
- Ice 100gms
- దానిమ్మ గింజలు 10 grams
లవ్ హీస్ట్ మాక్‌టైల్ తయారీ విధానం
- ముందుగా ఒక షేకర్ తీసుకొని దానిమ్మ రసం, గింజలను వేసి చక్కగా షేక్ చేయండి.
- ఇప్పుడు ఐస్ వేయండి, లిచీ జ్యూస్, లైమ్ జ్యూస్, షుగర్ సిరప్ వేసి బాగా షేక్ చేయండి.
- ఆపై ఒక గ్లాసులోకి డ్రింక్ పోసి, నిమ్మకాయ ముక్కలు, పండ్లతో అలంకరించండి.
Date Me Mocktail Recipe
కావలసినవి:
- 60ml క్రాన్‌బెర్రీ జ్యూస్
- 60ml ఆరెంజ్ జ్యూస్
- 4/5 కాఫీర్ లైమ్
- 10ml రోజ్ సిరప్
- 15ml నిమ్మరసం
- 1 గుడ్డు తెల్లసొన (ఐచ్ఛికం)
డేట్ మి మాక్‌టైల్ తయారీ విధానం
- అన్ని వేసి షేక్ చేయండి.
- ఒక గ్లాసులోకి తీసుకొని రోజ్ పెటల్స్ తో గార్నిష్ చేయండి.
Vanilla Valentine spritz Recipe
కావలసినవి:
- గ్రెనడిన్ సిరప్ - 10ml
- వెనీలా ఎసెన్స్ - 15ml
- సోడా - 150ml
వెనీలా వాలెంటైన్ స్ప్రిట్జ్ తయారీ విధానం
ఒక షాంపైన్ తులిప్ గ్లాస్ తీసుకోండి.
ముందుగా ఆ గ్లాస్‌లో గ్రెనడిన్ సిరప్ పోసి, ఆపైన వెనీలా ఎసెన్స్ వేయండి.
వెంటనే సోడా పోసి, మరాసెహినో చెర్రీతో అలంకరించండి.