Toilet Flush : టాయిలెట్ మూత తెరిచే నీటిని ఫ్లష్ చేస్తున్నారా.. జాగ్రత్త
24 February 2023, 13:00 IST
- Toilet Flush ఇప్పుడంతా వెస్ట్రన్ స్టైల్ టాయిలెట్ అయిపోయింది. మారుతున్న జీవనశైలికి అనుగుణంగా మార్పులు వస్తున్నాయి. అయితే టాయిలెట్ వెళ్లాక నీటిని వదిలి విదానం ఆధారంగా కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయని మీకు తెలుసా?
టాయిలెట్
గతంలో ఇళ్లలో మారుగుదొడ్లు లేవు. బయటకే వెళ్లేవారు. కానీ కాలం మారుతూ వస్తోంది. మెుదట ఇండియన్ స్టైల్ టాయిలెట్స్(Toilets) వచ్చాయి. ఆ తర్వాత వెస్ట్రన్ స్టైల్ టాయిలెట్స్(western style toilet) అందుబాటులోకి వచ్చాయి. ఎక్కువగా వీటినే ఉపయోగిస్తున్నారు. చాలా మంది ఇళ్లలో ఈ తరహా టాయిలెట్స్ ఉన్నాయి. అయితే ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో.. టాయిలెట్ ను కూడా శుభ్రంగా ఉంచాలి. లేదంటే.. అనారోగ్యాలకు(Health Problems) కారణం అవుతుంది. బ్యాక్టీరియా, వైరస్, ఇతర క్రిమలు ఇంట్లో వచ్చే అవకాశం ఉంది. చిన్న పిల్లలు, పెద్దలు ఉన్నా.. వెంటనే దీని ద్వారా సమస్యలు వస్తాయి. అందుకే టాయిలెట్ ను శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం.
వెస్టర్న్ టాయిలెట్ ను ఉపయోగించేవారు.. సాధారణంగా టాయిలెట్ పూర్తయ్యాక మూతను తెరిచే ఫ్లష్(Flush) చేస్తుంటారు. దాదాపు చాలా మంది ఇదే పని చేస్తారు. జస్ట్ ఒక్క బటన్ నొక్కితే చాలు అనుకుంటారు. కానీ ఇలా చేయడం మంచిది కాదు. మీరు ఫ్లష్ చేయగానే.. పెద్ద ఎత్తున నీళ్లు తిరుగుతూ.. టాయిలెట్ లోకి పోతాయి. అక్కడ ఉన్న మలంతో కలిసి అవి కిందకు వెళ్తాయి. చూసేందుకు ఓకే క్లీన్ అనుకుంటారు. కానీ ఇక్కడే అసలు సమస్య.
మీరు టాయిలెట్ ఫ్లష్(Toilet Flush) ఉపయోగించినప్పుడు.. నీళ్లపై పడే ఒత్తిడి కారణంగా ఆ నీటిలో నుంచి సన్నని తేమ కణాలు గాలిలోకి పైకి లేస్తాయి. వాటిలో మలం కూడా కలిసే ఉంటుంది. వీటిని ఎరోసోల్ కణాలు అంటారు. దాదాపు 15 అడుగుల ఎత్తు వరకూ వెళ్తాయి. అంటే టాయిలెట్ గది మెుత్తం వ్యాపిస్తాయన్నమాట. టాయిలెట్ సీట్ కు మూత పెట్టకుండా ఫ్లష్ చేస్తే ఇంత పెద్ద సమస్య వస్తుంది. కణాలు పైకి వస్తాయి.
అలా లేచిన కణాలు.. టాయిలెట్(Toilet) నిండా వ్యాపిస్తాయి. అంతేకాదు.. టాయిలెట్ డోర్ కూడా సరిగా వేయరు. అందులో నుంచి ఇంట్లోకి కూడా కణాలు వస్తాయి. గాలిలోనే ఎక్కువగా ఉంటాయి. ఈ కారణంగా వ్యాధులను వస్తాయి.
అందుకోసమే.. టాయిలెట్ సీట్ కు ఉండే మూత పెట్టిన తర్వాత.. ఫ్లష్ చేయాలి. ఇలా చేస్తే.. కణాలు పైకి రాకుండా ఉంటాయి. బాక్టీరియా, వైరస్, క్రిములు ఇంటిలోకి వ్యాపించే ఆస్కారం ఉండదు. అనారోగ్య సమస్యల నుంచి దురంగా ఉండొచ్చు. వెస్ట్రన్ టాయిలెట్ లో ఫ్లష్ చేసేప్పుడు తప్పనిసరిగా మూత పెట్టండి. అవసరం అయితేనే మూత తీయాలి. మూత తెరిచే ఉంచడం కూడా కరెక్టు కాదు.
టాపిక్