టాయిలెట్‌కు వెళ్లిన 5వ తరగతి బాలికపై అత్యాచారం!
ఎప్పటిలాగే ఆ బాలిక స్కూలుకు వెళ్లింది. కానీ ఆ రోజు.. జీవితంలో మర్చిపోలేని సంఘటన ఎదురైంది. టాయిలెట్ కోసం స్కూలు వెనక్కి వెళ్లిన ఆమెను ఓ 50ఏళ్ల వ్యక్తి వెంబడించాడు. ఆమెను తీసుకుని ఎవరూ లేని ప్రదేశానికి వెళ్లాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది.
Madhya Pradesh crime news | మధ్యప్రదేశ్‌లో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. స్కూల్లో టాయిలెట్‌కు వెళ్లిన ఓ 10ఏళ్ల బాలిక అత్యాచారానికి గురైంది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
నిందితుడు 50ఏళ్ల వ్యక్తి..!
ఛతర్పూర్ జిల్లాలోని హర్పల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఈ ఘటన జరిగింది. 5వ తరగతి చదువుతున్న బాలిక.. ఎప్పటిలాగే సోమవారం కూడా స్కూలుకు వెళ్లింది. క్లాసులు ముగిసిన తర్వాత.. టాయిలెట్ కోసం పాఠశాల వెనక్కి వెళ్లింది.
ఇంతలో ఓ 50ఏళ్ల వ్యక్తి.. ఆ బాలికను బలవంతం పెట్టి ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లాడు. చిన్న పిల్ల అన్న ఆలోచనే లేకుండా, ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
బాలిక అరుపులు, ఏడుపులతో స్థానికులు ఘటనాస్థలానికి పరిగెత్తుకుంటూ వెళ్లారు. అప్పటికి ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయినట్టు తెలుస్తోంది. పరిస్థితిని అర్థం చేసుకున్న గ్రామస్థులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాలికను ఆసుపత్రికి తరలించి.. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. చివరికి ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో..
ఉత్తర్‌ప్రదేశ్ ముజాఫర్‌నగర్‌లో.. ఓ మహిళ అత్యాచారానికి గురైంది. బండి మీద లిఫ్ట్ ఇస్తానని చెప్పిన యువకుడు.. ఆమెను పుర్కాజీ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఈ ఘటనపై.. బాధితురాలి భర్త.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు అహ్మద్‌ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.
సంబంధిత కథనం