తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  బెలూన్లు అమ్ముకునే యువతి మోడల్‌గా మారింది.. కథేంటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

బెలూన్లు అమ్ముకునే యువతి మోడల్‌గా మారింది.. కథేంటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

10 March 2022, 11:55 IST

    • వీధుల్లో బెలూన్లు అమ్ముకునే ఓ యువతి.. ఏకంగా మోడల్‌గా మారిపోయింది. ఇప్పుడు ఆ యువతి  ఫ్యాషన్ ప్రపంచానికి ట్రెండీగా నిలిచింది. ఇంతకి ఆ అమ్మాయి కథేంటో చూద్దమా
Balloon Seller From Kerala Turns Model
Balloon Seller From Kerala Turns Model

Balloon Seller From Kerala Turns Model

డిజిటల్ ప్రపంచంలో టాలెంట్‌కు కొదవ లేదు. సోషల్‌ మీడియా వేదికగా ఎంతోమంది స్టార్లుగా మారుతున్నారు. ఓవర్‌ నైట్‌లో సెలబ్రెటీలుగా మారిపోన్నారు. అలా కేరళకు చెందిన ఓ యువతి ఏకంగా మోడల్‌గా మారిపోయింది. వీధుల్లో బుడగలు అమ్ముకునే ఈ యువతి ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలో ట్రెండీగా నిలిచింది. ఇంతకి ఆ అమ్మాయి కథేంటో చూద్దమా

కేరళకు చెందిన కిస్బూ అనే పేద అమ్మాయి వీధుల్లో బెలూన్లు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తోంది. ఇలా తన దైనందిన జీవితంలో భాగంగా ఓ రోజు బెలూన్లు విక్రయిస్తున్న సమయంలో ఫొటోగ్రాఫర్‌ అర్జున్‌ కృష్ణన్‌ కన్ను ఆమెపై పడింది. ఆ అమ్మాయిలో ఏదో సంథింగ్ స్పెషల్ ఉందని భావించిన అర్జున్‌ కొన్ని ఫొటోలు తీశాడు. వాటిని ఇస్టాగ్రామ్‌ వేదికగా షేర్ చేశాడు. అవి కాస్త వైరల్ కావడంతో ఆ అమ్మాయికి విపరితమైన క్రేజీ వచ్చింది.

తర్వాత కిస్బూ కుటుంబాన్ని కలిసిన అర్జున్‌ కృష్ణన్‌.. వారిని ఒప్పించి ఆ ఆమ్మాయితో ఓ స్పెషల్ ఫోటోషూట్‌ చేశాడు. ఈ షూట్‌లో ఆ అమ్మాయి సంప్రదాయ దుస్తులు, బంగారు ఆభరణాలతో అందంగా కనిపించింది. దీంతో ఆ యువతికి మరింత పాపులారీటి వచ్చింది. లక్షల మంది ఆ ఫోటోలను వీక్షించారు. ఆమెకు విపరితమైన క్రేజీ రావడంతో ప్రముఖ కంపెనీలు ఆ యువతిని మోడల్‌గా తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి.

చూశారా ప్రతి ఒక్కరికి ఓ రోజు వస్తుందంటారు. వీధుల్లో బెలూన్లు అమ్ముకునే అమ్మాయి అర్జున్‌ కంట పడడమేంటీ.. ఇప్పుడు మోడల్‌గా మారడమేంటి.. అంతా కలగా ఉంది కదూ.