8 Hours Sleep : అలారం.. సిగరేట్ లాంటిది.. 8 గంటల నిద్ర అనేది సొల్లు ముచ్చట!
10 February 2023, 13:34 IST
- 8 Hours Sleep Problems : హాయిగా 8 గంటలు నిద్రపోతే ఎలాంటి సమస్యలు రావు. ఎవరైనా చెప్పేది ఇదే. కానీ 8 గంటల నిద్ర, అలారం పెట్టుకుని లేవడం అనేవి కూడా ప్రమాదకరమేనట. సరిగా పడుకుని.. లేస్తే.. చాలు 8 గంటలు అనే నియమం ఎందులో లేదని చెబుతున్నారు.
నిద్ర సమస్యలు
అలారం గడియారాలు సిగరెట్(Cigarette) లాగా హానికరమైన అలవాటు. అవి మిమ్మల్ని వేరే వాటి మీద ఆధారపడేలా చేస్తాయి. అంటే ప్రశాంతమైన నిద్రను దూరం చేస్తాయి. శరీరం బాగా విశ్రాంతి తీసుకున్నప్పుడు దానంతట అదే మేల్కొంటుంది. ఈ విశ్రాంతి సమయం ఎనిమిది గంటలు ఉండవలసిన అవసరం లేదు.
ఏ సిద్ధాంతమూ నిద్రను లెక్కించదు. ప్రశాంతమైన విశ్రాంతి సమయం ఉంటే మనిషి శరీరం పనిచేయడానికి రెండున్నర నుంచి మూడు గంటల నిద్ర కూడా సరిపోతాయని ఆయుర్వేదం చెబుతోందని.. డాక్టర్ మేధా గుప్తా అంటున్నారు. మీరు నిద్ర(Sleep)ను లెక్కించొద్దని చెబుతున్నారు. రోజంతా మనల్ని యాక్టివ్ గా ఉండేలా చేసేది శరీరానికి విశ్రాంతి. మీరు అలారం(Alaram) పెట్టుకుని నిద్ర భంగం చేస్తున్నారంటే.. శరీరానికి తృప్తి ఎక్కడిది అని కొంతమంది మాట. అలా కొన్ని విషయాలు చెప్పారు మేదా గుప్తా.
మీ శరీరాన్ని గడియారంతో గజిబిజి చేయవద్దు. మనందరికీ స్లీప్-మేల్ సైకిల్, సిర్కాడియన్ రిథమ్ ఉంటుంది. ఇది అన్ని శరీర కార్యకలాపాలను ప్రభావితం చేస్తుంది. ఇది సూర్యోదయం, సూర్యాస్తమయం, నిద్ర ద్వారా బాగా ప్రభావితమవుతుంది.
మీరు కరెక్టుగా ఎనిమిది గంటలు లేదా తొమ్మిది గంటలు అని అలారం పెట్టుకుని నిద్రపోవడం కూడా సమస్యనేట. మిమ్మల్ని మీరు నిద్ర నంచి బయటకు బలవంతంగా తీసుకురావడం మంచిది కాదు. మీ స్లీపింగ్ సైకిల్(Sleeping Cycle).. అనేది నాశనం అవుతుందట. దీర్ఘకాలం పాటు క్రమశిక్షణ లేని నిద్ర సమయం క్యాన్సర్(Cancer)కు కూడా దారితీస్తుందట. శరీరానికి అవసరమైన విశ్రాంతి దొరికితే.. ఆటోమేటిక్ గా మెళుకువ వస్తుంది. అదే అలారం పెట్టుకుని.. నిద్ర లేస్తే.. సమస్యలు వస్తాయట. మీరు సరైన నిద్రవేళను పాటిస్తే సరిపోతుంది. కొంతమంది రాత్రి 11 గంటలకు పడుకున్నా.. ఉదయం 3, 4 గంటలకే లేస్తారు.
ఆహారపు అలవాట్లు నిద్ర సంపూర్ణతను ప్రభావితం చేస్తాయి. సరిగ్గా, సరైన సమయంలో తినండి. లేట్ డిన్నర్లు(Late Dinner) చేస్తే జీర్ణం కావడానికి గంటల సమయం పడుతుంది. శరీర కణాలు విశ్రాంతి మోడ్‌కు రావాలంటే.. రాత్రి భోజనం చాలా ముఖ్యం. దాన్ని సరైన సమయంలో తీసుకోవాలి.
రాత్రిపూట కెఫిన్, కొవ్వులు, సుగంధ ద్రవ్యాలు, చక్కెర(Sugar) అన్నీ జీర్ణవ్యవస్థను ఉత్తేజపరుస్తాయి. ఆహార శోషణ శరీర వేడి, శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది మెదడు, కండరాలను ప్రేరేపిస్తుంది. ఇవన్నీ మిమ్మల్ని మరింత మేల్కొల్పుతుంది.
నేటి ప్రపంచంలోని అతి పెద్ద సమస్య.. నిద్రవేళలో గాడ్జెట్(Gadget)లు పట్టుకోవడం. మనం దాని గురించి నిత్యం చదువుతూనే ఉంటాం. కానీ ప్రతిరోజూ ఈ చిన్న ఆనందానికి లొంగిపోతాం. Instagram స్క్రోల్ లేదా మెయిల్ చెక్ అవసరం లేదు కావొచ్చు. కానీ అర్ధరాత్రి దాటినా.. చూస్తారు. ఆ తర్వాత మీరు 10 గంటలు నిద్రపోతూ ఉండవచ్చు. ఎప్పుడైనా గమనించారా.. అంతసేపు పడుకున్నా.. ఏదో సమస్యలాగానే అనిపిస్తుంది.
కనీసం 30 నిమిషాలు వ్యాయామం(exercise) చేసేవారికి రాత్రి నిద్ర నాణ్యత మారవచ్చు. వర్కవుట్‌ల సమయంలో కోల్పోయిన శక్తిని తిరిగి నింపడానికి శరీరం విశ్రాంతి తీసుకుంటుంది. ప్రశాంతంగా నిద్రపోవడం మళ్లీ ఉదయం వ్యాయామం చేసేందుకు హాయిగా ఉంటుంది.
సరైన నిద్ర లేకపోవడం మిమ్మల్ని చికాకుగా, కోపంగా మారుస్తుంది. కోపం, తగాదాలు, పరిష్కరించని వాదనలు మిమ్మల్ని అశాంతికి గురిచేస్తాయి. దుఃఖం, ప్రతికూల ఆలోచనలు నిద్రను దూరం చేస్తాయి. నిద్రవేళకు ముందు మీరు కుటుంబం, స్నేహితులతో సమస్యలను పరిష్కరించుకోవడం ముఖ్యం. నిద్రవేళకు ముందు ధ్యానం, శ్వాస వ్యాయామాలు, సంగీతాన్ని కాసేపు వినడం అలవాటు చేసుకోండి.
సరిగా నిద్రపోతే.. 5, 6 గంటలు కూడా సరిపోతుదంట. ఒక్కసారి మన అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలను గుర్తు చేసుకోండి. వాళ్లు పడుకునే టైమింగ్ ఎప్పుడు ఉన్నా.. ఉదయం 4 గంటలకే లేచేవారు. అయితే నిద్ర అనేది ప్రశాంతగా పోవాలి. అలారం(Alaram) లాంటి వాటితో నిద్రను చెడగొట్టకూడదు. బయోలాజికల్ క్లాక్ అలవాటు చేసుకోవాలి. గాఢ నిద్రలో ఉన్నప్పుడు అలారం మోగితే.. ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణుల మాట. మనసు సరిగా లేకుండా.. మీరు 8 గంటలు పడుకున్నా ఏం లాభం. రోజంతా మంచం మీద ఉంటారు అంతే. మీరు ప్రశాంతంగా లేకుండా ఎన్ని గంటలు పడుకున్నా.. నిద్రలేమి, స్లీప్ అప్నియా, హైపర్ టెన్షన్ మొదలైన వ్యాధులకు దారి తీస్తుందట. మీరు ఏ టైమ్ కు పడుకున్నా.. ప్రశాంతమైన నిద్ర.. మిమ్మల్ని ఆటోమేటిక్ గా ఉదయం లేపుతుంది. కావాల్సింది శరీరానికి సరైన విశ్రాంతి.