తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  5 Ways To Improve Your Focus: వర్క్‌పై ఫోకస్ పెరిగేందుకు ఈ టెక్నిక్ తెలుసుకోండి

5 ways to improve your focus: వర్క్‌పై ఫోకస్ పెరిగేందుకు ఈ టెక్నిక్ తెలుసుకోండి

HT Telugu Desk HT Telugu

17 January 2023, 9:25 IST

    • 5 ways to improve your focus: వర్క్‌పై ఫోకస్ పెరిగేందుకు పోమోడోరో టెక్నిక్ అని ఇటీవల బాగా ప్రాచుర్యం పొందింది. దీనిని అనుసరిస్తే మీరు ఎప్పుడూ ఫ్రెష్‌గా ఉంటారు.
పోమోడోరో టెక్నిక్‌తోొ వర్క్‌ లో ఒత్తిడి తగ్గుతుంది
పోమోడోరో టెక్నిక్‌తోొ వర్క్‌ లో ఒత్తిడి తగ్గుతుంది (Pxabay)

పోమోడోరో టెక్నిక్‌తోొ వర్క్‌ లో ఒత్తిడి తగ్గుతుంది

వర్క్‌పై ఏకాగ్రత మెరుగుపరుచుకోవడం వల్ల మీ ఉత్పాదకత పెరగడమే కాకుండా, సమయం సద్వినియోగం అవుతుంది. ఈ ఆధునిక ప్రపంచంలో మెయిల్స్, మెసేజెస్ వంటి వాటితో వర్క్‌ నుంచి దృష్టి మరలుతుంది. దీంతో మీ పనికి విఘాతం కలుగుతుంది. పనిపై దృష్టి నిలిపి మన ముందున్న టాస్క్ పూర్తిచేయగలిగితే ఒత్తిడి కూడా తగ్గుతుంది. సమయానికి మన పని పూర్తయితే ఒత్తిడి మాయం అవడం మీరు ఇదివరకు గమనించే ఉంటారు.

ఈ మధ్య ఒక ప్రొడక్టివిటీ హాక్ (ఉత్పాదకత కోసం చిట్కా) ప్రాచుర్యం పొందింది. దీనినే పోమోడోరో టెక్నిక్ అని పిలుస్తారు. పొమోడోరో అంటే ఇటలీలో టమోట అని అర్థం. దీనిని ఫ్రాన్సెస్కో సిరిలో అనే యూనివర్శిటీ విద్యార్థి రూపకల్పన చేశారు. తన చదువులో ఫోకస్ పెంచేందుకు ఈ టెక్నిక్ అనుసరించాడు. 10 నిమిషాల పాటు ఏకాగ్రత నిలిపేందుకు టమోటా ఆకృతిలో ఒక కిచెన్ టైమర్ పెట్టుకున్నాడు. ఈ టెక్నిక్‌పై ఆ విద్యార్థి ఏకంగా ఓ పుస్తకమే రాశాడు. ఈ టెక్నిక్ ఐడియా ఏంటంటే ఒక క్లిష్టమైన టాస్క్‌ను చిన్నచిన్న టాస్క్‌లుగా విడగొట్టడమే. చిన్నచిన్న విరామాలతో అలసట లేకుండా చేసుకోవడమే ఈ పోమోడోరో టెక్నిక్.

బ్రేక్ ఎలా తీసుకోవాలి?

ఈ విధానంలో మనకు మన టైమ్ ఎలా సద్వినియోగం చేసుకోవాలో అవగాహన ఉంటుంది. టైమ్ మనల్ని యూజ్ చేసుకోకుండా, మనం టైమ్‌ను సమర్థవంతంగా యూజ్ చేసుకోవడమే ఈ టెక్నిక్‌లో ముఖ్యమైన పాయింట్. అంటే ఏ దశలోనూ విసుగురాకుండా ఉంటుంది. సాధారణంగా విసుగు వచ్చే సమయంలో బ్రేక్ తీసుకుంటే అపరాధ భావనతో మీకు రిలాక్సేషన్ కూడా ఉండదు. ఇది నిజమైన విశ్రాంతి అనిపించుకోదు. పైగా మీరు విసుగొచ్చినప్పుడు తీసుకునే బ్రేక్‌లో విశ్రాంతి లభించకపోవడమే కాకుండా అపరాధ భావనలో ఏదో ఒక పని పెట్టకుంటారు. ఇన్‌స్టాగ్రామ్ స్క్రోల్ చేయడమో, అమెజాన్‌‌లో షాపింగ్ చేయడమో చేస్తుంటారు. బ్రేక్ తీసుకోవడమే ఒక తప్పుగా భావించి ఇలా టైమ్ యుటిలైజ్ చేసుకుంటున్నట్టగా భావిస్తారు. ఇవేవీ మీకు నిజమైన విశ్రాంతినివ్వవు..’ అని సైకాలజిస్ట్ డాక్టర్ జెన్ ఆండర్స్ వివరించారు.

పనిలో ఫోకస్ పెంచేందుకు తీసుకోవలిసిన చర్యలు ఇవే

పోమోడోరో టెక్నిక్ ఎలా అప్లై చేయాలో సైకాలజిస్టస్ డాక్టర్ జెన్ ఆండర్స్ వివరించారు.

Step 1: ఒక టాస్క్ ఎంచుకోండి

ఒక సమయంలో ఒకే టాస్క్‌పై దృష్టి నిలపడం చాలా ముఖ్యం. మీ పనిస్థలంలో ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా అంతా క్లియర్ చేసుకోండి.

Step 2: 25 నిమిషాల టైమ్ సెట్ చేసుకోండి

25 నిమిషాల టైమ్ కేటాయించుకోవడం చాలా ముఖ్యం. దీనిని మీరు 55 నిమిషాల వరకు కూడా పెంచుకోవచ్చు.

Step 3: టైమర్ అనుసరించండి

ఒకసారి టైమ్ సెట్ చేసుకున్నాక మీరు కేటాయించుకున్న టైమ్ పూర్తయ్యే వరకు దానిని అనుసరించండి. అంటే మీ వర్క్ కొనసాగించండి.

Step 4: బ్రేక్ 5 నిమిషాలు తీసుకోండి

టైమర్ పూర్తయ్యాక 5 నిమిషాల బ్రేక్ తీసుకోండి. 5 నిమిషాలు మరీ తక్కువనిపిస్తే 10 నుంచి 20 నిమిషాలు తీసుకోండి. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే మనం పనికి, బ్రేక్‌కి టైమ్ కేటాయించుకుంటున్నాం.

Step 5: ఎక్కువ సేపు విశ్రాంతి

ప్రతి 4 సైకిల్స్ మధ్య 30 నిమిషాల బ్రేక్ తీసుకోండి. చదవడం, నడక, సంగీతం వినడం, స్నాక్స్ తీసుకోవడం, స్నేహితుడికి లేదా పేరెంట్స్‌కు కాల్ చేయడం వంటివి చేయొచ్చు.

ఎందుకింత ముఖ్యం?

సమయం కేటాయించుకోవడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. మానసిక ప్రశాంతత సమకూరుతుంది. అపరాధ భావన లేకుండా బ్రేక్స్ తీసుకునేందుకు అవకాశం చిక్కుతుంది. ముఖ్యమైన పనులు ఎంచుకొని సమయం కేటాయించుకోవడం వల్ల మీరు ఆ రోజంతా, రోజు పూర్తయ్యాక కూడా ఫ్రెష్‌గా ఉంటారు.

టాపిక్