తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Active Lifestyle | శారీరక శ్రమ చేసేందుకు శ్రమ పడకండి..ఆడుతూపాడుతూ ఇలా చేసేయండి!

Active Lifestyle | శారీరక శ్రమ చేసేందుకు శ్రమ పడకండి..ఆడుతూపాడుతూ ఇలా చేసేయండి!

HT Telugu Desk HT Telugu

06 May 2023, 9:39 IST

    • Active Lifestyle Tips: శారీరక శ్రమ చేసేందుకు శ్రమ పడకండి, ఆడుతూ పాడుతూ మీ శరీరాన్ని కదిలించడానికి ఇక్కడ కొన్ని మార్గాలను చూడండి.
Fun Ways To be active
Fun Ways To be active (Unsplash)

Fun Ways To be active

Active Lifestyle Tips: ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం కొంత శారీరక శ్రమ కలిగి ఉండటం ముఖ్యమైన అంశాలలో ఒకటి. మీరు ఆరోగ్యంగా, మంచి శరీరాకృతితో, స్పష్టమైన మానసిక స్థితితో ఉండాలంటే ప్రతిరోజూ చురుకుగా వివిధ పనులు చేసుకోవాలి. కానీ రోజూ ఉండే తీవ్రమైన బిజీ షెడ్యూల్ కారణంగా చాలా మందికి సమయం అనేది అస్సలు చిక్కకపోవచ్చు. లేదా ఇప్పటికే ఎక్కువైన శారీరక శ్రమతో అలసిపోవచ్చు. ఈ రకంగా మీరు శారీరక శ్రమ చేసినప్పటికీ అది అనుకున్న ఫలితాలను ఇవ్వదు. ఎందుకంటే మీరు ఈ పనులను శ్రమగా భావిస్తే, ఇష్టంగా చేయలేరు. అనాసక్తితో చేసే పనులకు అలసట ఎక్కువ ఉంటుంది. మానసికంగానూ అలసిపోతారు.

ట్రెండింగ్ వార్తలు

Munagaku Kothimeera Pachadi: మునగాకు కొత్తిమీర పచ్చడి ఇలా చేశారంటే రెట్టింపు ఆరోగ్యం

Personality Test: ఇక్కడ ఇచ్చిన చిత్రంలో మీకు మొదట ఏ జంతువు కనిపించిందో చెప్పండి, మీరు ఎలాంటి వారో మేము చెప్పేస్తాం

White Bed Sheets In Railway : రైలు స్లీపర్ కోచ్‌లలో తెల్లని బెడ్‌షీట్‌లనే ఎందుకు ఇస్తారు..

Chanakya Niti Telugu : ఇలాంటివారు జీవితాంతం దు:ఖంలోనే ఉంటారు మరి

శారీరక శ్రమ చేసేందుకు శ్రమ పడకండి, ఎందుకంటే ఇది మీ ఆరోగ్యానికి సంబంధించింది. ఆడుతూ పాడుతూ పనులు చేసుకోవడం వలన అలసట అనేది ఉండదు. ఆడవారైనా, మగవారైనా ఇంట్లో తమ రోజూవారి పనులను ఇష్టంతో చేసుకుంటూ కష్టపడండి. మీరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు.

Fun Ways To Stay Active At Home

ఆడుతూ పాడుతూ మీ శరీరాన్ని కదిలించడానికి ఇక్కడ కొన్ని మార్గాలను చూడండి.

పోడ్‌కాస్ట్ వింటూ ఇంటి పనులు చేయండి

మీకు నచ్చిన లేదా ఏవైనా ఆసక్తికరమైన కథనాలు వింటూ ఇంటి పనులు చేసుకుంటూ ఉండండి. ఇంటి పనులు కూడా మీకు సరిపోయే వ్యాయామాన్ని అందిస్తాయి. ఇల్లు శుభ్రపరచటం కానీయండి, దుమ్ము దులపడం, పాత్రలు కడగటం, చెట్లకు నీరు పోయడం ఇలా మీ రోజూవారి ఇంటిపనులను చేసేయండి. ఇప్పుడు ఎన్నో రకాల ఆడియో కథనాలను అందించే యాప్స్, ఎఫ్ ఎం రేడియోలు అందుబాటులో ఉన్నాయి. ఇంటిని ఎలా శుభ్రపరచాలో టిప్స్ కూడా ఉంటాయి. మీరు జనరల్ నాలెడ్జ్, కరెంట్ ఎఫైర్స్ కూడా వినొచ్చు. ఇంటి పనులు చేయడం మీకు ఇష్టం అయితే ఏవీ వినాల్సిన అవసరం లేదు.

టీవీ చూస్తూ వ్యాయామాలు చేయండి

వ్యాయామాలు చేయడం అంటే అదొక శ్రమగా అనిపిస్తుంది. టీవీలో మీకు నచ్చిన సిరీస్ చూస్తూ కొన్ని రెగ్యులర్ వ్యాయామాలు చేయవచ్చు. లేదా కొత్తకొత్త వ్యాయామ రకాలను టీవీలో చూస్తూ వాటిని అనుసరించవచ్చు. ఈ రకంగా వ్యాయామాలు చేయడం ద్వారా మీకు శ్రమగా అనిపించదు, ఆసక్తి మరింత పెరుగుతుంది.

వీలైనప్పుడల్లా నడవండి

ఈరోజుల్లో చాలా మంది నడవడం అనేది మర్చిపోతున్నారు. ఇంటి నుంచి కాలు బయటపెడుతున్నారంటే వాహనం తీస్తారు. మళ్లీ ఆ వాహనంలోనే ఇంట్లో అడుగుపెడతారు. వాహనంకు బదులుగా నడవండి, లిఫ్టుకు బదులుగా మెట్లు ఎక్కడం దిగటం అలవాటు చేసుకోండి. నడక మీకు చాలా ప్రయోజనాలను అందిస్తుంది. ఒకవేళ ఎక్కువ దూరం వెళ్లాల్సివస్తే సైక్లింగ్ చేయడం ఎంచుకోండి.వీలైనప్పుడల్లా నడవండి.

యోగా సాధన చేయండి

యోగా అనేది అలసిన మీ శరీరానికి విశ్రాంతిని అందిస్తుంది. మీ కండరాలను సాగదీస్తుంది. మీకు ఒత్తిడి, ఆందోళన, ఒళ్లు నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా మీ శరీర ఫ్లెక్సిబిలిటీని కూడా పెంచుతుంది. యోగా అనేది అత్యంత ప్రశాంతమైన చర్య, ఇది మనస్సును శాంతింపజేస్తుంది, శరీరానికి శక్తినిస్తుంది.

డాన్స్ క్లాసులలో చేరండి

నృత్యం అనేది ఒక కళ కావచ్చు, కానీ అన్నింటికంటే ఇది గొప్ప వ్యాయామం. మీరు చురుకుగా, ఆరోగ్యంగా ఉండటానికి డ్యాన్స్ అనేది ఒక వినోదభరితమైన శారీరక శ్రమ. ప్రతిరోజూ డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడం వలన మీ శరీరం ఫిట్ గా మారుతుంది, మీ మనసు ఉల్లాసంగా ఉంటుంది. డ్యాన్స్ క్లాసులో చేరటానికి ప్రయత్నించండి.

తదుపరి వ్యాసం