Dance Your Way To Fitness | సరదాగా సాగిపోయే వ్యాయామమే డ్యాన్స్.. నాటునాటుగా ఆడండి!
World Dance Day 2023: డ్యాన్స్ చేయడం వలన అనేక శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు, అవి ఎలాంటివో ఇక్కడ చూడండి.
World Dance Day 2023: ప్రతిరోజూ వ్యాయామాలు చేస్తే ఆరోగ్యం బాగుటుందని మనందరికీ తెలుసు. కానీ వ్యాయామాలు చేయాలనే ఆలోచన ఉన్నా, ఆసక్తి ఉండదు. ఎందుకంటే వ్యాయామాలలో వినోదం ఉండదు, శ్రమ, చెమట, విసుగు మాత్రమే ఉంటాయి. మీకు కూడా వ్యాయామాలు చేయడం విసుగు అనిపిస్తే, డ్యాన్స్ చేయండి . ఎందుకంటే డ్యాన్స్ కూడా ఒక మంచి వ్యాయామమే. డ్యాన్స్ అనేది మీ శరీరాన్ని కదిలించే ఒక ఉత్తేజకరమైన అభ్యాసం .
ఇది మీ శరీరంలోని ప్రతీ భాగాన్ని కదిలిస్తుంది, కండరాలను శ్రమను కల్పిస్తుంది. డ్యాన్స్ చాలా సరదాగా ఉంటుంది కాబట్టి మీకు శ్రమ అనేది అనిపించదు. ఈ డ్యాన్స్ లో మీరు ఎంచుకోవడానికి ఎన్నో రూపాలు ఉన్నాయి. సున్నితంగా చేసే శాస్త్రీయ నృత్యం అయినా, వయ్యారంగా గెంతులేసే వెస్ట్రన్ సల్సా అయినా, డ్యాన్స్ ఎక్సర్‌సైజ్ రెండూ మిళితమై ఉండే జుంబా నృత్యం అయినా, మీకు నచ్చినది ఏదైనా ఎంచుకోవచ్చు లేదా నాటు నాటుగా కుమ్మేయొచ్చు. ఏదీ కుదరకపోతే తీన్మార్ స్టెప్పులేసినా మంచిదే (Dance Your Way To Fitness). ఎటొచ్చి నృత్యంతో మీకు వ్యాయామం ద్వారా లభించే ఫలితం లభిస్తుంది.
Health Benefits of Dance
డ్యాన్స్ చేయడం వలన ఏరోబిక్స్, అలాగే బరువులు మోయడం వలన కలిగే వ్యాయామం ఫలితాలు లభిస్తాయి. మీరు నృత్యం చేసినప్పుడు అనేక శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు, అవి ఎలాంటివో ఇక్కడ చూడండి.
- గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది
- కండరాలు బలోపేతం అవుతాయి
- శరీరం సమతుల్యత లభిస్తుంది
- ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది
- ఎముకలు దృఢంగా మారతాయి
- శక్తి, సామర్థ్యాలు మెరుగుపడతాయి
- ఆధిక బరువు, చెడు కొవ్వు తగ్గుతుంది
- శరీర ఆకృతి మెరుగుపడుతుంది
- మానసిక స్థితి మెరుగుపడుతుంది
- చిత్తవైకల్యం నివారించవచ్చు
- జ్ఞాపకశక్తి పెరుగుతుంది
- ఒత్తిడి, ఆందోళనలు తగ్గుతాయి
- డిప్రెషన్ భావాలు తగ్గుతాయి
- ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
- చివరగా, మీరు బాగా డ్యాన్స్ చేయగలరు కూడా
మీకు డ్యాన్స్ చేయాలని ఉన్నా, ఎలా చేయాలో మార్గం తెలియకపోతే ఏదైనా డ్యాన్స్ స్కూల్, జుంబా క్లాసెస్, హెల్త్ క్లబ్‌లలో చేరండి.
ఈరోజు అంతర్జాతీయ నృత్య దినోత్సవం (International Dance Day). ప్రతి సంవత్సరం ఏప్రిల్ 29న ఈ వేడుకను జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్కృతులు, సమాజాలలో ఉన్నటువంటి నృత్య రూపాలు వెలికిలోకి తేవడం, నృత్యం ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడం, డ్యాన్స్ చేయడాన్ని ప్రోత్సహించడం ఈరోజుకు ఉన్న ఉద్దేశ్యాన్ని తెలియజేస్తుంది.
సంబంధిత కథనం