Golden Globe Awards 2023 | గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుకలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల నాటు నాటు హాట్ ఫ్యాషన్!
Golden Globe Awards 2023: గోల్డెన్ గ్లోబ్ అవార్డులు: SS రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్త్, రామ్ చరణ్ గోల్డెన్ గ్లోబ్స్ 2023కి హాజరయ్యారు. రామ్ చరణ్, రాజమౌళి రెడ్ కార్పెట్‌పై దేశీ లుక్ లో కనిపించగా, జూనియర్ ఎన్టీఆర్ క్లాసిక్ లుక్ లో అందంగా కనిపించారు.
Golden Globe Awards 2023: కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్‌లో 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమం జరుగుతోంది. కోవిడ్ మహమ్మారి, వైవిధ్యం లోపించిందనే కారణాలతో గత రెండేళ్లుగా నిలిచిపోయిన ఈ అవార్డుల వేడుక, 2023లో తిరిగి అట్టహాసంగా ప్రారంభమైంది. ఈసారి ఈ ప్రతిష్ఠాత్మాక అవార్డులకు S.S రాజమౌళి దర్శకత్వం వహించిన RRR సినిమా కూడా నామినేట్ కావడంతో భారతదేశ చలనచిత్ర పరిశ్రమ మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్శించింది. అందులోనూ ఒక తెలుగు సినిమా సత్తా చాటుతుండటంతో తెలుగు సినిమా స్థాయి ఏంటో ప్రపంచానికి పరిచయం చేసినట్లు అయింది. ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన RRR సినిమాలోని 'నాటు నాటు' పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దాసోహం అయింది. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాటకు ఈ అవార్డు దక్కింది.
ట్రెండింగ్ వార్తలు
ఈ అవార్డుల కార్యక్రమానికి దర్శకుడు SS రాజమౌళితో పాటు టాలీవుడ్ నుంచి ఇద్దరు పాన్ గ్లోబల్ స్టార్స్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యారు. జనవరి 11న, రామ్ చరణ్, NT రామారావు జూనియర్, SS రాజమౌళి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2023లో రెడ్ కార్పెట్ మీద నడిచారు. ఈ సందర్భంగా మన తారల ఫ్యాషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చరణ్- తారక్‌లు స్టైలిష్ అవతారాలతో అదరగొట్టారు.
రామ్ చరణ్ నల్లటి షేర్వాణీ సెట్‌లో సొగసైన నాటు లుక్‌లో భారతీయతను చాటగా, ఎన్టీఆర్ బ్లేజర్‌లో ట్రెండీ లుక్‌తో ఇండియన్ మోడ్రన్ మోడల్‌లా తళుక్కుమన్నారు. ఇక SS రాజమౌళి స్టైలిష్ షేర్వానీ, కుర్తా-పైజామా సెట్‌తో దేశీ టచ్ ఇచ్చారు.
ట్రిప్‌లో రామ్ చరణ్ తో పాటు వచ్చిన తన సతీమణి ఉపాసన కొణిదెల ప్రింటెడ్ బ్లూ, ఆవాల పసుపు చీరలో అందంగా కనిపించింది. మరోవైపు తన భర్త ఎన్టీఆర్‌కు అనుబంధంగా ప్రణతి నందమూరి క్లాసిక్ స్లీవ్‌లెస్ గౌనులో అద్భుతంగా కనిపించింది.
అటు సంగీత దర్శకులు ఎం.ఎం కీరవాణి, ఆయన సతీమణి సింపుల్‌గా, హుందాగా కనిపించగా, ఈ అందరిలోకెల్లా జక్కన్న, ఆయన సతీమణి నిండైన తెలుగు ఆహార్యంతో సంక్రాతి పండగ సంబరాన్ని గోల్డెన్ గ్లోబ్స్‌తో చాటారు.
సంబంధిత కథనం
టాపిక్