Weekend OTT Releases: ఈ వీకెండ్ ఓటీటీల్లో తప్పకుండా చూడాల్సిన సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే
20 March 2024, 13:48 IST
- Weekend OTT Releases: రాబోయే వీకెండ్‌లో మిమ్మల్ని టైంపాస్ చేయడానికి ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్ ఓటీటీల్లోకి రాబోతున్నాయి. ఇందులో ఓపెన్‌హైమర్, ఫైటర్, ఆపరేషన్ వాలెంటైన్ లాంటి సినిమాలతోపాటు లూటేరే వెబ్ సిరీస్ కూడా ఉంది.
ఈ వీకెండ్ ఓటీటీల్లో తప్పకుండా చూడాల్సిన సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే
Weekend OTT Releases: ఈ వీకెండ్ ఓటీటీల్లో చూడటానికి కొన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్, వెబ్ సిరీస్ ఉన్నాయి. వీటిలో కొన్ని ఇప్పటికే ఓటీటీల్లోకి వచ్చేయగా.. మరికొన్ని శుక్రవారం (మార్చి 22) రిలీజ్ కాబోతున్నాయి. ఈ సినిమాలు, వెబ్ సిరీస్ లను ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, ఆహా, జియో సినిమా, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లాంటి ఓటీటీల్లో చూడొచ్చు.
వీకెండ్ ఓటీటీల్లో చూడాల్సినవి
ఈ వారం ఓటీటీల్లోకి ఏడు ఆస్కార్స్ గెలిచిన ఓపెన్‌హైమర్ తోపాటు ఫైటర్, ఆపరేషన్ వాలెంటైన్, భూతద్ద భాస్కర్, లూటేరే లాంటి మూవీస్ వెబ్ సిరీస్ వస్తున్నాయి. వీటిని ఏ ఓటీటీల్లో చూడాలో మీరే చూడండి.
భూతద్దం భాస్కర్ నారాయణ - ఆహా
శివ కందుకూరి నటించిన భూతద్దం భాస్కర్ నారాయణ మూవీ ఆహా ఓటీటీలోకి శుక్రవారం (మార్చి 22) రాబోతోంది. ఇదొక మిస్టరీ థ్రిల్లర్ మూవీ. వరుస హత్యల వెనుక కారణమేంటో తెలుసుకునే ఓ యువ డిటెక్టివ్ చుట్టూ తిరిగే కథే ఈ భూతద్దం భాస్కర్ నారాయణ మూవీ.
లూటేరే వెబ్ సిరీస్ - డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
లూటేరే వెబ్ సిరీస్ శుక్రవారం (మార్చి 22) డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో అడుగుపెడుతోంది. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ హన్సల్ మెహతా క్రియేట్ చేసిన ఈ సిరీస్ కు అతని తనయుడు జై మెహతా దర్శకత్వం వహించాడు. సోమాలియా పైరేట్స్ చేతుల్లో హైజాక్ కు గురైన ఓ భారతీయ నౌక, దానిని, అందులోని సిబ్బందిని విడిపించేందుకు చేసే సాహసమే ఈ లూటేరే స్టోరీ.
అబ్రహం ఓజ్లర్ - హాట్‌స్టార్
మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అబ్రహం ఓజ్లర్ బుధవారమే (మార్చి 20) హాట్‌స్టార్ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీలో జయరాం, మమ్ముట్టి నటించారు. బాక్సాఫీస్ దగ్గర సక్సెసైన ఈ సినిమాను ఇప్పుడు ఓటీటీలో చూడొచ్చు.
యే వతన్ మేరే వతన్ - ప్రైమ్ వీడియో
అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా రిలీజ్ అవుతున్న సారా అలీ ఖాన్ మూవీ యే వతన్ మేరే వతన్. గురువారం (మార్చి 21) నుంచి ఈ సినిమా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. 1942లో దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఉషా మెహతా జీవితం ఆధారంగా రూపొందించిన సినిమా ఇది.
ఫైటర్ - నెట్‌ఫ్లిక్స్
ఈ ఏడాది జనవరి 25న రిలీజైన ఫైటర్ మూవీ రెండు నెలల తర్వాత గురువారం (మార్చి 21) నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. హృతిక్ రోషన్, దీపికా పదుకోన్, అనిల్ కపూర్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించింది.
ఓపెన్‌హైమర్ - జియో సినిమా
ఈ మధ్యే ఏడు ఆస్కార్స్ గెలిచిన హాలీవుడ్ మూవీ ఓపెన్‌హైమర్. ఆటం బాంబు కనిపెట్టిన ఓపెన్‌హైమర్ బయోపిక్ ఇది. ఈ సినిమా గురువారం (మార్చి 21) నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది.
ఇక ఇప్పటికే హనుమాన్, మర్డర్ ముబారక్, భ్రమయుగం లాంటి సినిమాలు గత వారమే ఓటీటీల్లోకి వచ్చాయి. అవి చూడకపోయి ఉంటే.. ఈ వీకెండ్ వాటినీ కవర్ చేసేయండి.
టాపిక్