Bhoothaddam Bhaskar Narayana OTT: ఓటీటీలోకి రానున్న థ్రిల్లర్ మూవీ ‘భూతద్దం భాస్కర్ నారాయణ’.. ఎప్పుడంటే!-bhoothaddam bhaskar narayana movie set to release on aha ott platform expected steaming date is march 22 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bhoothaddam Bhaskar Narayana Ott: ఓటీటీలోకి రానున్న థ్రిల్లర్ మూవీ ‘భూతద్దం భాస్కర్ నారాయణ’.. ఎప్పుడంటే!

Bhoothaddam Bhaskar Narayana OTT: ఓటీటీలోకి రానున్న థ్రిల్లర్ మూవీ ‘భూతద్దం భాస్కర్ నారాయణ’.. ఎప్పుడంటే!

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 15, 2024 10:25 PM IST

Bhoothaddam Bhaskar Narayana OTT Release: భూతద్దం భాస్కర్ నారాయణ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్ మూవీ స్ట్రీమింగ్‍కు ఎప్పుడు రానుందో సమాచారం బయటికి వచ్చింది.

Bhoothaddam Bhaskar Narayana OTT: ఓటీటీలోకి రానున్న థ్రిల్లర్ మూవీ ‘భూతద్దం భాస్కర్ నారాయణ’.. ఎప్పుడంటే!
Bhoothaddam Bhaskar Narayana OTT: ఓటీటీలోకి రానున్న థ్రిల్లర్ మూవీ ‘భూతద్దం భాస్కర్ నారాయణ’.. ఎప్పుడంటే!

Bhoothaddam Bhaskar Narayana OTT: భూతద్దం భాస్కర్ నారాయణ సినిమా మంచి బజ్ మధ్య వచ్చింది. ఈ ఫ్యాంటసీ డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ మార్చి 1వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటంతో మంచి అంచనాలను ఈ చిత్రం నెలకొల్పింది. దీంతో మోస్తరు వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రంలో శివ కందూకూరి హీరోగా నటించారు. పురుషోత్తమ్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్‍ దక్కించుకుంది. ఇప్పుడు ఈ భూతద్దం భాస్కర్ నారాయణ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.

ఏ ప్లాట్‍ఫామ్‍లో అంటే..

భూతద్దం భాస్కర్ నారాయణ సినిమా ఓటీటీ హక్కులను ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్ దక్కించుకుంది. ట్రైలర్ ఆకట్టుకోవటంతో రిలీజ్‍కు ముందే ఓటీటీ డీల్‍ను ఈ చిత్రం సొంతం చేసుకుంది. కాగా, భూతద్దం భాస్కర్ నారాయణ చిత్రం ఆహా ఓటీటీలో మార్చి 22వ తేదీన స్ట్రీమింగ్‍కు రానున్నట్టు తాజాగా సమాచారం బయటికి వచ్చింది.

భూతద్దం భాస్కర్ నారాయణ సినిమా థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల్లోగానే ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. మార్చి 22వ తేదీన ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రావడం దాదాపు ఖాయమైనట్టు తెలుస్తోంది. అయితే, దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

భూతద్దం భాస్కర్ నారాయణ చిత్రంలో శివ కందుకూరి ప్రధాన పాత్ర పోషించగా.. రాశి సింగ్, దేవీ ప్రసాద్, వర్షిణి సౌందరరాజన్, శివకుమార్, షఫీ, సురభి సంతోష్, శివన్నారాయణ కీరోల్స్ చేశారు. డైరెక్టర్ పురుషోత్తం రాజ్ తెరకెక్కించిన ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల, విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు.

భూతద్దం భాస్కర్ నారాయణ చిత్రాన్ని స్నేహల్ జంగల, శశిధర్ కాశీ, కార్తిక్ ముడుంబి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి గౌతమ్ జీ సినిమాటోగ్రఫీ చేయగా.. గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ చేశారు.

స్టోరీ బ్యాక్‍డ్రాప్ ఇదే

మర్డర్ మిస్టరీని ఓ డిటెక్టివ్ ఛేదించడం.. ఈ క్రమంలో అతడికి ఎదురయ్యే సవాళ్ల చుట్టూ భూతద్దం భాస్కర్ నారాయణ సినిమా తిరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఓ సీరియల్ కిల్లర్ వరుసగా మహిళలను హత్య చేస్తుంటాడు. ఆ శవాలను అడవిలో పడేసి తలలను మాత్రం తన వెంట తీసుకెళతాడు. అయితే, హత్యకు గురైన వ్యక్తుల గురించి మిస్సింగ్ కేసులు నమోదు కాకపోవడం, శవాలకు తలలు లేకపోవడంతో ఈ మర్డర్ కేసులను దర్యాప్తు చేయడం పోలీసులకు సవాలుగా మారుతుంది. ఈ క్రమంలో డిటెక్టివ్ భూతద్దం భాస్కర్ నారాయణ (శివ కందూకూరి) ఈ హత్య కేసుల మిస్టరీని ఛేదించేందుకు రెడీ అవుతాడు. ఈ వరుస హత్య విషయంలో అతడికి వ్యక్తిగతంగానూ కనెక్ష్ ఉంటుంది. దీంతో సీరియస్‍గా దర్యాప్తు చేస్తాడు. ఈ హత్యలు చేస్తున్నదెవరు? కారణాలేంటి? భూతద్దం భాస్కర్ నారాయణకు ఈ కేసులతో సంబంధం ఏంటి? ఈ హత్యల మిస్టరీని ఛేదించే క్రమంలో అతడిది ఎదురైన సవాళ్లు ఏంటి? అనేవే ఈ సినిమాలో ప్రధానంగా ఉంటుంది.

కాగా, ఆహా ఓటీటీలోకి నేడు (మార్చి 15).. మిక్స్ అప్ సినిమా స్ట్రీమింగ్‍కు వచ్చింది. బోల్డ్ కంటెంట్‍తో ఇద్దరు జంటల స్టోరీగా ఈ చిత్రం ఉంది. ఈ మూవీలో ఆదర్శ్ బాలకృష్ణ, అక్షర గౌడ, కమల్ కామరాజు, పూజా జావేరి కీలకపాత్రలు పోషించారు.

Whats_app_banner