తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Waltair Veerayya Vs Veera Simha Reddy: వాల్తేర్ వీర‌య్య వ‌ర్సెస్ వీర‌సింహారెడ్డి - ర‌న్ టైమ్ ఏది ఎక్కువంటే

Waltair Veerayya vs Veera Simha Reddy: వాల్తేర్ వీర‌య్య వ‌ర్సెస్ వీర‌సింహారెడ్డి - ర‌న్ టైమ్ ఏది ఎక్కువంటే

15 December 2022, 9:17 IST

  • Waltair Veerayya vs Veera Simha Reddy: చిరంజీవి వాల్తేర్ వీర‌య్య‌, బాల‌కృష్ణ వీర‌సింహారెడ్డి సినిమాలు సంక్రాంతికి ప్రేక్ష‌కుల‌ ముందుకు రాబోతున్నాయి. ఈ సినిమాల ర‌న్‌టైమ్ ఎంతంటే...

చిరంజీవి, శృతిహాస‌న్‌
చిరంజీవి, శృతిహాస‌న్‌

చిరంజీవి, శృతిహాస‌న్‌

Waltair Veerayya vs Veera Simha Reddy: ఈ సారి సంక్రాంతికి బాక్సాఫీస్ వ‌ద్ద స్టార్ హీరోలు చిరంజీవి, బాల‌కృష్ణ పోటీప‌డ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. బాల‌కృష్ణ వీర‌సింహారెడ్డి జ‌న‌వ‌రి 12న రిలీజ్ కానుండ‌గా, చిరంజీవి వాల్తేర్ వీర‌య్య జ‌న‌వ‌రి 13న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ది. ఈ సినిమాల ర‌న్‌టైమ్ తెలుగు ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. వీర‌సింహారెడ్డి ర‌న్‌టైమ్ 2.43 నిమిషాలుగా ఉండ‌గా వాల్తేర్ వీర‌య్య మాత్రం 2.33 నిమిషాల ర‌న్‌టైమ్‌తో రూపొందిన‌ట్లు తెలిసింది.

ట్రెండింగ్ వార్తలు

NNS 7th May Episode: భూమ్మీదకు తిరిగి రానున్న అరుంధతి ఆత్మ.. అమర్ ఇంటికి వెళ్లిన రామ్మూర్తికి గుండెపోటు!

Tollywood: నాగ‌చైత‌న్య మూవీతో తెలుగులో హీరోయిన్‌గా వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కెరీర్ ప్రారంభం కావాల్సింది...కానీ

Aavesham OTT Release Date: ఆవేశం ఓటీటీ రిలీజ్ డేట్.. రూ.150 కోట్ల సినిమా స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?

Parthu Telugu OTT: ఓటీటీలోకి బిగ్‌బాస్ బ్యూటీ సైకో కిల్ల‌ర్ మూవీ - ట్విస్ట్‌ల‌కు మైండ్ బ్లాక్ కావాల్సిందే!

చిరంజీవి వాల్తేర్ వీర‌య్య కంటే బాల‌కృష్ణ వీర‌సింహారెడ్డి ప‌ది నిమిషాల లెంగ్త్ ఎక్కువే ఉండ‌టం గ‌మ‌నార్హం. రాయ‌ల‌సీమ బ్యాక్‌డ్రాప్‌లో వీర‌సింహారెడ్డి సినిమా తెర‌కెక్కుతోంది. ఈ సినిమాకు గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇందులో బాల‌కృష్ణ డ్యూయ‌ల్ షేడ్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌బోతున్నారు.

జాల‌ర్ల బ్యాక్‌డ్రాప్‌లో ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వాల్తేర్ వీర‌య్య సినిమా రూపొందుతోంది. ర‌వితేజ మ‌రో హీరోగా న‌టిస్తోన్న ఈ సినిమాకు బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. ఈ రెండు సినిమాల్లో శృతిహాస‌న్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది.

మైన‌స్ ఎనిమిది డిగ్రీల టెంప‌రేచ‌ర్‌లో వాల్తేర్ వీర‌య్య షూటింగ్‌

ప్ర‌స్తుతం వాల్తేర్ వీర‌య్య షూటింగ్ ఫ్రాన్స్‌లో జ‌రుగుతోంది. చిరంజీవి, శృతిహాస‌న్‌లో శ్రీదేవి అనే రొమాంటిక్ డ్యూయెట్ సాంగ్‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఈ పాట షూటింగ్‌కు సంబంధించిన మేకింగ్ వీడియోను చిరంజీవి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానుల‌తో పంచుకున్నారు.

పూర్తిగా మంచుతో నిండిన ప్ర‌దేశంలో మైన‌స్ ఎనిమిది డిగ్రీల టెంప‌రేచ‌ర్‌లో షూటింగ్ చేస్తోన్న‌ట్లు చిరంజీవి తెలిపారు. శృతిహాస‌న్‌తో క‌లిసి దిగిన ఓ రొమాంటిక్ స్టిల్‌ను అభిమానుల‌తో పంచుకున్నాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.