తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Varisu Hindi Collection First Week: వారిసు హిందీ క‌లెక్ష‌న్స్ - కాంతారను బీట్ చేయ‌లేక‌పోయిన విజ‌య్ సినిమా

Varisu Hindi Collection First Week: వారిసు హిందీ క‌లెక్ష‌న్స్ - కాంతారను బీట్ చేయ‌లేక‌పోయిన విజ‌య్ సినిమా

22 January 2023, 15:28 IST

  • Varisu Hindi Collection First Week: విజ‌య్ వారిసు హిందీ వెర్ష‌న్ తొలి వారంలో అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లుగా క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకోలేక‌పోయింది. పొన్నియ‌న్ సెల్వ‌న్ -1, కాంతార హిందీ డ‌బ్‌ వెర్ష‌న్స్‌లో స‌గం క‌లెక్ష‌న్స్‌ కూడా విజ‌య్ సినిమా రాబ‌ట్ట‌లేక‌పోయిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

విజ‌య్ వారిసు
విజ‌య్ వారిసు

విజ‌య్ వారిసు

Varisu Hindi Collection First Week: కోలీవుడ్‌లో రెండు వంద‌ల‌ కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన విజ‌య్ వారిసు సినిమా బాలీవుడ్‌లో మాత్రం అంచ‌నాల‌కు అందుకోలేక‌పోయింది. తొలి వారంలో కేవ‌లం 6.22 కోట్ల‌ క‌లెక్ష‌న్స్ మాత్ర‌మే రాబ‌ట్టింది. విజ‌య్‌కి ఉన్న క్రేజ్ దృష్టా వారిసు హిందీ వెర్ష‌న్ తొలి వారంలో ప‌ది కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టే అవ‌కాశం ఉన్న‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేశాయి. కానీ ఆ టార్గెట్‌ను విజ‌య్ సినిమా చేరుకోలేక‌పోయింది.

ట్రెండింగ్ వార్తలు

Heeramandi OTT: ఓటీటీలో దూసుకుపోతున్న పీరియాడికి డ్రామా.. నెటిజన్ల ప్రశంసలు.. సిరీస్ ఎక్కడ చూస్తారంటే?

Adivi Sesh: అదే కొనసాగిస్తే గర్వపడే స్థాయికి వెళ్తుంది.. హీరోయిన్‌పై అడవి శేష్ కామెంట్స్ వైరల్

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సర్వైవల్ మిస్టరీ థ్రిల్లర్ ఆకట్టుకుందా?

Romeo OTT Release Date: విజయ్ ఆంటోనీ ‘రోమియో’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారు.. ఏ ప్లాట్‍ఫామ్‍లోకి వస్తుందంటే..

ఇటీవ‌ల హిందీలో డ‌బ్ అయిన సౌత్ సినిమాల‌తో పోలిస్తే వారిసు చాలా త‌క్కువ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్ట‌డం గ‌మ‌నార్హం. రిష‌బ్ శెట్టి హీరోగా న‌టించిన కాంతార సినిమా హిందీలో ఫ‌స్ట్ వీక్‌లో 15 కోట్ల క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ది. పొన్నియ‌న్ సెల్వ‌న్ - 1 దాదాపు 16 కోట్ల వ‌సూళ్ల‌ను సొంతం చేసుకున్న‌ది. వాటిలో స‌గం కూడా వారిసు సినిమాకు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

కానీ విజ‌య్ కెరీర్‌లో హిందీలో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమా వారిసు నిలిచింది. గ‌తంలో మాస్ట‌ర్ హిందీ డ‌బ్ వెర్ష‌న్ 4.73 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ఆ రికార్డ్‌ను వారిసు బ్రేక్ చేసింది. ఫ్యామిలీ ఎమోష‌న్స్‌కు ప్రాధాన్య‌మిస్తూ ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి వారిసు సినిమాను తెర‌కెక్కించాడు. మ‌న‌స్ప‌ర్థ‌ల‌తో విడిపోయిన త‌న కుటుంబాన్ని ఏకం చేసిన ఓ కొడుకు క‌థ‌తో ఈ సినిమా రూపొందింది. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్‌రాజు ఈ సినిమాను నిర్మించాడు.

వారిసులో విజ‌య్‌కి జోడీగా ర‌ష్మిక మంద‌న్న న‌టించింది. కోలీవుడ్‌లో ప‌ది రోజుల్లో ఈ సినిమా 235 కోట్ల గ్రాస్‌ను సొంతం చేసుకున్న‌ది. విజ‌య్ కెరీర్‌లో హ‌య్యెస్ట్ ఓపెనింగ్స్‌ను రాబ‌ట్టిన సినిమాగా నిలిచింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.